- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరా?.. ప్రభుత్వం ఉపశమనం కలిగించాలి!
రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టు తీర్పు మేరకు పదవీ విరమణ కంటే ఐదేళ్లు ఎక్కువ సర్వీస్ ఉన్న వారందరూ టెట్‌కు హాజరు కావచ్చని, విద్యార్హతలలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులు 45 శాతం మార్కులు

రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టు తీర్పు మేరకు పదవీ విరమణ కంటే ఐదేళ్లు ఎక్కువ సర్వీస్ ఉన్న వారందరూ టెట్‌కు హాజరు కావచ్చని, విద్యార్హతలలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాలన్నది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయిస్తున్నట్లు తాజా జీవో 36లో వివరించింది. దీంతో సర్వీస్ ఉపాధ్యాయులు తమకు టెట్ తప్పనిసరి అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఉపశమనం కలిగించాలి!
టెట్ తాజా మార్గదర్శకాలు ఇన్ సర్వీస్ టీచర్లను గందర గోళానికి గురి చేస్తున్నాయి. 2011 ఏప్రిల్ 16న విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వు 51 రూల్ 11 ప్రకారం ఎన్‌సీటీఈ 2010 ఆగస్ట్ 8న ఇచ్చిన నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010 నాటికి డీఎస్సీ, ఇతర నియామక పద్ధతుల ద్వారా ఎంపికై పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఉంటుందని తెలుపు తున్నది. అయితే దీన్ని తాజా ఉత్తర్వుల్లో ప్రస్తావించకపోవడం, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకోకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఇప్పటికే టెట్ అర్హత లేకుండా 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని ఉన్నవారికి టెట్ పరీక్ష తప్పే పరిస్థితి లేనట్లు కనిపిస్తున్నది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది.
ఈ అవకాశం చూడాలి!
ప్రస్తుత జీవో 36 రూల్ 9.2ను పరిశీలిస్తే 2012లో టెట్ పాసైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా తాజా నోటిఫికేషన్ ప్రకారం మరలా ఉత్తీర్ణత కోసం టెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. దీనివల్ల ముఖ్యంగా లాంగ్వేజ్ ఉపాధ్యాయుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. అయితే టీచర్ ఎలి జిబిలిటీ టెస్ట్ అంటే ఒక అర్హత పరీక్ష మాత్రమే అయినందున అన్ని వర్గాల అభ్యర్థులకు కామన్ క్వాలిఫైడ్ మార్కులు ఉండడం న్యాయంగా భావించి ప్రభుత్వం ఆ అవకాశం కల్పించాలి. అలాగే ఇప్పటికే డీఎస్సీ పరీక్షలో మెథడాలజీ అంశాలను పరీక్షిస్తున్నందున టెట్‌లో మెథడాలజీ మినహాయించి గ్రూప్స్ పరీక్షలు తీరులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందరికీ కామన్ సిలబస్‌గా సైకాలజీ, పెడగాజి, తెలుగు వ్యాకరణం, ఇంగ్లీష్ వ్యాకరణం, సాధారణ గణిత పరిజ్ఞానం, సాధారణ సైన్స్ పరిజ్ఞానం, సాధారణ సోషల్ పరిజ్ఞానం, అవసరమైతే కంప్యూటర్ ఐటీ వగైరా అన్నీ కలుపుకొని జనరల్ కంటెంట్‌తో సింగిల్ పేపర్ ఏర్పాటు చేస్తేనే ప్రతి ఒక్కరికి సమన్యాయం జరిగే అవకాశంపై విద్యాశాఖ ఆలోచించాల్సి ఉంది. అలా కాకుండా చేస్తే ఇన్ సర్వీస్ టీచర్లు ఉత్తీర్ణత పొందే అవకాశం లేనట్లు సిలబస్ ఉంది.
ఈ టీచర్లపై భారం మోపొద్దు!
సిలబస్ పూర్తి వివరాలను పరిశీలిస్తే గణిత సబ్జెక్టు, సైన్స్ సబ్జెక్టులకు కేవలం 20 మార్కులకు మాత్రమే సబ్జెక్టు ప్రశ్నలు వస్తాయి. సోషల్‌కు 60 మార్కులకు వస్తాయి. తెలుగు, ఇంగ్లీషు సబ్జెక్టుల వారికి 90 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. సోషల్ సబ్జెక్టు కాంబినేషన్‌లో బిఏ గణితం చేసిన వారికి కేవలం 20 మార్కులకు మాత్రమే గణితం సిలబస్ పరిమితం చేయబడింది. సమాన భారంలో మార్కులు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని గణితం, సైన్స్ సబ్జెక్టులు కూడా కంటెంట్ మెథడాలజీ 60 మార్కులకు పెంచాలన్న అభ్యర్థుల కోరిక విద్యాశాఖ పరిశీలించాల్సి ఉంది. పెంచినప్పుడు మాత్రమే వెసులుబాటు కలుగుతుంది. వీటన్నింటిని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలించి అందరూ అభ్యర్థులకు సమన్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా టెట్ అంశంలో జనరల్ అభ్యర్థులకు, ఇన్‌సర్వీస్ టీచర్లకు భారం కానున్న అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ పునః సమీక్ష జరపాల్సి ఉంది.
-సి.వి ప్రసాద్
90590 76177






