- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకు పెన్షన్ పెంచండి!
బొగ్గు గనులలో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు అహర్నిశలు చెమట, రక్తం ధారపోసి దేశ ప్రగతికి, పరిశ్రమలకు ఇంధనం

బొగ్గు గనులలో దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు అహర్నిశలు చెమట, రక్తం ధారపోసి దేశ ప్రగతికి, పరిశ్రమలకు ఇంధనం, విద్యుత్ శక్తికి బొగ్గును అందిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా వారు దిక్కుతోచని స్థితిలో అనారోగ్యంతో చాలీచాలని పెన్షన్‌తో రోజు గడవడమే ఒక మహాభాగ్యముగా ఉంటున్నరు. పెన్షన్ పెంచమని ప్రార్థిస్తుంటే నిధులు లేవనడం ఎంత మాత్రం న్యాయం. 1998లో పెన్షన్ స్కీం మొదలై నప్పటి నుండి లక్షల మంది కార్మికుల జీతాల నుండి పెన్షన్ ఫండ్ నిధులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ పెన్షన్ నిధులు సరిపోవడం లేదని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు. టన్నుల కొద్ది బొగ్గు ఉత్పత్తి ఫలితంగా కోట్లాది రూపా యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా బొగ్గు కంపెనీ నుండి లాభాలు అందిస్తున్నారు. ప్రస్తు తం నిల్వ ఉన్న నిధులు 2031 సంవత్సరం వరకు పెన్షన్ చెల్లించుటకు మాత్రమే సరిపోతాయని గత రెండు సంవత్సరాలుగా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ధర్మకర్త మండలి సమావేశంలో చర్చిస్తూ పెన్షన్ కొనసాగించుటకు నిధులు ఆయా బొగ్గు కంపెనీల బాధ్యతగా సమకూర్చాలని తెలుపుతున్నారు. కానీ ఇంతవరకు ఒక నిర్ణయం జరగడం లేదు. పెన్షన్ పెంపుదల చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 100కు పైగా పార్లమెంట్ సభ్యులకు కేంద్ర మంత్రులకు ముఖ్యంగా బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి దేశవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు పలుచోట్ల విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్న ఫలితం కల్పించడం లేదు దేశంలో బొగ్గు ప్రాంతాల పార్లమెంట్ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగుల దీనస్థితిని దృష్టిలో ఉంచుకొని రాబోయే వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో పెన్షన్ పెంచుటకు ఒక నిర్ణయం తీసుకోవాలని అచేతన స్థితిలో ఉన్న మేం వేడుకొంటున్నాం.
-దండంరాజు రాంచందర్ రావు
9849592958






