- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమా.. తల్లిదండ్రులకు హెచ్చరిక!
టాలీవుడ్‌లో భారీ సెట్టింగులు, పౌరాణిక గాథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, సుమారు మూడేళ్ల విరామం తర్వాత పూర్తిగా రూటు మార్చారు.. భారీ హంగులకు దూరంగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఆయన తెరకెక్కించిన బలమైన సోషల్ డ్రామానే 'యుఫోరియా'.

టాలీవుడ్‌లో భారీ సెట్టింగులు, పౌరాణిక గాథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, సుమారు మూడేళ్ల విరామం తర్వాత పూర్తిగా రూటు మార్చారు.. భారీ హంగులకు దూరంగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఆయన తెరకెక్కించిన బలమైన సోషల్ డ్రామానే 'యుఫోరియా'.
ఒకప్పుడు ఒక్కడు, ఖుషీ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న భూమిక చావ్లా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
జెన్-జీ సంస్కృతిపై..
ఒక నగరంలోని ఒక ప్రతిష్టాత్మక కాలేజీకి కరస్పాండెంట్ వింధ్య వేములపల్లి (భూమిక చావ్లా). విద్యావేత్తగా సమాజంలో ఆమెకు ఎంతో గౌరవం ఉంది. హఠాత్తుగా హైకోర్టు మెట్లు ఎక్కి, తనపై తనే కేసు నమోదు చేయమని ఆమె కోరడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మహిళ, తాను నేరం చేశానని ఎందుకు ఒప్పుకుంది? అసలు ఆమె చేసిన నేరం ఏమిటి? మరోవైపు చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయి జీవితం ఈ కేసుతో ఎలా ముడిపడి ఉంది? నేటి 'జెన్-జీ' (Gen Z) సంస్కృతిలో యువత వెళ్తున్న దారి, వారిపై తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉందనేదే మిగిలిన కథ.
వింధ్య పాత్రకు జీవం పోసిన భూమిక..
ఈ సినిమాకు ప్రధాన బలం భూమిక చావ్లా.. గ్లామర్ పాత్రల నుంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రల వైపు మళ్లిన ఆమె, ఇందులో వింధ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.. ఒక బాధ్యతాయుతమైన విద్యావేత్తగా, అదే సమయంలో అంతర్మథనంతో రగిలిపోయే వ్యక్తిగా ఆమె ప్రదర్శించిన పరిణతి అద్భుతం. ముఖ్యంగా ఎమోష నల్ సన్నివేశాల్లో ఆమె అనుభవం తెరపై కనిపిస్తుంది. ఇక డెబ్యూ యాక్టర్ విఘ్నేష్ గవిరెడ్డి మొదటి సినిమానే అయినా, అస్థిరమైన మనస్తత్వం ఉన్న యువకుడిగా చాలా కాన్ఫిడెంట్‌గా నటించాడు. సారా అర్జున్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె తన ఉనికిని చాటుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన స్టైలిష్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు..
సినిమాటోగ్రఫీ, సంగీతం సూపర్బ్..
సాంకేతికంగా గుణశేఖర్ తన స్థాయిని, విలువలను కాపాడుకున్నారు.. ప్రవీణ్ కె. పోతన్ సినిమాటోగ్రఫీ సినిమాలోని సీరియస్ మూడ్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. కాలభైరవ అందించిన సంగీతం కథలోని గాఢతను పెంచింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కత్తెర పడాల్సింది.. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
సమాజానికి హెచ్చరిక ఈ చిత్రం..
'యుఫోరియా' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది సమాజానికి ఒక హెచ్చరిక. దర్శకుడు గుణశేఖర్ కేవలం నేరస్తులను వేలెత్తి చూపడం కాకుండా, ఆ నేరం జరగడానికి గల సామాజిక కారణాలను, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలను స్పృశించిన తీరు అభినందనీయం.. ఫస్ట్ హాఫ్ కథనం చాలా వేగంగా సాగుతూ ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో పదునైన సంభాషణలతో వివరించారు. ముగింపు సన్ని వేశాలు ఎమోషనల్ పవర్‌తో కూడి ఉండి, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
పిల్లలదారిపై చక్కటి సామాజిక ప్రయత్నం..
అయితే, సెకండ్ ఆఫ్‌లో సినిమా కాస్తా సాగదీతగా అనిపిస్తుంది.. సామాజిక ఇతివృత్తం ఉన్న సీరియస్ సినిమాలో పాటలు కథా ప్రవాహానికి అడ్డు తగిలినట్లు అనిపిస్తాయి. భూమిక, విఘ్నేష్ పాత్రల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త డ్రామా పండించాల్సింది. మొత్తంగా చెప్పాలంటే.. 'యుఫోరియా' ఒక నిజాయితీతో కూడిన సామాజిక ప్రయత్నం. తమ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు? వాళ్ల స్నేహాలు ఎలాంటివి? అని గమనిం చాల్సిన అవసరాన్ని ఈ చిత్రం తల్లిదండ్రులకు గుర్తు చేస్తుంది. రొటీన్ మాస్ మసాలా చిత్రాలకు భిన్నంగా, వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి సోషల్ డ్రామా ఇది.
- రాచకొండ సాగర్
70958 22883






