విద్యా వికాసానికి విద్యా మంత్రి బాటలు!

by Ravi |   (  Updated:2025-07-22 01:00:59  IST  )

విద్య ఒక్కటే సామాజిక అసమానతలను రూపుమాపే సాధనం. అటువంటి విద్యా రంగాన్ని ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వం ధ్వంసం

విద్యా వికాసానికి విద్యా మంత్రి బాటలు!
X

విద్య ఒక్కటే సామాజిక అసమానతలను రూపుమాపే సాధనం. అటువంటి విద్యా రంగాన్ని ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వం ధ్వంసం చేసి దాని పీకనులి మిన పరిస్థితుల్లో మళ్లీ విద్యా రంగంలో పునరుత్తేజం తేవాలని, ఆధునిక జీవన ప్రమాణాలకు తగినట్లుగా ప్రభుత్వ విద్యను పరిపుష్టం చేయాలనే తలంపుతో ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ విద్యారంగాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆశలు, ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వ సంకల్పంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా మార్పులకు పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పాత విధానాలకు స్వస్తి పలికి ఆధునిక విద్యా మోడల్‌ను తీసుకువస్తున్నారు. అందులో భాగంగా కొన్ని ప్రధాన చర్యలు చేపట్టారు. పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యాస పురోగతి, తల్లిదండ్రులతో సమావేశాలు, ప్రతి స్కూల్ వివరాలను డిజిటల్ డాష్‌బోర్డ్‌లో నమోదు చేసి, సమీక్షలు చేయనున్నారు. విద్యను అందరికీ చేరువ చేసి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను తిరిగి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నారు.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన సంస్కరణలు రాష్ట్ర విద్యా రంగానికి ఒక విశిష్ట మలుపు తిప్పనున్నాయి. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్యవరకు సమగ్ర అభివృద్దే ధ్యే‌యంగా పని చేస్తున్నారు.

పేరెంట్స్-టీచర్స్ భేటీ ముందడుగు

విద్యార్థుల విద్యా పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని భావించి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్- టీచర్ మీటింగ్స్ తప్పనిసరి చేశారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాలల వరకు పీటీఎంలను విధిగా నిర్వహించాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. తల్లిదండ్రుల మద్దతు లేకుండా విద్యార్థుల అభివృద్ధి సాధ్యం కాదని తల్లిదండ్రుల కలలలో, ఉపాధ్యాయుల ఆశయాలలో విద్యార్థుల కళ్లలో వెలిగే శాశ్వత వెలుగు, ఈ కలల వెలుగును కార్య రూపంలోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో విద్యాశాఖ మంత్రి తల్లిదండ్రులతో నిర్వ హించిన సమాలోచన ప్రపంచంలోనే అతి పెద్ద తల్లిదండ్రుల సమావేశం.

ప్రజల భాగస్వామ్యంలో రికార్డు..

2025 జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 2.0 కార్య క్రమంలో దాదాపు 2.3 కోట్ల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. కానీ ఇది కేవలం గణాంకాల ఘనత కాదు. ఇది ఒక కొత్తతరం విద్యా దిశకు రాష్ట్ర ప్రజల భాగస్వామ్య సంకేతం. విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల అవగాహన. ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని, ప్రగతిని తల్లి దండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇది వేదిక. తల్లి దండ్రులు పాఠశాలలపై నమ్మకాన్ని కలిగి ఉండేలా చేయడం, తల్లిదండ్రులను పాలనలో భాగస్వాములుగా మార్చడం, పాఠశాలల్లో మెరుగుదల కోసం తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడం, విద్యా విధానాలు ప్రజల అభిరుచులకు దగ్గరగా ఉండేలా చేయడం, విద్యా మంత్రి సమక్షంలో పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ని నిర్వర్తించారు. ఈ భేటీలలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది.

బోధనను తల్లిదండ్రులు తెలుసుకోవాలి!

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారే తప్ప, సమయాన్ని వెచ్చించట్లేదు. భారీగా ఫీజులు కట్టి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించడం, ఖరీదైన వస్తువులను కొనివ్వడం, విలాసవంతమైన టూర్లు చేయించడం ద్వారా పిల్లలను బాధ్యతతో పెంచుతున్నామనుకుంటున్నారు. కానీ పిల్లలు ఏ సబ్జెక్టును ఎలా చదువుతు న్నారు, పాఠాలు ఎంతవరకు అర్థమవుతున్నాయి, ఉపాధ్యాయుల బోధన ఎలా ఉందనే విషయాలను అస్సలు పట్టించుకోరు.. ఫీజులు కడుతున్నాం కాబట్టి తమ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా ఉపాధ్యాయులదే, విద్యాసంస్థలదే అనుకొంటున్నారు. కానీ అది సరికాదు. వాస్తవానికి దాదాపు 80 శాతం తల్లిదండ్రులకు తమ పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పేర్లు కూడా తెలియదు.. వారు బోధించే సబ్జెక్టు పేరుతోనే టీచర్లను పిలుస్తుంటారు పిల్లలు. కొందరు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్‌లో చేర్పించేటప్పుడు తప్ప మరెప్పుడూ స్కూల్ మొహం చూడరు. ఇటువంటి ధోరణి సరికాదు.. అందుకే పాఠశాలలు క్రమం తప్పకుండా 'పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకోవడం ద్వారా విద్యార్థులు ఎలా చదువుతున్నారు? వారి మానసిక స్థితి ఏమిటి? వారికి ఎలాంటి మార్గదర్శనం అవసరం అన్నది అర్థమవుతుంది.

పిల్లల చదువులను తెలుసుకునేందుకు..

ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి ప్రజల తోడ్పాటు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లోపాలు, బోధన ప్రమాణాలు, వసతులు మొదలైన అంశాలపై తల్లిదండ్రుల స్పందన, ప్రభుత్వ పాఠశాల అంటేనే నాణ్యత అన్న నమ్మకాన్ని ప్రతిష్టించాలన్న లక్ష్యం ప్రభుత్వానికి ఉంది. అందుకే విద్యను ఒక ఉద్యమంగా మార్చి, ప్రజలతో కలిసి ముందుకు నడవాలన్న సంకల్పం, విద్యార్థి విజయానికి కుటుంబం, పాఠశాల కలిసి చేయవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మధ్యలో సమన్వయకర్తగా ఉంటుంది. ఈ కార్యక్రమంతో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది ప్రభుత్వం. ఇది కేవలం ఒక సమావేశం కాదు. ఇది తల్లిదండ్రుల ఆశలు, విద్యార్థి భవిష్యత్తు, ఉపాధ్యాయుని బాధ్యత, ప్రభుత్వ సంకల్పం అన్నిటినీ కలిపిన, ఒక సార్వజనిక విజ్ఞాన వేదిక. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా, ప్రపంచ స్థాయి విద్యను అందించే దిశగా మంత్రి లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేశారు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story