- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరుల త్యాగాల ఫలితం ఇదేనా?
భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, శివరాం రాజ్‌గురు త్యాగం దేశ స్వాతంత్ర్యానికి దోహదం చేసింది. నేడు యువతకు ఉపాధి, నైపుణ్యాల కొరతతో ఎదురయ్యే సవాళ్లపై విశ్లేషణ, నవభారత నిర్మాణంలో యువత పాత్ర.

ఈ దేశం నాకేమిచ్చింది? అని మిడిమిడి జ్ఞానంతో జీవించే ప్రతి పౌరుడికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన, విప్లవకా రులుగా చెప్పుకోబడే భగత్‌సింగ్, సుఖ్ దేవ్ థాపర్, శివరాం రాజ్‌గురులను లాహోర్ జైలులో ఉరితీశారు.. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా మార్చి 28ను భారతదేశంలో షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం)గా జరుపు కుంటున్నాం. నవ్వుతూ ఉరికంబమెక్కిన ఈ ముగ్గురు వీరులూ ఈ దేశానికి సాంఘిక, ఆర్థిక, అసమానతలు లేని స్వతంత్ర్యం సిద్దించాలని కోరుకున్నారు. ఈ ముగ్గురు యువకుల బలిదానం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య కాంక్షను మరింత రగిలించి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసింది. నూనూగు మీసాల ప్రాయంలో దేశం కోసం తమ ప్రాణాలను గడ్డి పరకల్లాగా తుంచేయడం ఒక మహోన్నత లక్ష్యం ఉన్నవారికే సాధ్యమవుతుంది కదా. ఈ వీరుల త్యాగంతో సిద్దించిన స్వతంత్ర్యం నేడు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. దేశంలో ఉపాధి అవకాశాలు లేదు, నిరుద్యోగం తాండవిస్తుంది. చదివిన చదువుకు కొలువులు రాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన పాలకులు యవతకు మొండిచెయ్యినే చూయిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ నిరుద్యోగ భారతాన్ని తయారు చేస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా వృద్ధి చెందిన ప్రైవేట్ రంగంలో సైతం మన దేశ యువతరం తక్కువే. ఆధునిక యుగంలో నైపుణ్యాలు లేకపోవడంతో ఆ ఉద్యో గాలను అందుకోలేకపోతున్నారు.. నూతన నైపుణ్యాలను నేర్పడంలో కళాశాలలు వందశాతం విఫలమవుతున్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులకు ఆదరణ కరువైంది. కాలేజీల్లోంచి బయట కువచ్చిన వేల మంది విద్యార్థులు కొత్త కోర్సులంటూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు.. మొత్తానికి యువతరం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యువతరం మెరుగైతేనే నవ భరతాన్ని చూడగలుతాం. లేదంటే అంధకారంలో మిగిలే ఈ దేశాన్ని చూస్తాం. ఆ అమరవీరుల సాక్షిగా నవభారత నిర్మాణానికి వాటు పడటం మనందరి బాధ్యత!
- రాగుల భవిత






