- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ టీచర్లు సంవత్సరంలో సగం రోజులు పని చేస్తున్నారా?
ఈ మధ్య అసెంబ్లీలో విద్యాశాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలు ఉపాధ్యాయులపై గౌరవ సభ్యులు

ఈ మధ్య అసెంబ్లీలో విద్యాశాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలు ఉపాధ్యాయులపై గౌరవ సభ్యులు వ్యాఖ్యా నిస్తూ వారిని కించపరిచేలా మాట్లాడడం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న తరహా సెలవులనే ఉపాధ్యాయులు కూడా తీసుకుంటున్నారు కానీ, సంవత్సరంలో ఉపాధ్యాయులు కేవలం సగం రోజులే పనిచేస్తున్నారని, జీతాలు మాత్రం సంవత్సరానికి తీసుకుంటున్నారని అర్థం వచ్చేలా మాట్లా డటం సరికాదు. మేము కూడా మిగతా ఉద్యోగుల లాగే పనిచేస్తున్నాం. కేవలం మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఆ సమ యంలో కూడా మేము ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటున్నాం. మీరు ఒకవేళ పిల్లలకు ఎలాంటి సెలవులు ఇవ్వకుండా బోధన సాగించే విధంగా అకాడమిక్ కేలెండర్‌ను రూపొందించి ఇస్తే ఆ విధంగా పని చేయడానికి ఉపాధ్యాయ లోక మంతా సిద్ధంగా ఉంటుందని గమనించాలి.
11 రోజులే ఎక్కువ!
ఉపాధ్యాయులుగా మా పనిదినాల గురించి ప్రభుత్వానికి తెలియపరచవలసిన బాధ్యత మా మీద ఉందని మేము భావిస్తున్నాం. సంవత్సరంలో 52 ఆదివారాలు, 10 రెండో శనివారాలు, ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన 15 సాధారణ సెలవులు, 7 ప్రత్యేక సెలవులు, ఉద్యోగినిలకు 5 ప్రత్యేక సెలవులు దానితో పాటు ప్రభుత్వం ప్రకటించిన పండగ రోజులు ఉంటాయి. ఇవి ప్రభుత్వ అన్ని కార్యాలయాల ఉద్యోగులకు మాదిరిగానే ఇచ్చిన 5 ఆప్షనల్ సెలవులు, 3 స్థానిక సెలవులు ప్రతి ఉద్యోగికి ఉంటాయి. వీటితో పాటు విద్యార్థుల అలసటను తీర్చడానికి దసరా పండుగ సెలవులు 14రోజులు (వాటిలో 6 రోజులు సాధారణ సెలవులే), సంక్రాంతి పండగ సెలవులు 6 రోజులు (వాటిలో 3 నుండి 4 రోజులు సాధారణ సెలవులే) మొత్తం 11 రోజులు మాత్రమే ఎక్కువ వస్తాయి. ఇక వేసవి సెలవులు విషయానికి వస్తే ఏప్రిల్ 24 నుండి మే 31 వరకు ఉన్న 37 రోజుల్లో 7 రోజులు సాధారణ సెలవులే.. 30 రోజులకు మిగతా ఉద్యోగులకు ప్రభుత్వమే ఒక నెల అదనంగా జీతం ఇస్తుంది.
మా గౌరవాన్నీ తీసేలా మాట్లాడకండి!
వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు అని అకడమిక్ కేలెండర్‌లో చూపిస్తారు.. కానీ జూన్ ఒకటి నుండే "జయశంకర్ బడిబాట" పేరుతో టీచర్లను స్కూల్‌కి రప్పిస్తారు! ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను వెతికి పట్టుకొచ్చుకుంటున్నారని ప్రభుత్వమే తెలి పింది. ఇదే కాకుండా ప్రతీ విద్యా సంవత్సరం నవంబర్ నెల నుంచి మార్చి నెల వరకు పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ తరగతులు, స్టడీ అవర్స్ పేరుతో హై స్కూల్ టీచర్లచే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, 2వ శనివారం, ఆదివారాలు 3 గంటలు అదనంగా పని చేయిస్తుంది ప్రభుత్వం. దీనికి అదనంగా ఏం జీతం ఇవ్వరు కదా. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలోనే తక్కువ సెలవు దినాలు ఎక్కువ పని దినాలు ఉన్నాయి. కావున ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరిని ఏర్పరచుకొని వారి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని అభ్యర్థిస్తున్నాం.
పాల్వంచ హరికిషన్,
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్
95024 51780






