- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేటు స్కూళ్ల ఫీజులను నియంత్రించరా?
రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం

రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఫీజు నియంత్రణకై ఎన్ని జీవోలు, ఎన్ని నిబంధనలు రూపొందించినా తమ రూల్ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లల్లో నైతే టెస్టులు పెట్టి మేనేజ్మెంట్ నిర్ణయించిన మార్కులు వస్తేనే సీట్లు ఇస్తున్నాయి. ఇక ఎలాగోలా అడ్మిషన్ పూర్తయినా యూని ఫామ్స్, బుక్స్, నోట్ పుస్తకాలకు ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేస్తున్నారు. పైగా ఇవన్నీ తమ వద్దే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇలా తల్లిదండ్రుల నుండి ఎల్‌కేజీ అడ్మిషన్‌కు కూడా లక్షలు వసూలు చేస్తు న్నారు. రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు మం డల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే, ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాదికి 10 శాతం ఫీజులు పెంచుకోవాలని ఆ కమిటీ సిఫా ర్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉంది కానీ అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ కమిటి రూపు దాల్చలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం మేల్కొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకొని ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- సొప్పరి నరేందర్ ముదిరాజ్
95539 58648






