- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాలర్ బలహీనపడినా రూపాయి ఎందుకు క్షీణిస్తోంది?
డాలర్ పడిపోతున్న తరుణంలో ఆ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా పడిపోవడం అంటే ఆర్థిక దారుణమేనా? డాలర్ బలంగా ఉండి అన్ని దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి, ఆ క్రమంలో మన రూపాయి కూడా పడిపోతోందని అనుకున్నా ఒక అర్థం ఉంది.

డాలర్ పడిపోతున్న తరుణంలో ఆ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా పడిపోవడం అంటే ఆర్థిక దారుణమేనా? డాలర్ బలంగా ఉండి అన్ని దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి, ఆ క్రమంలో మన రూపాయి కూడా పడిపోతోందని అనుకున్నా ఒక అర్థం ఉంది. కానీ డాలర్ పతనం అవుతున్నా, మన రూపాయి విలువ పెరగక పోవడాన్ని ఏ విధంగా చూడాలి? అన్నదే చర్చగా ఉంది. అసలు ఈ విలువ పతనానికి కారణాలు విశ్లేషించడానికి ఆర్థిక నిపుణులకు ధైర్యం చాలడం లేదు.
యూపీఏ హయాంలో మన్మోహన్ వంటి ఆర్థిక నిపుణుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో.. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంకును రంగంలోకి దింపి విదేశీ కరెన్సీ విక్రయాలు చేసి రూపాయిని కాస్త బలం పుంజుకునేలా చేశారు. కనీసం పడిపోకుండా ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి విధానాలను పట్టించుకోవడం లేదు. రూపాయి పతనం ఎంతో మంది జీవితాలపై వ్యాపారాలపై ప్రభావం చూపిస్తోంది. పాలకుల వద్ద దీనికి పరిష్కారం లేదు.
రూపాయి బలి కావడానికి కారణం?
దేశ ఆర్థిక వ్యవస్థ స్థైర్యాన్ని కొలిచే కీలక సూచీలో ఒకటి కరెన్సీ విలువ. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ల ఒత్తిడికి, దేశీయ విధాన పరమైన వైఫల్యాలకు, రాజకీయ-ఆర్థిక అనిశ్చితులకు రూపాయి బలి అవుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న రూపాయి విలువ భారీగా పతనం అయింది. డాలర్‌తో పోలిస్తే 90 రూపాయలు క్షీణించి ఆల్ టైం రికార్డ్‌గా నమోదైంది. ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అయినా మన పాలకులు రూపాయి ఎందుకు పడిపోయిందో గుర్తించి కట్టడి చేయాలని ఎందుకు అనుకోరు? విదేశీ మదుపుదారులు స్టాక్, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుం టున్నారు. వాటిని ఇతర చోట్లకు తరలిస్తున్నారు. వారంతా డాలర్ల రూపంలోనే లావాదేవీలు చేస్తారు కాబట్టి డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతోంది. ట్రంప్ బెది రింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా పలు దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవు తున్నాయి. మనపైనా అదే ప్రభావం చూపిస్తోంది.
చేతులెత్తేసిన ఆర్‌బీఐ..
రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ చెబుతున్నప్పటికీ అవన్నీ ఉత్తుత్తి ప్రయత్నాలే.. గతంలో రూపాయి పతనం అయిన ప్రతీసారి రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి ఫారిన్ ఎక్సేంజ్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేసి రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆర్‌బీఐ మార్కెట్‌లో ఫారిన్ ఎక్సేంజ్‌గా విడుదల చేసే మొత్తం 11 బిలియన్ డాలర్లకు పడి పోయింది. ఆర్బీఐ విధానాన్ని పరోక్షంగా ప్రభుత్వ విధానంగా చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర 684 బిలియన్ డాలర్ల ఫారిన్ ఎక్సెంజ్‌లు ఉన్నాయి. అయినా ఆర్‌బీఐ ఇప్పుడు జోక్యం చేసుకోవడం లేదు. ఈ రూపాయి విలువ పతనంలో ఆర్‌బీఐ చర్యలు తీసుకోలేక చేతులు ఎత్తేసింది.
రూపాయి పతనంపై ప్రభుత్వ వాదనలు..
ఈ ఏడాది అక్టోబర్ 27తో పోలిస్తే ఇండియన్ రూపీ 3.5 శాతం పడిపోయింది. రూపాయి పతనం చెందుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం రివర్స్‌లో ఆలోచిస్తుంది. నిర్మలా సీతా రామన్ రూపాయి బలహీనపడడం కాదు, డాలరే బలహీన పడుతుందని ప్రకటించారు. పైగా మన దేశ ఎకానమీ ఫండమెంటల్స్ బలంగా బాగానే ఉన్నాయి. గ్లోబల్ పరిస్థితుల వలన రూపాయి పడిపోతున్నదని వాదిస్తున్నారు. అదే నిజమైతే గ్లోబల్ గానే డాలర్ పరిస్థితి బాగా లేదు. డాలర్ కూడా పతనం చెందుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుందో చెప్పకుండా దాట వేస్తున్నారు. డాలర్‌తో పోల్చినప్పుడు ఇతర దేశాల కరెన్సీ పెరుగుతుంటే, డాలర్ తగ్గుతుంటే ఇండియా రూపాయి మాత్రం ఎందుకు తగ్గుతోంది? దీనిని ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించడం లేదు.
సంఖ్య మార్పు కాదు.. భారం పెరగడం!
ఎగుమతులు చేస్తే డాలర్లు వస్తాయి. దిగుమతుల వల్ల డాలర్లు రావు, డాలర్స్ సంపాదిస్తున్న దానికి ఖర్చు పెడుతున్న దానికి ఇన్ బ్యాలెన్స్ వల్లన డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అయ్యి రూపాయి పతనం చెందుతుంది. ఈ అసమతుల్యత వల్ల కూడా రూపాయి పతనం అవుతోంది. డాలర్ విలువ పెరుగుతున్న ప్రతిసారీ, భారత్ చెల్లించాల్సిన ఇంధన బిల్లులు అమాంతం పెరుగుతాయి. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో ప్రజల జేబులకు నేరుగా తాకుతుంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత ముదురుతుంది. కూరగాయల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్ని రంగాల ధరలు పైకెక్కుతాయి. రూపాయి పతనం ఒక సంఖ్య మార్పు కాదు. దేశ ప్రజల మీద అదనపు భారం పడుతుంది.
సామాన్యులకు జేబు గుల్ల..
రూపాయి పతనం ఎంతో మంది జీవితాలపై వ్యాపా రాలపై ప్రభావం చూపిస్తోంది. సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది. దిగుమతుల మీద ఆధారపడిన వస్తువుల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల వాటి రేట్లు పెంచాల్సి వస్తుంది. రూపాయి పతనం వలన ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది కొనుగోలు శక్తి తగ్గుతుంది. బలహీనమైన రూపాయి కారణంగా దిగు మతులు మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో లోటు భారీగా పెరుగుతోంది. దీనికితోడు ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం, తలసరి ఆదాయం పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకే పోతుండటం, జీవన ప్రమాణాలు పడిపోవడం వంటి మోడీ ప్రభుత్వ విధానాల ఫలితాలు కూడా దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ విధానాలను ప్రతిఘటించి, ప్రత్యామ్నాయం వైపు మళ్లడమే అన్ని సమస్యలకు పరిష్కారం.
-టి.నాగరాజు,
94900 98292






