ఈ మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయండి!

by Ravi |   (  Updated:2025-05-06 00:31:14  IST  )

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా హైదరాబాద్‌లో రోడ్డు రవాణా రద్దీని నివారించడానికి మెట్రో రైలును

ఈ మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయండి!
X

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా హైదరాబాద్‌లో రోడ్డు రవాణా రద్దీని నివారించడానికి మెట్రో రైలును అందుబాటులోనికి తీసుకొని వచ్చారు. దీని ద్వారా కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతున్నాయి. అయితే మెట్రో రైల్వే జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ వెళ్లడానికి మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఉన్న విధంగా లిఫ్ట్, ఎస్కలేటర్ సౌకర్యాలు కల్పించబడలేదు. ఫలితంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి జేబీఎస్ ద్వారా మెట్రో రైలులో ప్రయాణించేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్ స్టేషన్ నుండి మహారాష్ట్ర ప్రజలు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతేగాక బోయినపల్లి, అల్వాల్, తిరుమలగిరి, కార్ఖానా తదితర స్థానిక ప్రాంత ప్రజలు కూడా జేబీఎస్ వరకు లోకల్ బస్సులో ప్రయాణించి మెట్రోస్టేషన్ చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. వయోధికులు, స్త్రీలు, పిల్లలు మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కవలసి వస్తుంది. కావున ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్‌లో కూడా లిఫ్ట్, ఎస్కలేటర్, వాహనాల పార్కింగ్ స్థలం ఆ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- దండంరాజు రాంచందర్ రావు

98495 92958

Next Story