- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్నిగుండంలా మారుతున్న భూమి.. ప్రకృతిని కాపాడితేనే మనుగడ
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, చెట్ల నరికివేత, కాలుష్యం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులపై అవగాహన కల్పించే కథనం. ప్రకృతిని రక్షించడం ద్వారానే భవిష్యత్ తరాలకు సురక్షిత భూమిని అందించగలమనే సందేశం.

గత కొన్ని రోజులుగా దేశమంతా తీవ్రమైన ఎండలతో అగ్నిగుండంలా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీల వరకు నమోదవుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఉదయం నుంచే మండే ఎండలు, ఉక్కపోత వాతావరణం కారణంగా ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. వడదెబ్బల వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. మనిషి తన అవసరాల కోసం విచక్షణారహితంగా చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అడవులు తగ్గిపోవడంతో వర్షాలు సరిగా పడకపోవడం, భూమి ఉష్ణోగ్రత పెరగడం జరుగుతోంది. “ప్రకృతిని కాపాడితేనే మనిషి మనుగడ సాధ్యం” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇక ప్రజల ఆదాయ వనరులు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎయిర్ కండిషనర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అలాగే కార్ల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. వీటి నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే పొగలు, ప్లాస్టిక్ వినియోగం అధికమవడం, ఇంధనాల అధిక వినియోగం వంటి కారణాలతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావం ప్రతి మనిషి జీవితంపై స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించాలంటే చెట్లను పెంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రకృతిని రక్షించడం ద్వారానే భూమిని భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించగలం. ఇందులో మన పాత్ర ఎంతో వుండాలి.
- గుబ్బల శ్రీనివాస్,
89066 97777






