విదేశాల్లో హిందూ, ముస్లింల ఐక్యత మన పాలకులకు ఒక పాఠం!

by Ravi |   (  Updated:2025-09-18 01:15:34  IST  )

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలలో సాగే జాత్యహంకార శక్తుల ఆందోళనలు మన దేశ హిందువులకు ఓ గుణపాఠం. విదేశాల్లో వలస జీవుల పట్ల నిరసన

విదేశాల్లో హిందూ, ముస్లింల ఐక్యత మన పాలకులకు ఒక పాఠం!
X

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలలో సాగే జాత్యహంకార శక్తుల ఆందోళనలు మన దేశ హిందువులకు ఓ గుణపాఠం. విదేశాల్లో వలస జీవుల పట్ల నిరసన ఆందోళనల పరిణామాల నేపథ్యంలో న్యూయార్క్‌లో హిందూ ముస్లిం ఐక్యత న్యూఢిల్లీకి ఆదర్శం. లండన్‌లో భుజం కలిపిన హిందూ, ముస్లిం, సిక్కు ఐక్యత భారత్‌కి ఆదర్శం. ఈ ఐక్యత మన పాలకులకు సరికొత్త గుణపాఠం కావాలి..

ఈ అంశం ఆధారం చేసుకొని మత సమైక్యతకై ప్రత్యే కంగా కృషి చేద్దాం. కొందరు లోతైన అవగాహనతో శాస్త్రీ య విశ్లేషణలు చేస్తున్నారు. వారు చాలా అభినందనీయ కృషిని సాగిస్తున్నారు. ఈ దేశ మట్టిలో పుట్టి, ఈ మట్టిలో పెరిగి, మట్టిలో కలిసిపోయే మనుషులు కొన్ని శతాబ్దాల క్రితం ముస్లిం మతంలో చేరి అనుసరిస్తున్నారు. అనేక శ‌తా‌బ్దాల తర్వాత ఆధునిక యుగంలో ముస్లింలపై కక్ష గట్టి ‘గో టూ పాకిస్తాన్ లేదా కబరిస్తాన్’ అనే దుస్థితిని హిందుత్వ సంస్థలు కల్పిస్తున్నాయి. అది ప్రైవేటు మతతత్వ సంస్థల పని అనుకుంటే రిపబ్లిక్ రాజ్యాంగాన్ని పరిరక్షణ చేసే బాధ్యత గల మోడీ ప్రభుత్వం కూడా చేసేది అంత కంటే భిన్నంగా ఏమి లేదు. ముస్లిం మతం పట్ల పక్షపాతంతో NRC చట్టం తేవడం ఓ నిదర్శనం. ముస్లింల పట్ల ప్రత్యేకంగా మోడీ సర్కార్ వెలివేత వైఖరి చేపట్టింది.

మత సామరస్యత అక్కడికే పరిమితమా?

గో బ్యాక్ ఆసియన్స్, గో బ్యాక్ ఆఫ్రికన్స్, గో బ్యాక్ లాటిన్ అమెరికన్స్ ఇవీ స్థానికుల నినాదాలు.. అమెరికా నుంచి బ్రిటన్ వరకు ఎవరూ ఫలానా ముస్లిం మతస్తులు, ఫలానా హిందూ మతస్తులు, ఫలానా సిక్కు లేదా బౌద్ధ మతస్తులు 'గో బ్యాక్' అనడం లేదు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్‌లలో మరో కొత్త పరిణామం కూడా జరుగుతోంది. వలస జీవులు కూడా క్రమంగా ఏకమై ‘మీ దేశ ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మా శ్రమశక్తి పాత్ర కూడా వుంది, మమ్మల్ని ఎలా గో బ్యాక్ అంటారని ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్నారు’. చాలా విచిత్ర విషయం ఏమంటే, లండన్ కౌంటర్ ర్యాలీలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు భు‌జం కలిపి ప్లకార్డులు ధరించి పాల్గొనడం! అక్కడ మత సామరస్యం, సమైక్యత వెల్లివిరియడం విశేషాల్లో కెల్లా విశేషం! ఉదాహరణకు యూకేలో ఇరవై లక్షల మంది ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్, పదిహేను లక్షల మంది పాకి స్తాన్ ఇమ్మి గ్రెంట్స్ భుజం కలిపి తమ భద్రత కోసం ఐక్యం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గల్ఫ్ దేశాల్లో జాత్యహంకారం శూన్యం

