- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ కల్పించండి!
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నరాగా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సంస్థల

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు నరాగా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వుషన్లు ఖరారయ్యాయి. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో జరగనున్నాయి. మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు, 656 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై.. నవంబర్ 9తో ముగుస్తుంది. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలను విడతల వారీగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు జనరల్ స్థానాలలో ఆయా నియోజకవర్గాలను జనాభా నిష్పత్తి ప్రకారం ఓటర్ల సంఖ్యను బట్టి రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లుగానే వికలాంగులకు కూడా 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగులు ఓటు వేసే యంత్రాలుగానే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి ప్రజా ప్రతి నిధులుగా ఎన్నికయ్యే అవకాశాలు కల్పించాలి. వికలాంగులలో ఎంతోమంది విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు.. పరిపాలనపై అవగాహన కలిగి ఉన్నవారు ఉన్నారు. ప్రజాసేవ చేయడానికి ఉత్సాహంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మనవి.
-ఈదునూరి వెంకటేశ్వర్లు
99663 36457






