మన ఇంటి అమ్మాయిలను కాపాడుకుందాం!

by Ravi |   (  Updated:2026-03-12 00:45:43  IST  )

మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. 14 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలకు గర్డాసిల్-4 వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.

మన ఇంటి అమ్మాయిలను కాపాడుకుందాం!
X

కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో మహిళల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకోని హ్యూమన్ పపిల్లోమ వైరస్ టీకా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కింగ్ కోటి ఆసుపత్రి నుంచి ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఇక ఈ టీకా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8వ తారీఖున మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభమయింది.

టీకా ఎవరికి అవసరం?

హ్యూమన్ పపిల్లోమ వైరస్ లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధి. హ్యూమన్ పపిల్లోమ వైరస్‌లు మొత్తం 200 రకాల వరకు ఉన్నాయి.. ఇందుకు గర్భాశయ కాన్సర్‌కు కారణమయ్యేవి 6,11,16,18 రకానికి సంబంధించినవి. ఎక్కువ మంది మహిళలు ఈ వైరస్ బారిన పడి కేన్సర్ బాధితులుగా మారుతున్నారు.. ఈ కేన్సర్‌ను ఎదుర్కొంటున్న వారిలో పెళ్లిళ్లు అయిన మహిళలే అధికంగా ఉంటున్నారు.. ప్రారంభ స్థాయిలోనే ఈ వైరస్‌‌ను అరికట్టాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకే కేంద్ర ప్రభుత్వం 14. సం॥ దాటి 15 సం॥లోపు , అమ్మాయిలకు ఈ వాక్సిన్ ఇవ్వాలన్నది టార్కెట్‌గా నిర్ణయించు కున్నది. ఈ స్కీం‌లో బాగంగా 14 సం.నిండిన బాలికలకు గర్థాసిల్- 4 వాక్సిన్‌ను ఒక డోస్ ఇస్తారు. ఈ వాక్సిన్ అమ్మాయిల్లో వైరస్ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గర్భాశయ కేన్సర్ పట్ల మన సమాజంలో అవగాహన చాలా తక్కువ. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అధిక రక్త స్రావం, ఋతు క్రమంలో ఎక్కువ రోజులు రక్తస్రావం, ఆ సందర్భంగా ఋతు క్రమం రావడం, ఋతు క్రమంలో దుర్గంధం ఉండడం మొద లైనవి గర్భాశయ కాన్సర్‌కు ముందస్తు హెచ్చరికలు..

టీకా ఎక్కడ ఇస్తారు..?

ఈ నెల 8వ తారీఖు నుండి అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో, ఏరియా జిల్లా వైద్య ఆసుపత్రి కేంద్రాలో ఉదయం 10 గం॥ నుండి మ 2 గం ॥ వరకు 14 సం ॥ నిండి 15 సం ॥ దాటని అమ్మాయిలకు సింగల్ డోస్గా గర్థసిల్ – 4 అనే వాక్సిన్‌ ఇస్తారు.. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ వాక్సిన్‌‌ను ఉచితంగా అందిస్తుంది. టీకా తీసుకోవాల్సిన అమ్మాయిల తల్లితండ్రులు యూ-విన్ సైట్ ద్వారా అమ్మాయి పేరు రిజిస్టర్ చేసుకోవాలి. అమ్మాయిలకు టీకా వేయాలంటే తల్లితండ్రులు అంగీకారం తప్పని‌సరి. గర్భంతో ఉన్న మహిళలు ఈ వాక్సిన్‌ వేసుకోరాదు. అనారోగ్య సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న వారు కుదుట పడే వరకు అగడం మంచిది. గతంలో హెచ్.పి.వి టీకా కాని తీసుకుని ఉంటే మళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు.

నేటి బాలికలే రేపటి మహిళలు..

కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కుటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉండాలి. ఎందరో మహిళలు హెచ్.పి.వి వైరస్ బారిన పడి ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. గర్భాశయ కేన్సర్‌పై అవగాహన లేక ఎన్నో కుటుంబాలు ఆ ఇంటి తల్లులను కోల్పోతున్నాయి.. ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 14 సం. నిండిన అందరు అమ్మాయిలకు వాక్సిన్‌ ఇవ్వడానికి పూనుకుంది. ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మన మందరం బాగస్వాములమవుదాం. మన ఇంటి అమ్మాయిలను కాపాడుకుందాం.

-రమేష్ లొలెవార్

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్

79816 80299

Next Story