మరో చేదు నిజం కూడా చెప్పాల్సిన సందర్భమిది. పొట్టచేత పట్టుకొని వెళ్లిన శ్రమజీవులకు ఏ విదేశంలోనైనా కష్టాలు తప్పదు. గల్ఫ్ దేశాలు కూడా అతీతం కాదు. కా నీ యూఎస్, కెనడా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వంటి చోట్ల నేటివ్స్‌ని రెచ్చగొట్టి ‘వలస జీవులు గో బ్యాక్' ప్రదర్శనలను చేపట్టే జాత్యహంకార సంస్థలు గల్ఫ్ దేశాల్లో లేకపోవడం గమనార్హం! అవన్నీ ముస్లిం దేశాలే! ఆ గల్ఫ్ వెళ్లిన భారతదేశ హిందువులకు స్థానిక ముస్లిం సంస్థల నుండి ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు.

అలా జరిగితేనే మేల్కొంటామా?

మన దేశ హిందువులకు తాజా పరిణామాలు నేర్పే పాఠం ఒకటే! అదే మత సామరస్య త, సమైక్యత అవసరం అనేది. మత భావోద్వేగాలు ఆయా మతావలంబీకుల మనస్సులను ఆవహించిన నిర్ధిష్ట సమయాల్లో మత సామర స్యం, సమైక్యతల గూర్చి నూరు బోధనలు చేసినా, వేల ప్ర సంగాలు చేసినా మెదళ్లకు ఎక్కవు. కానీ తమ జీవనాధారాన్ని మత, ప్రాంత, జాతిపర విద్వేషాలు దెబ్బతీసే నిర్దిష్ట సమయాలలో అర్థం చేసుకుంటారు. కీడులో మేలులా నేడు అట్టి సువర్ణావకాశాన్ని చరిత్ర అందించింది. ఈ క్యాచింగ్ పాయింట్‌ని ఆధారం చేసుకొని మన దేశ హిందూమత సోదరీ, సోదరుల మనస్సుల్లో ఓపికగా మత సమైక్యత స్ఫూర్తి నింపి మేల్కొలిపే అవకాశం లభించింది. ఇది లౌకిక, వామపక్ష, విప్లవ, ప్రజాతంత్ర సంస్థలు, శక్తుల బాధ్యత! అవి తమ బాధ్యత నిర్వహిస్తాయని ఆశిద్దాం.

వలస ప్రజలపై ఇంత శత్రుత్వం ఎందుకు?

అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వంటి అ‌తి పెద్ద, చిన్న దేశాల్లోనూ భారతీయులపై దాడి చేసి హత్య చేయడం, కత్తులతో నరకడం, ఆన్ లైన్ రేసిజంలో కూడా భారతీయులను టార్గెట్ చేయడం వంటి ఘటనలు వరుసగా జరుగుతుండాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఘటనలు కేవలం వ్యక్తిగత దాడులు కాదు, విస్తృతమైన రేసిజం, ఆర్థిక ఒత్తిడి, రాజకీయ వాతావరణం వల్ల జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో, స్థానికుల్లో ‘జాబ్స్ దొంగలు’ అనే భావన పెరిగింది. పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి, ఇ‌న్‌ఫ్లేషన్ పెరిగింది. భారతీయులు ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో డామినేట్ చేస్తున్నారు కాబట్టి, అక్కడి స్థానికులు మనల్ని అలా భావిస్తున్నారు.

ఉమ్మడి నిరసనలు చేపడితేనే..

ఈ శత్రుత్వం ప్రభావాలు భయంకరం. భారతీయ వి‌ద్యార్థులు, వర్కర్లు భయపడుతున్నారు. 2025లో అమెరి కా, కెనడాలో మనపై దాడులు గత 4 ఏండ్లతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. యూరప్‌లో ఫార్-రైట్ పార్టీలు శక్తివంతమవుతున్నాయి. ఇవి బలపడే కొద్దీ స్థానికులకు, వలస వచ్చిన వారికి మధ్య ఘర్షణ మరింతగా పెరిగే ప్రభావం ఉంది. వలసపోయిన వారిలో ఐక్యతా బంధాలు పెరగడం ఉమ్మడిగా నిరసనలకు చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారమవుతుంది.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

94907 00715

Next Story