సీఎం ఆదేశించినా.. వరి కొనుగోళ్లలో మార్పెక్కడ?

by Ravi |   (  Updated:2026-05-19 00:31:03  IST  )

తెలంగాణలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తేమ శాతం పేరుతో ధాన్యం తిరస్కరణ, లిఫ్టింగ్ ఆలస్యం, చెల్లింపుల సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సీఎం ఆదేశించినా.. వరి కొనుగోళ్లలో మార్పెక్కడ?
X

తెలంగాణలో రైతులు మరోసారి వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షణ యుద్ధం చేస్తున్నారు. ఎండలు, అకాల వర్షాల మధ్య తమ కష్టార్జిత ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు వరి కొనుగోళ్లపై పూర్తి బాధ్యత తీసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికా రులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యం లిఫ్టింగ్ కాక రోజుల తరబడి నిల్వ ఉండిపోతోంది. తేమ శాతం పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం, లారీలు లేకపోవడం, హమాలీల కొరత, మిల్లర్లతో సమన్వయం లేకపోవడం వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు కిందిస్థాయి అధికారులు కొనుగోలు కేంద్రాలను సరిగా సందర్శించక పోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. తేమ పరీక్షల్లో పారదర్శకత పాటిం చడంతో పాటు ధాన్యాన్ని వర్షాల నుంచి రక్షించే ఏర్పాట్లు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలి. మండల స్థాయి అధికారులు కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించాలి. రైతులు ఇప్పటికీ ప్రభుత్వంపై నమ్మకంతోనే ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. లేదంటే రైతు ఆవేదన రేపటి ఆగ్రహంగా మారే ప్రమాదం ఉంది..

- జి. మధు గౌడ్

95335 51188

Next Story