కులగణనలో కురుమలకు అన్యాయం? పునఃపరిశీలించండి!

by Ravi |   (  Updated:2026-04-24 00:30:46  IST  )

తెలంగాణ కులగణనలో కురుమల జనాభా తక్కువగా చూపించడంపై ఆందోళనలు, రాజకీయ ప్రాతినిధ్యం, నిధుల కేటాయింపులపై ప్రభావం, పునఃసర్వే అవసరంపై విశ్లేషణ.

కులగణనలో కురుమలకు అన్యాయం? పునఃపరిశీలించండి!
X

తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక పురోగతికి ప్రభుత్వం చేపట్టిన కులగణనను మేము స్వా గతిస్తున్నాం. అయితే, కురుమ సామాజిక వర్గ జనాభాను కేవలం 7,95,822 (2.2%)గా చూపించడం క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ గణాంకాలు కురుమలకు అన్యాయం చేసే అవకాశముంది. ప్రజాస్వామ్యంలో జనాభానే ప్రధాన బలం. జనాభాను తక్కువగా చూపిస్తే, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో కురుమలకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోతుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా జనాభా నిష్పత్తిపై ఆధారపడుతాయి కాబట్టి, తక్కువ జనాభా నమోదు అయితే నిధులు కూడా తగ్గే ప్రమాదం ఉంది. కురుమలు ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తారు.. సర్వే సమయంలో చాలా మంది అడవులు, పొలాల్లో వలస జీవనం గడపడం వల్ల ఎన్యూమ‌రేటర్లు వారిని సరిగా లెక్కించకపోయి ఉండవచ్చు.. అలాగే కురుమ, కురుబ, ధన్గర్ వంటి పేర్ల మధ్య తేడాలను గుర్తించకపోవడం, ఒకే కుటుంబ సభ్యులను వేర్వేరు కులాల కింద నమోదు చేయడం వల్ల సంఖ్య తగ్గి ఉండొచ్చు. అలాగే ఇటీవలి కాలంలో ‘గొల్ల-కురుమ’ అనే పదం వాడకం పెరగడం వల్ల కురుమల ప్రత్యేకత దెబ్బతింటోంది. కురుమలు, గొల్లలు వేర్వేరు సంస్కృతులు కలిగిన కులాలు అయినప్పటికీ, సర్వేలో వీటిని కలిపి నమోదు చేసినట్లు అనుమానం ఉంది. దీనివల్ల కురుమలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపులు ప్రభావితమవుతున్నాయి. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా కురుమల వాస్తవ జనాభాను గుర్తించి, వివాదాస్పద ప్రాంతాల్లో పునఃసర్వే నిర్వహించి, “కురుమ” పేరుతో ప్రత్యేకంగా నమోదైన గణాంకాలను సరిచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

-దొడ్డి చంద్రం కురుమ

94926 95929

Next Story