- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయం అందరికీ సమానమేనా?
భారతదేశ న్యాయవ్యవస్థ నిజంగా అందరికీ సమానమా? ఈ ప్రశ్న మరోసారి తీవ్రంగా చర్చకు వచ్చింది. ఇందుకు కారణం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. డి.వై. చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు..

భారతదేశ న్యాయవ్యవస్థ నిజంగా అందరికీ సమానమా? ఈ ప్రశ్న మరోసారి తీవ్రంగా చర్చకు వచ్చింది. ఇందుకు కారణం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డా. డి.వై. చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు.. ఇటీవల ఆయన మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బెయిల్ అంశంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన ప్రకారం, విచారణ తగిన సమయంలో పూర్తయ్యే పరిస్థితి లేకపోతే, లేదా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే, బెయిల్ ఇవ్వడం రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? భారత న్యాయ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే, దేశంలో 75 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్‌లో ఉన్నారు. వీరిలో ఎంతోమంది వారి ఎదుర్కొంటున్న ఆరో పణలు నిరూపణపైతే పడే శిక్ష కంటే ఎక్కువ సమయం జైలు జీవితం గడుపుతున్నారు. వీరందరికీ బెయిల్ రావాలి. కానీ అలా జరుగుతుందా? ఇక ప్రభుత్వ వ్యతి రేకతపై గళం విప్పిన మేధావులు, కార్యకర్తలు, నాయకులు ఏళ్ల తరబడి జైళ్లలోనే ఉంటున్నారు. అంతేందుకు ఒకే వృత్తి గల వారికి కూడా న్యాయం సమానంగా దొరకలేదు.. అర్నబ్ గోస్వామి, సిద్ధిక్ కప్పస్ ఇద్దరూ జర్నలిస్టులే.. కానీ న్యాయం మాత్రం ఒకేలా జరగలేదు. అర్నబ్ అరెస్ట్ అయినప్పుడు, సెలవు రోజునే సుప్రీంకోర్టు విచారణ చేసి బెయిల్ ఇచ్చింది. ‘ఒకరి రాజ్యాంగ హక్కును కాపాడటానికి సెలవులు అడ్డు కావు’ అని కోర్టు చెప్పింది. అదే సమయంలో, హాథ్రస్ ఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న సిద్ధిక్ కప్పస్‌ను అరెస్ట్ చేసి, UAPA వంటి కఠిన చట్టాలు పెట్టారు. ఆయనకు బెయిల్ రావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రంలో అత్యంత కీలకమైన అంశం గ్రూప్-1 నియామ కాలు.. ఈ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని కోర్టును ఆశ్రయిస్తే, సింగిల్ బెంచ్ నెలల తరబడి వాదనలు విని పరీక్షను రద్దు చేసింది. కానీ సెలక్ట్ అయిన వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తే వాదనలు వినకుండానే దానిపై స్టే విధించింది. స్టే ఇవ్వడానికి వేగంగా స్పందించిన కోర్టు.. తుది తీర్పును ఎందుకు ఇవ్వలేకపోతోంది..? మన న్యాయవ్యవస్థ, తెలంగాణ నిరుద్యోగులను సిద్దీక్ కప్పస్‌లాగా చూస్తుందా? లేదా అర్నబ్ గోస్వామిగా చూస్తుందా? దానికి సమాధానం రాబోయే కాలమే నిర్ణయిస్తుంది.
- బక్కొళ్ల శ్రీకర్
96769 02286






