- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లల భావోద్వేగాలను అపార్థం చేసుకోవద్దు!
2012లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోక్సో చట్టం, బాలలపై లైంగిక దాడులను అరికట్టడం, వారి రక్షణను బలోపేతం చేయడం

2012లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోక్సో చట్టం, బాలలపై లైంగిక దాడులను అరికట్టడం, వారి రక్షణను బలోపేతం చేయడం అనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఈ చట్ట ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని మైనర్లుగా పరిగణించి, వారి మధ్య జరిగిన ఏదైనా లైంగిక సంబంధాన్ని (పరస్పర అనుమతి) ఉన్న నేరంగా పరిగణించడం ఈ చట్టం ప్రత్యేకత. అయితే, తాజాగా ఈ చట్టం అనేక భావోద్వేగాత్మక, సామాజిక సమస్యల కు దారితీస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజర్ల ప్రేమ సంబంధాలను ఈ చట్టం క్రిమినలైజ్ చేయడం వల్ల వారిలో నిస్సహాయత, మానసిక ఒత్తిడులు, అంతిమంగా ఆత్మహత్యల దాకా తీసుకువెళ్లే ఘటనలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ మియాపూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఈ సమస్య తీవ్రతను చూపిస్తోంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హన్సిక నాయక్, షేక్ రిజ్వాన్ స్నేహంగా చాట్ చేసుకుంటున్నారని, వారి మెసేజ్‌లు తల్లిదండ్రులకు, పాఠశాల అధికారులకు తెలిసింది. ఆ తర్వాత వారు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ఇద్దరూ వేర్వేరు రోజుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది దురదృష్టకరం. చట్టపరంగా వారు మైనర్లు కావడం వాస్తవమే. కానీ వారు చేసింది చట్టబద్ధ నేరమా? లేక వారిని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం తలెత్తించిన సంక్షోభమా? అన్నది సవాలుగా మారింది.
38 శాతం కేసులు ఇలాంటివే..
ఇలాంటి ఉదంతాల పరంపరలో ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘Court – State vs A Nobody’ మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలోని కోర్టు సన్నివేశం, టీనేజ్ ప్రేమ అనేది నేరమా? లేక భావోద్వేగ పరిపక్వతకీ, స్వేచ్ఛకీ సంబంధించినదా? అన్న ప్రశ్నను తార్కికంగా, భావోద్వేగంగా ప్రేక్షకుల ముం దుంచుతుంది. ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందించడం, చట్టాన్ని సమాజం ఎలా వక్రీకరించుకుంటుందో చూ పించడం, నేటి యువత ఎదుర్కొంటున్న అసమానతలను నిశితంగా ఎత్తిచూపుతుంది. ఎన్ సీఆర్‌బీ ప్రకారం, పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో సుమారు 38 శాతం కేసులు 16-18 ఏళ్ల మైనర్ల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధాలపై నమోద వుతున్నా యి. దీంతో సహజంగా వారిపై ఎక్కు వగా కుటుంబ ఒత్తిడులు, సమాజపు అపోహల ప్రభావం ఉంటుంది. వారిలో ప్రేమ, స్నేహ భావోద్వేగాలను తల్లిదండ్రులు అపరాధంగా చూడటం, ప్రైవసీ లేకుండా పాఠశాలల్లో చట్ట బద్ధ విచారణ జరపడం లాంటివన్నీ పిల్లలను ఓ సైకలాజికల్ ట్రామాలోకి తీసుకు వెళ్తు న్నాయి. ఈ వయస్సు పిల్లలకు శిక్షే కాకుండా, సరైన మార్గదర్శనం, అవగాహన అవసరం. కానీ సమాజం మాత్రం వీరి సమస్యలను భయంకరంగా చిత్రీకరించి వారిని శిక్షించే దిశగా ముందుకెళ్తోంది. ఈ తరహా సంఘటనలు ఏకం గా పిల్లల్లో మనోబలాన్ని చంపేస్తున్నాయి.
