టెట్ అర్హత మార్కులు.. తగ్గింపు లేనట్టేనా?

by Ravi |   (  Updated:2026-04-14 00:31:00  IST  )

సుప్రీంకోర్టు తీర్పుతో 2027 సెప్టెంబర్‌లోపు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన సంకటంలో తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా క్వాలిఫైయింగ్ మార్కులను తగ్గించడంతో పాటు సబ్జెక్టు వారీగా పరీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

టెట్ అర్హత మార్కులు.. తగ్గింపు లేనట్టేనా?
X

ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2027 సెప్టెంబర్ 30లోగా వారందరూ టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాల్సిందే! లేదంటే ఉద్యోగాలు కోల్పోవాల్సిందే. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో టెట్ నిర్వ హించి ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు కూడా అవకాశం కల్పించిన ప్రభుత్వం మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగులతో పాటు ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం ఆసన్నమైంది. అయితే ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు టెట్ అర్హత మార్కులు తగ్గించడంతో తెలంగాణ ప్రభు త్వం కూడా క్వాలిఫైయింగ్ మార్కు లను తగ్గించే విధంగా ప్రాతినిధ్యం చేయా లని ఉపాధ్యాయులు సంఘాలను కోరుతున్నారు. బీహార్‌ అర్హత మార్కులు 50%, మేఘాలయ 45% తగ్గించాయి. ఉత్తర‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా తగ్గించే యోచనలో ఉన్నాయి.. తమిళనాడు ప్రభు త్వం ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు సంవత్సరానికి మూడు సార్లు ప్రత్యేక టెట్‌ను నిర్వహిస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇప్పటికీ పాత అర్హత మార్కులనే నిర్ణయించింది. పైగా పొంతన లేని సిల బస్‌తో పరీక్ష రాయాల్సి వస్తుంది. రెండు దశాబ్దాలకు పైగా జీవశాస్త్రం బోధి స్తున్న ఉపాధ్యాయుడు ఇప్పుడు గణితం నేర్చు కుని టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఒరిగేదేమిటి? భాషా పండితులది అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో అర్హత మార్కులు తగ్గిస్తే ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం దొరుకుతుంది. తాము బోధిస్తున్న సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తే సబబుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసు కుని అర్హత మార్కులపై పునరాలోచన చేయడం అత్యవసరం.

-సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS

9000674747

Next Story