కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కోసమే ఇదంతా!

by Disha edit |
కార్పొరేట్ అనుకూల ప్రభుత్వం కోసమే ఇదంతా!
X

మన దేశంలో కార్పొరేట్‌లు కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కావాలనే కోరుకుంటున్నారు. అందుకే 2024 ఎన్నికలలో ఖర్చు ఎంతైనా పెట్టి తిరిగి బీజేపీని గెలిపించడం కోసం కృషి చేస్తున్నారు. దాని కోసం వారు భారీ ప్లానింగ్‌తో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మినహా ఎవ్వరు కూడా, చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వారు కూడా అదానీ, అంబానీలాంటి కార్పొరేట్‌లను ఒక్క మాటా అనరు. వారి జోలికి పోరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కార్పొరేట్‌లను సీఎంలు ఏమీ అనరు. ఛత్తీస్‌గఢ్‌లోనైతే అదానీకి భారీగా స్థలం కేటాయించారు. గనుల కోసం అదానీ కంపెనీ అక్కడ ఎనిమిది వేల చెట్లను నరికేయడం వివాదాస్పదంగా కూడా మారింది.

తినే కంచాన్ని మాయం చేసి, ఎంగిలి మెతుకులు విసిరే' కుట్రకు కేంద్రం ఎనిమిదేండ్ల క్రితమే తలుపులు తెరిచింది. రెండు దశాబ్దాలకు పైగా లాభాలలో నడుస్తున్న బొగ్గు సంస్థలను కూడా దెబ్బ తీసే పనిలో పడింది. ఇటీవల బొగ్గు కొరత పేరిట అదానీకి చెందిన విదేశీ, స్వదేశీ గనుల నుంచి బొగ్గును అడ్డగోలు ధరకు కొనుగోలు చేయించి అతడికి వేల కోట్ల లాభం చేకూర్చింది. ఇది జగమెరిగిన సత్యం. కోల్ ఇండియాలోని 20 శాతానికి పైగా షేర్లను అమ్మేసారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ మొదలు కాగా, ఇప్పుడు వేగవంతం చేసారు. ఇంకా అమ్మే కుట్ర సాగుతున్నది. 'ముందు నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనే అమ్ముతాం లేదా లీజుకు ఇస్తాం' అన్నారు. ఇప్పుడు అన్నింటినీ అమ్మేస్తున్నారు.

విపక్షాల ప్రతిఘటన పార్లమెంట్‌లోనూ బయట కూడా అంతగా లేకపోవడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకున్నది. 'ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికని' మన పీఎం నరేంద్ర మోడీ ఎప్పుడో అన్నారు. ప్రభుత్వ రంగం అంటేనే తెల్ల ఏనుగు అనే అభిప్రాయం ఆయనకు ఉంది. అందుకే వాటిని నిర్వీర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ దాదాపు సగం పూర్తి అయ్యింది. అదానీ, అంబానీలాంటి కార్పొరేట్‌ల‌కు ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది. ఫలితంగా బీజేపీకి వేలాది కోట్ల నిధులు, ఎలక్టోరల్ బాండ్స్ సమకూరుతున్నాయి. దేశంలో అత్యధిక నిధులు గల రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగింది.

వారికి అదే కావాలి

మన దేశంలో కార్పొరేట్‌లు కూడా తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కావాలనే కోరుకుంటున్నారు. అందుకే 2024 ఎన్నికలలో ఖర్చు ఎంతైనా పెట్టి తిరిగి బీజేపీని గెలిపించడం కోసం కృషి చేస్తున్నారు. దాని కోసం వారు భారీ ప్లానింగ్‌తో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మినహా ఎవ్వరు కూడా, చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి వారు కూడా అదానీ, అంబానీలాంటి కార్పొరేట్‌లను ఒక్క మాటా అనరు. వారి జోలికి పోరు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కార్పొరేట్‌లను సీఎంలు ఏమీ అనరు.ఛత్తీస్‌గఢ్‌లోనైతే అదానీకి భారీగా స్థలం కేటాయించారు. గనుల కోసం అదానీ కంపెనీ అక్కడ ఎనిమిది వేల చెట్లను నరికేయడం వివాదాస్పదంగా కూడా మారింది. రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. వంద మంది కార్పొరేట్‌లకు దాదాపు రూ.13 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను వే ఆఫ్ చేసారు. ఎన్‌పీఏ పెరిగిపోయి బ్యాంకులు చాలా వరకు దివాలా తీసాయి. కొన్నింటిని విలీనం చేసారు. బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి జనం భయపడే పరిస్థితి వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వ రంగం ఎక్కువ కాలం మనగలుగుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

