- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురు నానక్ – సమానత్వానికి మార్గదర్శకుడు
సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతాలలో బౌద్ధం ప్రదానమైనది. అనంతరం ఈ విలువలకు దగ్గరగా సిక్కు మతం పుట్టింది. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు.

సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతాలలో బౌద్ధం ప్రదానమైనది. అనంతరం ఈ విలువలకు దగ్గరగా సిక్కు మతం పుట్టింది. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు.
అందరూ ఒకటే.. అందరూ సమానులే!
గురునానక్ సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఆయన బోధనలో అందరూ ఒక్కటే, దేవుని ముందు అందరూ సమానులనే భావనకు ప్రాధాన్యతను కలిగివున్నది. ఆయన ‘లంగర్’ ( కుల మతం భేదం లేకుండా అందరూ కలిసి భోజనం చేసే వ్యవస్థ)ను, ‘పంగత్’ (సామూహిక వంటగది) వ్యవస్థలను సృష్టించారు. ఇవి కుల భేదాలను పూర్తిగా పోగొట్టాయి. అందరూ కలసి ఒకే స్థాయిలో భోజనం చేస్తున్న సందర్భంలో దీన్ని అమలు చేశారు. ఇది సమాజంలోని అన్ని వర్గాల మధ్య భేదాలు తొలగించి సోదరత్వాన్ని బలపరిచింది.
గురునానక్, రవిదాస్ బోధనలు
గురునానక్ ప్రత్యేకంగా అణిచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు. వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. మరోవైపు గురు అర్జున్‌సింగ్ అమృత్‌సర్ వద్ద దర్బార్ సాహిబ్ ఆల యంలో నాలుగు తలుపులు నిర్మించారు. ప్రతి వ్యక్తికి నాలుగు వైపుల నుంచి ఆత్మీయ స్వాగతాన్ని సూచిస్తాయి. ఇది కుల భేదాలు లేకుండా, అన్ని మతాలు, జాతులు సమానంగా స్వీకరిస్తాయని సూచిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు ఈ ఆధ్యాత్మిక స్థలంలో సమాన హక్కులు ఉన్నాయని గురు అర్జున్ సంకల్పించారు. సిక్కు మత గ్రంథమైన ఆది గ్రంథ్‌లో సంత్ రవిదాస్ వంటి దళిత కవి రచనలున్నాయి. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే స్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు.
మన హక్కులకోసం గురునానక్
గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యాడు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పుస్తకంలో గురు నానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీన్ని ప్రోత్సహించారు.
సామాజిక న్యాయ పోరాటానికి..
దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యతా తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజార్టీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడిత వర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామా జిక న్యాయపోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428






