- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముస్లింలపై వివక్ష.. ఇదో రాజకీయం! వారితో ఉన్న సోదరభావాన్ని మరవగలనా..?
ఈ మధ్య కాలంలో పాలకులు తరచూ ముస్లిం వర్గాలను లక్ష్యం చేసుకుంటూ మాట్లాడే మాటల్లో ముస్లింలు, వారి ఆహారం, జీవనశైలి

ఈ మధ్య కాలంలో పాలకులు తరచూ ముస్లిం వర్గాలను లక్ష్యం చేసుకుంటూ మాట్లాడే మాటల్లో ముస్లింలు, వారి ఆహారం, జీవనశైలి, మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి మతాచారాలు పట్టించుకోకుండా చట్టాలు చేస్తూ భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్నారు.. కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఈ విషయాలను ప్రజలు తమ వ్యక్తిగత సంభాషణల్లోకి కూడా రానిచ్చేవారు కాదు. ఈ దేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే హిందూ, ముస్లింల మధ్య విభేదాలు ఉండేవి. అప్పుడప్పుడూ అల్లర్లు, ఘర్షణలు చెలరేగేవి కూడా.. కానీ అది ఆ ప్రాంతం వరకే.. కానీ ఇప్పుడు అలా లేదు.. దేశంలోని ఏ ప్రాంతంలో ఈ అల్లర్లు, ఘర్షణలు జరిగినా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే ఇంటి పక్కపక్కన, ఒకే ఊరిలో ఉన్న హిందూ- ముస్లిం మధ్య అల్లర్లు, ఘర్షణలు ఉంటాయా?
ఈ జ్ఞాపకాలు ఎలా మరువగలను?
నేను ఓ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కానీ నా జన్మకే సహాయపడింది ఓ హిందూ మహిళ. ఆమెను నేను మరవగలనా? నాకు ఓన మాలు నేర్పించిన అధ్యాపకులే కాదు, ఇక చదువుకుంటున్న సమయంలో ఉండే హిందూ స్నేహితులతో ఉన్న ఆ ఆనంద క్షణాలు ఎలా మరువగల ను..? ఇక వేకువజామున ‘అల్లాహు అక్బర్’ అంటూ మసీదు నుండి వచ్చే పిలుపు, ‘కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తతే’ అంటూ వినే వ్రవర్తలను మరువగలనా..? జీవితంలో నేను ఒక మెట్టు ఎక్కడంలో భాగమైన హిందూ అధ్యాపకులను నేను మరవగల నా..? మా ఇంటి పక్కన ఉండే కాంతమ్మ దసరా, సంక్రాంతి పండుగల్లో చేసే చకినీలు, అప్పలు ఏ విధంగా మరవగలను..? ఈద్ పండుగ రోజు నా హిందూ మిత్రులు చెప్పే ఈద్ ముబారక్ ఆప్యా యతను ఎలా మరవగలను..? నా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఊరు మొత్తం కన్నీళ్లతో మా బాధను పంచుకున్న విషయం ఎలా మరవగలను..? చివరగా, నా బాల్యం నుండి ఇప్పటి వరకు నాతో ఉన్న హిందూ సోదరుల ఆప్యాయత, అను రాగం, కష్టం, సుఖం, నమ్మకం, స్నేహం, సోదరభావం ఆదర్శప్రాయంగా ఎప్పటికీ నాతో ఉంటుంది.
ఇదో రాజకీయం!
కానీ దేశంలో గత కొన్నేళ్లుగా భారతదేశంలోని ముస్లింలలో 'భయం' గూడు కట్టుకోవడం ప్రారంభ మైంది. హిందూ-ముస్లిం వివాదానికి సంబంధించి పాలకులు మత పరిరక్షణ పేరుతో రెచ్చగొట్టే ప్రసం గాలు చేస్తూ, మాంసం దుకాణాల గురించి, హిజాబ్ ధరించడం గురించి, మైకుల్లో వినిపించే ఆజాన్ గురించి వివాదం సృష్టించడం లాంటివి చేస్తూ ఏదో ఒక రూపంలో మతపరమైన అంశాలను తెరపైకి తెస్తూనే ఉన్నారు. ఈ భయం కారణంగానే ఒకవైపు ముస్లిం సమాజం ఏకమవుతోంది. మరో వైపు హిందూ ఐక్యత గురించి చర్చ జరుగుతోంది. కానీ నిజానికి ఇదో ఓటు బ్యాంకు రాజకీయం. ఎన్నికల్లో పాలకులు ప్రయోజనాలు పొందడం కో సం ప్రజలకు, ప్రజలకు మధ్య యుద్ధం ఎగదోసే చర్యలు చేస్తున్నారు. ఇది హిందువుల్లో కొందరికి సంతోషాన్ని ఇచ్చినా.. మెజారిటీ హిందువులకు మాత్రం ముస్లింలపై పాలకుల చర్యలు నచ్చడం లేదు. ఇక ముస్లింలను ఓటు బ్యాంకుగా బావించే కొన్ని పార్టీలు ముస్లింలు సురక్షితంగా లేరని చెబుతుం టారు. అందుకే ఎన్నికలతో మతానికి సంబంధం పూర్తిగా ఎప్పుడైతే తెగిపోతుందో అప్పు డు ఈ పరిస్థితి మారుతుంది? అయితే, ఈ రాజకీయాలకు ఎప్పుడు ముగింపు పడుతుంది? ఎవరు ముగింపు పలుకుతారు? అనేవే అసలు ప్రశ్నలు..
-ముహమ్మద్ అజీజుద్దీన్
70131 76656






