- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధిపత్యమే ఇండిగో పతనానికి కారణమా?
సామాన్యుల విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న ఇండిగో, సకాలంలో రాకపోకలు సాగించే సేవలతో విస్తృత ఆదరణ పొందింది.

జాతీయ పౌర విమానయాన విధానాన్ని, విమాన ప్రయాణాన్ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతలో ఉడాన్ కథ లోతుగా పాతుకుపోయింది. చెప్పులు ధరించి ప్రజలు విమానాలు ఎక్కడం తాను చూడాలనుకుంటున్నానని ఆయన ప్రముఖంగా వ్యాఖ్యానించారు, ఈ భావన మరింత సమ్మిళిత విమానయాన రంగం అనే దార్శనికతకు నాంది పలికింది. భారతదేశంలో పౌర విమానయాన పరిశ్రమను పునరుజ్జీవింపజేయడంలో ఉడాన్ పథకం కీలక పాత్ర పోషించింది. ఉడాన్ ఆలోచనకు దగ్గరగా ప్రజల్ని విమాన ప్రయాణానికి చేరువ చేసిన సంస్థగా ఇండిగో నిలిచింది.
మసక బారిన ఇమేజ్
సామాన్యుల విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న ఇండిగో, సకాలంలో రాకపోకలు సాగించే సేవలతో విస్తృత ఆదరణ పొందింది. కానీ ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న ఆ బ్రాండ్ ఇమేజ్ ఇటీవల కొంత మసకబారినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల ఇండిగో తీవ్రమైన ఆపరేషనల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. పైలట్ల పని గంటలకు సంబంధించిన నిబంధనలు కఠినం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ఇండిగో తడబడింది. దీంతో గత వారం రోజుల్లో సుమారు 2,000 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది.
పెద్ద కంపెనీల ఆధిపత్యం
భారత విమానయాన రంగం ప్రస్తుతం రెండు పెద్ద కంపెనీల ఆధిపత్యంలో ఉంది. మొత్తం మార్కెట్‌లో సుమారు 92 శాతం వాటా ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చేతుల్లోనే ఉంది. అంటే వాస్తవానికి కొద్ది సంస్థలే ఈ రంగాన్ని ఏలుతున్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలను అనుసంధానించే సేవల్లో ఇండిగో ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో విమాన ఇంధనం, విమానాలు, విమాన సర్వీసులపై ఉన్న భారీ పన్నులు కొత్త సంస్థలు రంగంలోకి రావడానికి అడ్డంకిగా మారుతున్నాయి.
రియల్-టైమ్ సమాచారం
ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి . పైలట్‌లకు వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్‌లు పైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్లానింగ్‌లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలి ప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్‌లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్‌లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్‌లైన్స్‌కు పన్ను రాయితీలు ఇవ్వాలి.
విమానయానానికి భరోసా ముఖ్యం
భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ను కలిగి ఉంది.. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది
శ్రీధర్ వాడవల్లి
99898 55445