రేషన్ మీదనే బతుకులు

కొవిడ్ కాలాన్ని అడ్డుపెట్టి, ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి రైల్వే, ఎయిర్‌పోర్ట్, హైవేలు, పోర్టులు ఇలా ప్రభుత్వ ఆస్తులు, కంపెనీలను అమ్మేస్తున్నారు. పాత ప్రైవేట్ కంపెనీలు మూసేసి, వాటిపై తీసుకున్న రుణాలను మాఫీ చేసి, తిరిగి ఆ యజమానులకే కంపెనీల పేరు మార్చి రుణం ఇచ్చేస్తున్నారు. .ప్రభుత్వ రంగ సంస్థల మూత, అమ్మకాల కారణంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితి దీనంగా ఉంది. పెన్షన్ జీవితాలు అయిపోయాయి. అవి కూడా చాలీచాలని పరిస్థితి ఉంది.

నిరుద్యోగులు ఎక్కువ కావడంతో దాదాపు 12 కోట్ల మంది ప్రభుత్వం ఇస్తున్న ఐదు కేజీల రేషన్ మీద ఆధారపడి బతికే పరిస్థితి వచ్చింది. మధ్య తరగతి కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. సామాన్యుల జీవితాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. దాదాపు 18 కోట్ల మందికి చిన్నాచితక పనులు కూడా దొరకడం గగనం అయిపోయింది. చేతిలో చిల్లి గవ్వ లేక గ్రామీణ పేదలు ఆగం అయిపోతున్నారు. పెరిగిన ధరలతో దేశం అంతా ఆందోళనకరంగా ఉంది.

అడవి బిడ్డలనూ వదలలే

ఆదివాసీ ప్రాంతాలలో ఖనిజ సంపద కోసం వేలాది గ్రామాలను, గూడాలను ప్రభుత్వంతో కలిసి కార్పొరేట్‌లు ధ్వంసం చేసారు. లక్షలాది మంది ఆదివాసీలకు నిలువ నీడ, తినడానికి అడవి ఇచ్చిన మంచి ఆహారం లేకుండా చేసారు. వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఆశ్రయం కోల్పోయినవారు చట్ట ప్రకారం అక్కడి పరిశ్రమలలో భాగస్వాములు కావాలి. కనీసం అందులో కూలీ, ఉద్యోగం, పునారావాసం కూడా లభించడం లేదు. పరిహారం అంతంత మాత్రమే. పరిహారం, పునరావాసం కోసం ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి.

అందరికీ జీవించే హక్కు ఉంది కాబట్టి ఆ దిశన కృషి జరగాలి. న్యాయం కోసం, అన్యాయం అంతం కోసం శాంతియుతంగా పోరాడాలి.బుద్ధిజీవులు కదలాలి. కదిలించాలి. 'తినే కంచం లాగేసుకుని, ఎంగిలి మెతుకులు వేసే' పద్ధతి మారాలి. పాలకులు ప్రజల కోసం పని చేయాలి. ప్రజా ప్రతినిధులు సోయితో మెదలాలి. కార్పొరేట్‌లకు ఆస్తులు దోచిపెట్టి తద్వారా తాము కమిషన్ తీసుకునే దోపిడీదారులుగా మారారు కొందరు. దేశం క్రైసెస్‌లో ఉంది. ఇవన్నీ పాలకులకు పట్టదు. పదవులు, అధికారాలను కాపాడుకునే పనిలో ఎవరికివారే బిజీ అయిపోయారు. నోట్లకు ఓట్లు అనే పద్ధతి మారాలి. మార్చే రాజకీయ పార్టీ లేదు, రాదు కాబట్టి మనమే ముందు (ఓటర్లే) మారాలి. బుద్ధిజీవులారా బాధ్యత తీసుకోండి


ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223


Next Story

Most Viewed