ఇప్పుడే ఎన్నికలు వద్దు!

by Ravi |   (  Updated:2025-02-15 00:30:55  IST  )

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వచ్చేవారంలో నోటిఫికేషన్ విడుదల చేయనుందని, మూడు విడతల వారీగా

ఇప్పుడే ఎన్నికలు వద్దు!
X

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వచ్చేవారంలో నోటిఫికేషన్ విడుదల చేయనుందని, మూడు విడతల వారీగా నిర్వహించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. అయితే ఈ కత్రువులో సింహ భాగం ఉపాధ్యాయులకే విధులు కేటాయిస్తారు. ఈ పరీక్షల సమయంలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే, పిల్లల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఉపాధ్యాయులంతా బడుల్లో సిలబస్ పూర్తిచేసి రివిజన్‌లో నిమగ్నమై విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్న ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియకి ప్రభుత్వం తెరతీయడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పటికే ఆపార్, యూ డైస్, తదితర పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి ఉంది. ఇంకొక వైపు ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

వేసవిలో నిర్వహిస్తే..

సర్పంచుల పదవీకాలం ముగిసి సంవత్సర కాలం పూర్తయింది. కొన్ని రోజులు ప్రత్యేక అధికారులతో పాలనను కొనసాగించిన ప్రభుత్వం ఇంత హడావిడిగా ఈ పరీక్షల సమయలోనే ఎన్నికలను నిర్వహించడంలో గల అంతర్యమేమిటో బోధపడటం లేదు. అయిన ఆలస్యం ఎలాగూ అయ్యింది. కాబట్టి ఈ పరీక్షల హడావిడి అయ్యాకా తీరిగ్గా వేసవిలో ఎ న్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా జిల్లాల్లో ఇప్పటికే మొదటి ప్రాక్టీస్ టెస్ట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల ఇరవై నుండి రెండో ప్రాక్టీస్ టెస్ట్, మార్చి 6 నుండి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా ఎన్నికల హడావిడిలో నిమగ్నమైతే విద్యార్థుల పునశ్చరణ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. అందుకే విద్యా ర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పరీక్షల అనంతరం నిర్వహించాల్సిందిగా అభ్యర్థించి వాయిదా వేయా లని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS,

90006 74747

Next Story