మస్క్ రాజకీయంగా కొత్త ప్రయోగం..

by Ravi |   (  Updated:2025-07-08 00:00:19  IST  )

ఎలాన్ మస్క్, కొద్దికాలంగా అమెరికా రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తూ కొత్తగా "ది అమెరికన్ పార్టీ" పేరుతో ముందుకు వస్తున్నారు.

మస్క్ రాజకీయంగా కొత్త ప్రయోగం..
X

ఎలాన్ మస్క్, కొద్దికాలంగా అమెరికా రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తూ కొత్తగా "ది అమెరికన్ పార్టీ" పేరుతో ముందుకు వస్తున్నారు. ఈయన సైన్స్‌లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా పెద్ద ప్రయోగానికి నాంది పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ధ కుబేరుడైన ఈయన అమెరికాలో కొత్త చరిత్రను సృష్టించడానికి సిద్ధం కావడం ఒక ప్రత్యేకత.

ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు ఒకవైపు అయితే.. సంపాదించింది అంతా పోగొట్టుకొని తిరిగి లేచి నిలబడి, కఠినతరమైన నిర్ణయాలు తీసుకుని నెగ్గుకు రావడమే ఎలాన్ మస్క్‌ ని ప్రపంచ ధనవంతుడిగా మార్చింది. అనుకున్నది సాధించేవరకు వదలనని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్రను సృష్టించడానికి ముందుకు వచ్చాడు. అమెరికా రాజకీయాలలో కొనసాగుతున్న డెమొక్రటిక్, రిపబ్లికన్ రెండు ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి భావనలకు విరుద్ధం గా మాస్క్ స్థాపించిన పార్టీలో కొత్త విధానాలు ఉంటాయని కొందరు భావిస్తే.. మరికొందరు మాస్క్ తీసుకునే నిర్ణయం కొత్త తరహాలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

అమెరికా ఎన్నికల్లో ఎలాన్ ప్రయోగాలు..

అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన గత ఎన్నికల నేపథ్యం లో ఎలాన్‌ మస్క్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు కోసం ఒక కొత్త కోణంలో గట్టిగా కృషి చేస్తూ వచ్చారు. దీనిలో భాగంగా ఆయన ట్రంప్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా తన చతురతను ప్రదర్శించేటట్లు చేయ టంలో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం సూపర్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (పీఏసీ)ని నిర్వహించా డు. అమెరికాలోని మిచిగన్‌, విస్కాన్‌సిన్‌లలో రిజిస్టర్డ్‌ ఓట ర్లకు స్వీప్‌స్టేక్స్‌ (లాటరీ) పథకాన్ని ప్రారంభించారు.ఇ లాంటి కార్యక్రమం ద్వారా పీఏసీ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలకు మద్దతుగా సంతకం చేసే ఓటర్లకు బహుమతులు ఇస్తామని ప్రకటించి ఇద్దరు రిజిస్టర్డ్‌ ఓటర్లకు మస్క్‌ నజరానా బహుమతులు అందించాడు.. దీంతో అమెరికా న్యాయ శాఖ హెచ్చరికలను కూడా ఎదుర్కొంటున్నాడు.

మస్క్ 'ది అమెరికన్ పార్టీ'

అనుకున్నది సాధించేవరకు వదలనని చెప్పే మస్క్ ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుతో అమెరికాలో కొత్త చరిత్రను సృష్టించడానికి ముందుకు వచ్చాడు. కొత్త పార్టీ సహాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్ల పైన దృష్టి సారించే అవకాశం ఉంది. ఒకవేళ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటే మరిన్ని మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్టుగా పలు రంగాలు భావిస్తున్నాయి. పత్రికలలో, మాధ్యమాలలో వివిధ రకాలుగా వెలువడుతున్న విషయాలు దీని అంతరార్థం తెలియజేస్తున్నాయి. అమెరికా రాజకీయాలలో డెమొక్రటిక్, రిపబ్లికన్‌లకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ కుబేరుడు నెలకొల్పిన పార్టీ ఏ విధమైన కొత్త పరిణామాలను సృష్టించబోతుందో? అని వివిధ రకాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి భావనలకు విరుద్ధంగా మస్క్ స్థాపించిన పార్టీలో కొత్త విధానాలు ఉంటాయని కొందరు భావిస్తే.. మరికొందరు మస్క్ తీసుకునే నిర్ణయం కొత్త తరహాలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ కుబేరుడు రాజకీయ చదరంగంలో ఇలాంటి నూతన ఒరవడిని సృష్టిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

బాల్యంలోనే కోడింగ్.. ఆన్‌లైన్ బ్యాంకింగ్

12 ఏళ్లకే కోడింగ్ నేర్చుకుని బ్లాస్టర్ అనే పిల్లల గేమ్‌ని తయారు చేసి 500 డాలర్లకు ఆ వీడియో గేమ్ అమ్మాడు మస్క్. ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని 1999లో మొట్టమొదటిసారిగా ప్రారంభించాడు. 10 మిలియన్‌ డాలర్లతో ఎక్స్‌.కామ్‌ అనే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ కంపెనీని కొన్నాడు. ఒక కంపెనీని పెట్టడం దాన్ని డెవలప్ చేయడం తర్వాత దాన్ని లాభాలకు అమ్మేయడం అతని మోడల్‌గా మారింది. తర్వాత మార్స్ గ్రహంపై మనుషులు జీవించే ఏర్పాటు గురించి ఊహించి అనేకసార్లు రాకెట్ ప్రయోగాలు చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీగా టెస్లాను అభివృద్ధి చేశాడు. తాజాగా రాజకీయ రంగ ప్రవేశం అమెరికాలో సంచలనం కలిగిస్తోంది.

- డా. చిటికెన కిరణ్ కుమార్

94908 41284

Next Story