రైతు కమిషన్.. ఓ జనతా గ్యారేజ్..

by Ravi |

వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్.. రైతులకు జనతా గ్యారేజ్గా పనిచేస్తుంది. రైతాంగానికి ఏ చిన్న సమస్య వచ్చిన చెప్పుకోడానికి ఓ వేదికగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా రైతుకు అన్యాయం జరిగితే..

రైతు కమిషన్.. ఓ జనతా గ్యారేజ్..
X

వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్.. రైతులకు జనతా గ్యారేజ్గా పనిచేస్తుంది. రైతాంగానికి ఏ చిన్న సమస్య వచ్చిన చెప్పుకోడానికి ఓ వేదికగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా రైతుకు అన్యాయం జరిగితే.. అక్కడికి వెళ్లి అండగా నిలబడుతోంది. ఆప‌ద‌తో క‌మిష‌న్ గ‌డ‌ప తొక్కిన ప్రతి రైత‌న్నకు భ‌రోసాగా నిలుస్తోంది. అంతేకాదు ఆక‌లితో వ‌చ్చిన అన్నదాత‌కు భోజ‌నం పెట్టి మ‌రి వారి స‌మ‌స్యలను ప‌రిష్కరించే ప్రయత్నం క‌మిష‌న్ చేస్తుంది.

వీలయితే అక్కడికక్కడే సమస్యలను సాలువ్ చేయ‌డం, లేదంటే.. కఠినమైన సమస్యలు, పాలసీలకు సంబంధించిన‌వి ఉంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చూస్తుంది. భూ సమస్యల నుండి మొదలుకుంటే నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా కమిషన్ రైతులకు న్యాయం చేసేలా చూస్తుంది. తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్.. సమస్యలు సాలువ్ చేయడంలో ఓ జనతా గ్యారేజ్ లా మారింది.

విత్తన కంపెనీలను దారిలోకి తెచ్చి..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, రైతు సంక్షేమ క‌మిష‌న్ ఏర్పడినప్పటినుండి జ‌న‌తా గ్యారేజ్‌లా ప‌నిచేస్తుంది. కమిషన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి వందలాది మంది రైతులు నష్టపోయారు. మొక్కజొన్న పంటకు నకిలీ పురుగుమందులు చల్లడంతో.. పంట తిన్న పశువులు పదుల సంఖ్యలో చనిపోయాయి. ఒకరైతు, మరొక వ్యవసాయ కూలి కూడా చనిపోయారు. మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులకు న్యాయం చేయాలని రైతులు రోడ్డెక్కారు. ఆందోళనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కమిషన్.. ములుగు రైతులకు అండగా నిలబడింది. ముందుగా రెండు బృందాలను ములుగు జిల్లాకు పంపి.. నివేదికను తెప్పించుకుంది.

రైతులకు రూ. 4 కోట్ల నష్టపరిహారం

తర్వాత కమిషన్ నేరుగా రంగంలోకి దిగింది. ములుగు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. అధికారుల నిర్లక్ష్యం, విత్తన కంపెనీల మోసాన్ని అక్కడికక్కడే ఎండగట్టింది. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా ఉండాలని స్పష్టం చేసింది. మొండికేసిన విత్తన కంపెనీలను దారిలోకి తెచ్చింది. దాదాపు 4 కోట్ల వరకు రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చేసింది. ములుగు లోనే కాదు.. గద్వాల్‌లో పత్తి, సూర్యాపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో వరి, ఖమ్మంలో మొక్కజొన్న, మిర్చి విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చేసింది. దేశంలోనే ఫస్ట్ టైం విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిందని చెప్పాలి. మోతెబరి వేషాలు వేసిన అంతర్జాతీయ విత్తన కంపెనీలను సైతం కమిషన్ జనతా గ్యారేజ్ లా వ్యవహరించి దారిలోకి తెచ్చింది.

రెవెన్యూ అధికారులకు సైతం..

రైతుల విషయంలో రెవెన్యూ అధికారులు తప్పుచేసినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కమిషన్ ఊరుకోవడం లేదు. ధరణితో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారు. చిన్నచిన్న పొరపాట్లతో పాస్ బుక్స్ రాక కొందరు, ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూములు నిషేదిత జాబితాలో పడడంతో మరికొందరు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ధరణి పోయి.. భూ భారతి వచ్చినా.. ఇంకా రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. రకరకాల కారణాలు చెబుతూ.. తిప్పించుకుంటున్న అధికారులపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు కమిషన్ కు భూ సమస్యలతో వచ్చే రైతుల వివరాలు తెలుసుకొని.. వెంటనే వారి సమస్య పరిష్కరించే విధంగా అధికారులకు సూచిస్తుంది. అమాయక రైతుల కొందరు రెవెన్యూ సిబ్బంది మోసం చేస్తున్న విషయాలు కూడా కమిషన్ దృష్టికి వస్తున్నాయి. ప్రతి విషయాన్ని కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేలా చొరవ తీసుకుంటుంది.

ఇవేకాదు.. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తినా ఊరుకోవడం లేదు. పంట అమ్ముకోడానికి మార్కెట్లకు వచ్చే రైతులను దళారులు మోసం చేసినా, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. బోయిన్ పల్లి మార్కెట్‌లో నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులను సస్పెండ్ చేసేలా చూసింది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్‌లో పత్తి కొనుగోలు సమయంలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు, వ్యాపారాలు, దళారులు కలిసి ఏ విధంగా మోసం చేస్తున్నారో అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైతుల పక్షాన నిలిచింది. రైతుల‌కు సంబందించిన ప్రతి విషయంలో రైతు క‌మిష‌న్ నిజంగానే జ‌న‌తా గ్యారేజ్‌లా మారింది. ఎలాంటి ఇష్యూ ఐనా.. క‌మిష‌న్ హ్యాండిల్ చేస్తుంది.

-కంచ రాజు

సీపీఆర్వో, రైతు కమిషన్.

99638 01882

Next Story