- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు ప్రోత్సాహం అందిస్తే..
నేడు మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం, ప్రతి సంవత్సరం ఈ రోజున

నేడు మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి, లింగ సమానత్వాన్ని సాధించడం కోసం, ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. దీని ప్రకారం, 1975 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళలకు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చి మరుసటి రోజున వారి సమానత్వం గురించి మర్చిపోతున్నాం. కానీ ఈ మహిళా దినోత్సవరం రోజున వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గౌరవిస్తూ, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన పెంచే కార్యక్రమాలను, సమావేశాలను, చర్చల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రపంచంలో నలుమూలల వ్యాపింపజేయడానికి ఉపయోగించుకోవాలి.
2025 సంవత్సరానికి గాను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి "ప్రతి మహిళకు, ప్రతి బాలికకు, హక్కులు - సమానత్వం" అనే థీమ్‌తో వేడుకలు చేయనున్నారు. మహిళలు సమాజంలో అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందడమే కాకుండా, వారి హక్కులు కాపాడబడాలి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, మహిళల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను, చట్టాలను మరింత కఠినతరంగా అమలు చేయడంతో పాటు, వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్త్రీ, పుట్టినప్పటినుంచి ప్రాణం పోయేవరకు తాను సేవ చేస్తూనే ఉంటుంది. కుటుంబంలో అన్ని పాత్రలను పోషిస్తూ, మనకు తోడుగా నిలబడుతుంది. ఈ మధ్యకాలంలో రాజకీయ, సామాజిక తదితర పలు రంగాల్లో మహిళలు విజయాన్ని సాధిస్తున్నారు. మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తే భవిష్యత్తులో దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచే శక్తిగా ఎదిగే సత్తా వారికి ఉంది. వారికి సైతం సమాన హక్కులు, అవకాశాలు గౌరవాన్ని అనుభవించే భవిష్యత్తు వైపు తమ పురోగతిని వేగవంతం చేయాలని ఆశిస్తూ, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
డాక్టర్ బాసాని లావణ్య
రాజనీతిశాస్త్ర విభాగాధిపతి
కాకతీయ యూనివర్సిటీ ,
91609 75164






