- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రమోషన్ పోస్టులో.. సకాలంలో జాయిన్ కాకపోతే ఎలా?
ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయుల ఎదురుచూపులకు ముగింపు లభించింది. ఉద్యోగోన్నతుల జాబితాను విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి మాత్రం పరిసమాప్తమైంది. అయితే, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు 15 రోజుల్లోగా నూతన పోస్టులో విధిగా జాయిన్ కావాలి. లేని పక్షంలో.. ఏమి జరుగుతుంది. ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది ప్రభుత్వ ఉత్తర్వులు ఏం చెబుతున్నాయంటే..
ప్రమోషన్ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులు 15 రోజుల్లోగా నూతన పోస్టులో విధిగా జాయిన్ కావాలి లేకపోతే ఆ ఉత్తర్వులు ఆటోమాటిక్‌గా రద్దవుతాయి. అనివార్యమైన పరిస్థితుల కారణంగా ప్రమోషన్ పోస్టులో గడువులోగా జాయిన్ కాలేకపోతున్న పలువురు ఉపాధ్యాయ మిత్రులు తమ ప్రమోషన్ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాకరాక వచ్చిన ప్రమోషన్ కోల్పోతామా అని మదనపడుతున్నారు. ముఖ్యంగా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నుంచి ముందస్తు అనుమతి పొంది విదేశాలకు వెళ్లిన చాలా మంది టీచర్లు ప్రమోషన్ పోస్టులో జాయిన్ కావడానికి వెంటనే ఇక్కడికి రాలేని పరిస్థితి. వీటిలో కొన్ని సమస్యలకు ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టత ఇస్తున్నాయి. మరికొన్ని సమస్యలకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవు.
మెటర్నిటీ లీవ్‌పై ఉన్న టీచర్లు
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రొసీడింగ్ నంబర్ 29C3-42003 తేదీ 25.01.2003 ప్రకారం మెటర్నిటీ లీవ్‌లో ఉన్న టీచర్లు ఓల్డ్ స్టేషన్‌లో రిలీవై న్యూ స్టేషన్‌లో జస్ట్ రిపోర్ట్ చేసి, మెటర్నిటీ లీవ్‌లో కంటిన్యూ కావచ్చు. న్యూ స్టేషన్‌లో రిపోర్ట్ చేయకపోతే సాలరీ రెగ్యులర్‌గా క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. మెటర్నిటీ లీవ్ పూర్తి అయిన తదుపరి న్యూ స్టేషన్‌లో జాయిన్ అయితే సరిపోతుంది. మెటర్నిటీ లీవ్ నిబంధనలే మిస్‌క్యారేజ్ లీవ్‌కి కూడా వర్తిస్తాయి. అయితే, మిస్‌క్యారేజ్ లీవ్‌లో ఉండి ప్రమోషన్ పొందినవారు మిస్‌క్యారేజ్ లీవ్ తదుపరి ప్రమోషన్ పోస్టులో చేరేలా విద్యాశాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు లేవు. కాబట్టి, మిస్‌క్యారేజ్ లీవ్‌లో ఉన్నవారు 15 రోజుల్లోగా పదోన్నతి పోస్టులో జాయిన్ కావడమే మంచిది.
ఉన్నత చదువుల కోసం..!
జీవో 342 తేదీ 30.08.1977 ప్రకారం ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయుల పదోన్నతికి ఎలాంటి ఇబ్బందీ రాదు. ఎందుకంటే, జీవో 342 ప్రకారం హయ్యర్ స్టడీస్‌కి వెళ్లేది సెలవుపై కాదు, డిప్యూటేషన్‌పై మాత్రమే. కాబట్టి, ఓల్డ్ స్టేషన్‌లో రిలీవై కొత్త స్టేషన్‌లో రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ప్రతినెలా అటెండన్స్ సర్టిఫికెట్ కొత్త స్టేషన్‌కి పంపిస్తే సాలరీ కూడా రెగ్యులర్‌గా పొందవచ్చు.
పెండింగ్ చార్జెస్-ప్రమోషన్
చార్జెస్ పెండింగులో ఉన్న టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం అసాధారణ చర్య. భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ రాకుండా అధికారులు ఈ చర్య తీసుకున్నారేమో తెలియదు. అయితే, సదరు టీచర్ల ప్రమోషన్ ఆర్డర్స్ అబెయెన్స్‌లో(నిలుపుదలలో) పెట్టారు. అబెయెన్స్ ఆర్డర్ ఎప్పుడు ఎత్తివేస్తారో ఊహించలేం. కేస్ బై కేస్ ప్రత్యేకంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ప్రమోషన్ ఆర్డర్స్ జారీ తర్వాత తోసిపుచ్చలేని అభ్యంతరం వచ్చినా లేక సమస్య ఏర్పడినా ఆర్డర్స్ అబెయెన్స్‌లో పెట్టడం సహజం. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అయినా ఆర్డర్స్ అబెయెన్స్‌లో పెట్టడం గమనార్హం. అయితే, ఇది జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదని తెలుస్తున్నది. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
సెలవుపై ఉన్న టీచర్లు
హిస్ట్రెక్టమీ లీవ్, ఎడ్యుకేషన్ (స్టడీ) లీవ్, అబ్రాడ్ విజిట్ లీవ్, మెడికల్ లీవ్‌పై ఉన్న టీచర్లు నిర్దేశించిన గడువు 15 రోజుల్లోగా ప్రమోషన్ పోస్టులో జాయిన్ కావాల్సిందే. లేనిపక్షంలో, పదోన్నతి కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో విదేశీ సందర్శనకు వెళ్లిన టీచర్లే అత్యధికం. ఒకవేళ సదరు టీచర్లు లీవ్ తదనంతరం ప్రమోషన్ పోస్టులో జాయిన్ కావడానికి అనుమతి ఇవ్వాలని డీఈవోలను అభ్యర్థించి, ఆ మేరకు విద్యాశాఖ అధికారుల నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు ముందే పొందినట్లైతే ఒకే. ఇలాంటి సందర్భంలో మాత్రమే సెలవు ముగిసిన తర్వాత ప్రమోషన్ పోస్టులో జాయిన్ కావచ్చు. కానీ, రాష్ట్ర ఉన్నతాధికారుల అనుమతి లేకుండా డీఈవోలు అలాంటి ఉత్తర్వులు జారీ చేయరు. ఈ విషయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులే సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే, తమ అనుమతి తీసుకున్న తర్వాతే టీచర్లు విదేశాలకు వెళ్లిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని సెలవు తదనంతరం ప్రమోషన్ పోస్టులో చేరేలా ఉత్తర్వులు జారీచేసి వారికి ఊరట కలిగించాలి.
-మానేటి ప్రతాపరెడ్డి,
టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు
98484 81028