- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ విద్యాసంస్థల ఇంటర్ ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ..
ఇంటర్ ఫలితాల్లో గత రెండేళ్ల కంటే, ఈ సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ద్వితీయ సంవత్సరపు ఉత్తీర్ణత శాతం

ఇంటర్ ఫలితాల్లో గత రెండేళ్ల కంటే, ఈ సంవత్సరం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ద్వితీయ సంవత్సరపు ఉత్తీర్ణత శాతం కొంత మేరకు పెరిగింది. గత సంవత్సరంలో తెలంగాణ సాధారణ గురుకులాలు 92.53% ఉత్తీర్ణత సాధించగా.. ఈ సంవత్సరం 92.90%తో ప్రభుత్వ విద్యాసంస్థలు రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాయి. మైనారిటీ గురుకులాలలు, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో కూడా ఉత్తీర్ణత శాతం కొంత మేర పెరిగింది. అదే సమయంలో మైనార్టీ గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం 1.45% మేరకు కొంత తగ్గింది. ఇక ఆదర్శ కళాశాలలు, మహాత్మ జ్యోతి బాపూలే కళాశాలలు, షెడ్యూల్డ్ తెగల గురుకుల కళాశాలలు, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో ఈ సంవ త్సరం ఉత్తీర్ణత గత సంవత్సరం కంటే ఒక మోస్తరుగా పెరిగింది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 4.31% ఫలితాలు పెరిగాయి. దీనికి గల కారణాలను విశ్లేషించుకుంటే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో..
ఈ కళాశాలల్లో ఈ ఫలితాలు రావడానికి కారణం ఆ కళాశాలల్లో చేసిన అకడమిక్ సంస్కరణలు.. వాటిలో ముఖ్యంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరం పొడుగునా రెగ్యులర్ తరగతులతో పాటు EAPCET, NEET, JEE పోటీ పరీక్షల కొరకు ఉచిత కోచింగ్ సదుపాయం కల్పించడం, పేరెంట్- టీచర్స్ మీటింగుల నిర్వహణ, వార్షిక పరీక్షలకై 90 రోజుల కార్యాచరణ, డిసెంబర్ నెలాఖరు కల్లా సిలబస్ పూర్తి చేసేలా కార్యాచరణ, ఉత్తీర్ణత శాతం పెంచడానికి క్షేత్రస్థాయి పరిశీలకులుగా (ఫీల్డ్ ఆఫీసర్స్‌గా) హెచ్ఓడీలను నియమించడం, తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులకు ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళిక ఏర్పరచడం, ఇక పాఠ్య ప్రణాళిక అమలు జరుగుతుందా? లేదా? కళాశాలలలో డ్రాప్ ఔట్స్ ఎంతమంది ఉన్నారు? వారి వివరాలు.. అదే విధంగా అర్ధ వార్షిక పరీక్షలలో తక్కువ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం లాంటి సంస్క రణలు చేయడంతో ఈ సంవత్సరం వారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.
గురుకుల కళాశాలల్లో..
ఈ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు పొందటానికి ప్రధానంగా.. అన్ని వసతులతో కూడిన పూర్తిస్థాయి ఉచిత రెసిడెన్షియల్ సౌకర్యాలతో పాటు, మాదిరి ప్రశ్న పత్రాల తయారీ ద్వారా వివిధ రకాల పరీక్షలు నిర్వ హిస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ సమకూరుస్తూ, తరచూ పై అధికారుల పర్యవేక్షణ జరుగుతూ, పూర్తిస్థాయి సౌకర్యాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్‌ని ఏర్పాటు చేసి ప్రతిభ కలిగిన విద్యార్థులను జాతీయ స్థాయి పరీక్షలకు సంసిద్ధులను చేయడం ఇవన్నీ పేద, బడుగు, బలహీన వర్గ పిల్లలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. అయితే ప్రభుత్వ కళాశాలల్లో అత్యుత్తమ ఫలి తాలు రావాలంటే గురుకులాల మాదిరి ప్రశ్నా పత్రాల తయారీ చేస్తూ పరీక్షలు నిర్వహించాలి. అలాగే కనీసం పరీక్షల సమయంలోనైనా గురుకులాల మాదిరి పూర్తిస్థాయి రెసిడెన్సియల్ సౌకర్యాలు కల్పిస్తే.. జూనియర్ కళాశాలలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తాయి. కావున ప్రభుత్వం ఈ దిశగా సౌకర్యాలు కల్పిస్తుందని ఆశిద్దాం.
డా. షేక్ జాన్ పాషా
అర్థశాస్త్ర అధ్యాపకులు,
73868 47203






