- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదోన్నతి రావాలంటే.. టెట్ పాస్ కావాల్సిందేనా?
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని సమూల మార్పులు చేశారు. అందులో

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని సమూల మార్పులు చేశారు. అందులో అర్హతలకు సంబంధించిన అంశాలు కొన్ని కాగా, పరీక్ష రాయడానికి ముందుగా అర్హతలతో పాటుగా ఎలిజిబిలిటీ పరీక్ష పేరుతో వృత్తి సామర్థ్యాలను మరింతగా పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో టెట్ ప్రవేశపెట్టారు. అందులో అనేక లోపాలున్నప్పటికీ దానిపై పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.
అర్హత తప్పనిసరి చేయడంతో..
అయితే ఆగస్టు 2010 తర్వాత జరిగిన అన్ని నియామకాలు టెట్‌కు లోబడి జరుగుతున్నాయి. కానీ అప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని NCTE నిబంధనలు అని నొక్కి చెప్పలేదు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పాఠశాల విద్యాశాఖ ఎక్కడా కూడా వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు టెట్ కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఇవ్వలేదు. దానితో అందరు ఇది కేవలం వృత్తిలోకి రావాలనుకునే అభ్యర్థులకు సంబంధించిన అంశంగా మాత్రమే పరిగణించారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు పదోన్నతులు పొందాలంటే ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందేనని లేని పక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాష్ట్ర పదోన్నతుల విషయంలో టెట్ అర్హత కలిగిన కొందరు అభ్యర్థులు ఈ అంశం బయటకు తేవడంతో చర్చనీయాంశంగా మారింది. అప్పుడు అందరూ NCTE మార్గదర్శకాలు విద్యాహక్కు చట్టం తాలూకు కాగితాల బూజు దులపడం ప్రారంభించారు. అయితే అవి ఎక్కడా స్పష్టంగా లేకపోవడం, ఒక్కొక్కరు ఒక రకంగా ఉన్న ఉత్తర్వులను ఇంటర్ప్రిటేషన్ చేయడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. ఇప్పటికే ముప్పై ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థుల అభ్యున్నతికే అంకితమైన ఉపాధ్యాయులను ఇప్పటికిప్పుడు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులవమనడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దశాబ్దాల సర్వీస్ ఉన్నప్పటికీ..
ఉపాధ్యాయులు టెట్ రాయడానికి సమస్య కాదు. కానీ ఉన్న సిలబస్‌తోనే వారికి ఇబ్బంది. ఎందుకంటే టెట్ సిలబస్ ప్రకారం సామాన్యశాస్త్రం వారు తప్పనిసరిగా గణితం రాయవలసి రావడం.. వారు ఆందోళన చెందుతున్న అంశం. పైగా ఉత్తర్వులు అమలులోకి రాకముందే నియామకం అయిన వారికి తప్పనిసరి చేయడం కూడా న్యాయపూరితం కాదు. గత పదిహే నేండ్లలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రెండు సంవత్స రాలలో టెట్ పొందాలని లేదా సర్వీసు నుండి తొలగించాలని, లేదా బలవంతపు ఉద్యోగ విరమణ చేయాలని పేర్కొనడం దశాబ్దాల సర్వీసు కలిగి ఎందరో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వారిని అర్థాతరంగా ఇలా ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదు. వా రంతా నిబంధనల మేరకు విద్యార్హతలు కలిగి ఉంటూ, అనేకమంది అభ్యర్థులతో పోటీపడి జిల్లా నియామక బోర్డు పరీక్షలు ఎదుర్కొని మెరిట్ సాధించి వచ్చారనే విషయం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం. పైగా వారు నిబంధనల మేర కు విద్యార్హతలు కలిగి ఉంటూ, అనేకమంది అభ్యర్థులతో పోటీపడి జిల్లా నియామక బోర్డు పరీక్షలు ఎదుర్కొని మెరిట్ సాధించి వచ్చారు అనే విషయం పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరం.
సర్వీసును పరిగణనలోకి తీసుకుని..
ఒకవైపు పరీక్ష సిలబస్ అసంబద్ధంగా ఉండడం, మరోవైపు ఉత్తీర్ణత మార్కులు సామాజిక వర్గాల వారీగా ఉండడం, ఇంకొకవైపు అనేకరకాల శిక్షణలు పొందుతూ నిష్ట వంటి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్ శిక్షణ పొందుతూ అనేక కోర్సులు పూర్తి చేస్తున్న వారిని అర్థాంతరంగా తొలగించాలని లేదా రెండేండ్లలో ఉత్తీర్ణులు కావాలని పీకల మీద కత్తి పెట్టడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. అందుకే వెంటనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న లక్షలాది ఉపాధ్యాయుల సర్వీసును పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి. లేదా NCTE, విద్యాహక్కు చట్టం నిబంధనలను సవరణ చేసి 2010 కంటే ముందు ఉన్న టీచర్లకు మినహాయింపు కలిగించాలి. అది కూడా కుదరకపోతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ ఎక్కువ సార్లు నిర్వహించాలి. జీవశాస్త్రం వారు వారి సబ్జెక్టులో పూర్తి 60 ప్రశ్నలు ఉండేలా, ఏ సబ్జెక్టు వారికి ఆయా సబ్జెక్టు అంశాలు మాత్రమే ఉండేలా టెట్‌ను మార్పు చేయాలి. ఇప్పటికే తీర్పు వచ్చి సుమారు 15 రోజులు అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెట్‌కు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి తెలియజేయాలి.
-సుధాకర్.ఏ.వి
రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS
90006 74747






