- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజ్ఞాన శక్తిలో అగ్రగామి.. కానీ నోబెల్ బహుమతి ఎందుకు రావడం లేదు?
చాలా కాలంగా భారతీయుల మనసులను తొలిచే ప్రశ్న.. నోబెల్ బహుమతి మన భారతీయులకు ఎందుకు రావట్లేదు? ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశం, విజ్ఞానంలో అగ్రగామి దేశంగా గర్వపడుతున్న

చాలా కాలంగా భారతీయుల మనసులను తొలిచే ప్రశ్న.. నోబెల్ బహుమతి మన భారతీయులకు ఎందుకు రావట్లేదు? ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన దేశం, విజ్ఞానంలో అగ్రగామి దేశంగా గర్వపడుతున్న భారత్, ప్రపంచంలోనే అత్యధిక శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను తయారు చేస్తున్న దేశం. కానీ నోబెల్ స్థాయి గుర్తింపు రాకపోవడం కొంత విచారించదగ్గ ఆలోచించవలసిన విషయం. భారత గడ్డపై ఆ స్థాయి వైజ్ఞానిక విప్లవం ఎందుకు రావట్లేదు? ఇందుకు కారణం నిధుల లోపం, జిజ్ఞాసా లోపం. మన విద్యార్థులు ఎందుకు? ఏమిటి? అని అడగడాన్ని మనమే ఆపేశాం. గురువు చెప్పిందే సత్యం. పుస్తకంలో ఉన్నదే నిజం. ప్రశ్నించడం అంటే వారేదో పాపం చేసినట్లు భావిస్తున్నాం. ఈ దృష్టికోణం మన బుద్ధిని వృద్ధిని బంధించింది. ఇక జర్మనీలో, అమెరికాలో, జపాన్‌లో చిన్నపిల్లలకే ప్రయోగాలు చేయడం నేర్పిస్తారు. మనదేశంలో ప్రయోగాలకు అవకాశం ఉండదు. మన దేశంలో ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలు ఉన్నారు. వారిలో బలమైన ఆలోచనలు ఉన్నా నిధుల కొరత, వసతుల కల్పన మరో కారణమయింది. అభివృద్ధి చెందిన దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో 2% నుండి 4% వరకు పరిశోధన, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే, భారత్‌కు 1% కంటే తక్కువగా కేటాయింపులు ఉంటే అత్యాధునిక ప్రయోగశాలలు, పరికరాలు, వనరులు అందుబాటులోకి ఎలా వస్తాయి? ఒక నోబెల్ స్థాయి పరిశోధన ఫలించడానికి 2-3 దశాబ్దాలు పట్టవచ్చు. మన ప్రభుత్వాలు, యునివర్సిటీలు స్వల్పకాలిక ఫలితాలపై దృష్టి పెట్టి, దీర్ఘకాలిక పరిశోధనా ప్రాజెక్టులకు స్థిరమైన మద్దతు ఇవ్వడం లేదు. మన దేశంలో తగిన గుర్తింపు ప్రోత్సాహం లేకపోవడం వల్ల మేధావులంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు. అంటే, తెలివి తేటలు గలవారు దేశం విడిచి వెళ్లడం మన నోబెల్ కలలను కల్లలు చేస్తోంది. శాస్త్రానికి స్వేచ్ఛ లేకుండా సత్యాన్వేషణ ఎలా జరుగుతుంది? మాటల స్వేచ్ఛ లేక విజ్ఞాన స్వేచ్ఛ పుడుతుందా? మన దేశంలో ఆలోచన పరిశోధనల కన్నా విధేయత కుల మత ప్రాంతీయతకే ప్రాముఖ్యత. ఆలోచనలకు విలువ ఇవ్వకుంటే ఆలోచనకారులు ఎలా పుడతారు?
- దుప్పటి మొగిలి
84668 27118