వారి భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా..
ఇక్కడ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చట్ట నిర్వాహకులు అంతా సమన్వయంతో వ్యవహరించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో మారు తున్న శారీరక, భావోద్వేగ పరిణామాలను స్నేహపూర్వకంగా అర్థం చేసుకోవాలి. వారు తమ బాధ్యతను కేవలం తల్లిదండ్రులకు ఫిర్యాదులు చేయడంలోనే గాక, విద్యార్థులతో చర్చించడం లాంటివి చేయాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రేమను అజ్ఞానం లేదా అసభ్యతగా చూడక, వారికి మానసిక స్థిరత్వంతో సమన్వయం చేయాలి. అలాగే చట్టపరంగా కూడా మార్పులు అనివార్యం. అనేక మంది న్యాయ నిపుణులు, హైకోర్టులు ఇప్పటికే 16-18 ఏళ్ల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధాలను నేరంగా పరిగణించకూడదన్న అభిప్రాయాన్ని వెల్లడించాయి. లా కమిషన్ మాత్రం ఈ వయస్సును తగ్గించకూడదని సూచించింది. అయితే వయస్సు మార్పు కాకపోయినా, చట్టం అమలులో హేతుబద్ధత, వివేచన ఉండాలన్నది సమాజం ఎదురు చూస్తున్న మార్గం. పిల్లలు బాధితులుగా మారకుండా, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని వారిని గౌరవించేలా వ్యవస్థలు పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. పోక్సో చట్టం పేరు మీద టీనేజర్ల భావోద్వేగాలను క్రిమినలైజ్ చేయడం వల్ల వారికి రక్షణ కలగక, భయం, ఒత్తిడి మాత్రమే మిగులుతోంది. చట్టం అమలు అనేది యంత్రాంగం మాత్రమే కాదు. అది మానవ సంబంధాల్ని, భావోద్వేగాలను అర్థం చేసుకుని సమాజం ఎలా స్పందించాలో తెలిపే దిక్సూచి కావాలి.
పోక్సో చట్ట పరిధిలోంచి తొలగించేందుకు..
16-18 ఏళ్ల వయస్సులో పరస్పర అంగీకారంతో ఏర్పడిన సంబంధాలను పోక్సో చట్టం పరిధిలోంచి తొలగించేందుకు చట్టపరమైన పునర్విచారణ అవసరం. "సీరియస్ ఎబ్యూస్" కేసులకు, పరస్పర అంగీకార ప్రేమ సంబంధాలకు వేరు వేరు విచారణ, శిక్షల విధానం ఉండాలి. అలాగే 8వ తరగతి నుండి విద్యా ర్థులకు శారీరక, భావోద్వేగ వికాసం, సురక్షిత సంబంధాలపై అవగాహన కలిగించేలా లైంగిక విద్యను బోధించాలి. ఉపాధ్యాయులు పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకునే శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులకు పిల్లల వయసులో వచ్చే మార్పులపై అవగాహన కలిగించి, ఓపికగా సంభాషించే దృక్పథాన్ని అలవర్చాలి. పోలీసులు పరస్పర అంగీకారంతో ఏర్పడిన టీనేజ్ ప్రేమ సంబంధాలపై విచారణలో హేతుబద్ధంగా వ్యవహరించే శిక్షణ ఇవ్వాలి. చైల్డ్ లైన్, కౌన్సెలింగ్ కేంద్రాలను బలోపేతం చేసి, బాధితులకు మానసికంగా మద్దతు ఇవ్వాలి. కోర్ట్ సినిమాలో చూపిన సమస్యలను మనం చట్ట వ్యవస్థలోనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రేమను నేరంగా కాకుండా, అనుభవ దశగా అర్థం చేసుకునే మార్గాలు సమాజం ముందుంచాలి.
డా. సల్లా సౌజన్య,
సోషల్ యాక్టివిస్ట్
96408 41202






