ముస్లిం ఓటర్ల తొలగింపు సహేతుకమా?

by Ravi |   (  Updated:2025-10-24 00:45:32  IST  )

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంటారు. ఈ ప్రక్రియలో 6 లక్షల ముస్లిం

ముస్లిం ఓటర్ల తొలగింపు సహేతుకమా?
X

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ జరిగింది. దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంటారు. ఈ ప్రక్రియలో 6 లక్షల ముస్లిం ఓటర్లు తొలగించబడ్డారా? ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రక్రియ సరైనదేనా? ఎలాంటి లోపాలు లేవా? ఈ విషయాలపై చర్చ జరుగుతోంది. బిహార్‌లో ఎస్‌ఐఆర్ 22 సంవత్సరాల తర్వాత జరిగింది. ముందు ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. ఆగస్టు 1న డ్రాఫ్ట్ జాబితాలో 7.24 కోట్లు. అంటే 65 లక్షల మంది తొలగించబడ్డారు. ముస్లిం ఓటర్లు అధికంగా తొలగించ బడ్డారు అని పిటిషనర్లు ఆరోపణలు చేశారు. 65 లక్షలలో 25 శాతం ముస్లింలు. చివరి తొలగింపులో 3.66 లక్షలలో 34 శాతం ముస్లింలు.. సాఫ్ట్‌వేర్ ద్వారా పేర్ల ఆధారంగా అంచనా వేశారు.

ప్రతిపక్షాలపై ఈసీ దాడి..

హడావిడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ (సర్‌)తో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారింది. పెద్దఎత్తున ఓట్‌ చోరీ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి జవాబు ఇచ్చి, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ (ఇసి) గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతోంది. తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ ప్రకటించారు.

చరిత్రలో రికార్డు స్థాయి తొలగింపు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అధికారిక లెక్కల ప్రకారమే బీహార్‌లో వయోజన జనాభా ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 8.22 కోట్లు! దీనిని పరిగణలోకి తీసుకుంటే బీహార్‌ జనాభాలో పది శాతం మంది ఓటు హక్కు కోల్పోయారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక రాష్ట్రంలో ఇంతమంది ఓటుహక్కు కోల్పోవడం ఒక రికార్డు! అంతేకాదు, ముసాయిదా జాబితాలో ఓటు హక్కు కోల్పోయిన వారిలో 25 శాతం, తుది జాబితాలో ఓటు హక్కు కోల్పోయిన వారిలో 34 శాతం మంది ముస్లింలే! మొత్తం మీద ఆరు లక్షల మంది ముస్లింలు ఓటర్ల జాబితా నుండి తొలగింపునకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని లక్ష్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆరోపణల్ని ఖండించినా అనుమానాలే..

ఈసీఐ ఆరోపణలను తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలో మతం రికార్డు లేదనీ. ఆరోపణలు కమ్యూనల్‌గా ఉన్నాయనీ. ప్రక్రియ ఖచ్చితమైనదని ఈసీ వాదన. పిటిషనర్లు ఎడీఆర్, యోగేంద్ర యాదవ్. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. 81 లక్షల ఓటర్లు తప్పిపోయారు అని. 2019 పాపులేషన్ ప్రొజెక్షన్ ఆధారంగా చెప్పారు. ప్రొజెక్షన్‌లు ఊహలే కానీ ఖచ్చితమైనవి కావని ఈసీఐ తిరస్కరించింది. సుప్రీం కోర్టు విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్య కాంత్, జోయమాల్య బాగ్చి బెంచ్. ఈసీఐ తొలగించిన, జోడించిన పేర్లు ప్రచురించాలని ఆదేశించింది. ఈసీఐ ప్రక్రియలో ఉంది అని చెప్పింది. కేసు ముగియలేదు. ఈసీఐ ప్రక్రియ సరైనదే అని చెబుతోంది. లోపాలు లేవు అని. కానీ ఆరోపణలు కొనసాగుతున్నాయి. ముస్లిం ఓటర్లపై ఈ తొలగింపు ప్రభావం ఉందా? ఇది చర్చనీయాంశం. ఏదేమైనా ఓటర్ల హక్కులు కాపాడాలి. ఈ వివాదం బిహార్ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఇతర రాష్ట్రాలకు విస్తరించవచ్చు. సుప్రీం కోర్టు నిర్ణయం కీలకం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలి.

-డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Next Story