- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి గెలిచింది.. బీహార్‌లో ఎన్డీఏ డబుల్ సెంచరీ!
బిహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ముఖ్య ప్రభావం చూపనున్నాయి. ఎన్డీయే స్పష్టమైన విజయంతో కూటమికి మరింత బలం చేకూరింది. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే సుదీర్ఘ రాజకీయ

బిహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ముఖ్య ప్రభావం చూపనున్నాయి. ఎన్డీయే స్పష్టమైన విజయంతో కూటమికి మరింత బలం చేకూరింది. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే సుదీర్ఘ రాజకీయ వారసత్వం గల ఈ రాష్ట్రంలో, 243 స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. నితీశ్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి, యువత, మహిళల ఓటర్ల మద్దతుతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీ సాధించడం అద్భుతమైన విషయం.
బిహార్ ఎన్నికల్లో ఇంతటి విజయం సర్వేలతో సహా ఎవరూ ఊహించలేదు. ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినా ఓటర్లు అత్యధికంగా ఎన్డీయే వైపు మొగ్గు చూపడం విశేషం.
ఎన్డీయే కూటమికి అపూర్వ విజయం..
భారతదేశంలోని అత్యంత రాజకీయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రాల్లో బిహార్ మీద అందరి దృష్టి నిలిచింది. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే సుదీర్ఘ రాజకీయ వారసత్వం గల ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. సుమారు 69 పార్టీలు పోటీచేసిన ఈ ఎన్నిక, దేశంలో అత్యంత పోటీతత్వంతో కూడినట్లుగా నిలిచింది. మహాగఠ్‌బంధన్ ప్రజా సంక్షేమాన్ని తన ఎజెండాలో ప్రధానంగా ఉంచినప్పటికీ, ఓటర్లకు అభివృద్ధి - ఆధారిత విధానం ఎక్కువ ఆకర్ష ణీయంగా ఉండిందని. ఫలితాలు సూచిస్తున్నాయి, భవి ష్యత్తులో బిహార్ ‘అభివృద్ధి-కేంద్రీకృత’ పాలన వైపుగా కొనసాగుతుంది. పైగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కేంద్రిక వ్యూహాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. ఏ రకంగా చూసినా ఇది ఎన్డీయే కూటమికి అపూర్వ విజయం అనే చెప్పాలి.
జనసురాజ్ ఉద్యమం..
ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన జన సురాజ్ ఉద్యమం కొత్త రాజకీయ వేదికగా నిలిచింది. అభివృద్ధి ఆధారిత ప్రజాధారిత పాలనకు ప్రతిపాదించిన ప్రయత్నాలు, ఎక్కువ సీట్లు దక్కకపోయినా ఓట్లను చీల్చడంలో ప్రభావం చూపాయి. ఇక అలాగే ఓటర్ జాబితా సవరించిన తర్వాత కొత్త ఓటర్లు, యువ ఓటర్లు, వలస తిరిగి వచ్చిన ఓటర్లు ఎక్కువగా పాల్గొన్నారు. ఈ కారణంగా 64.66% పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్రంలో అత్యధికం.
అభివృద్ధి సంక్షేమం పైనే..
ఎన్డీయే (NDA) మేనిఫెస్టో ప్రధాన దృష్టి అభివృద్ధి, పరిశ్రమలు, టెక్నాలజీ ఆధారిత పాలన, ఉద్యోగాలు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాల హామీస్కిల్ డెవలప్‌మెంట్, మెగా స్కిల్ సెంటర్లు, యువతను నైపుణ్యవంతులుగా తయారు చేయడం మహిళా సాధికారత, లఖ్‌పతి దీదీలు, మిషన్ క్రోర్‌పతి పథకాలు, రైతులు, వ్యవసాయ ఎగుమతుల పెంపు, పెట్టు బడుల ద్వారా మద్దతు ఆరోగ్యం, హాస్పిటల్స్, మౌలిక సదుపాయాలు, అవినీతి వ్యతిరేక విధానం, అభివృద్ధి ఆధారిత పారదర్శక పాలన పెట్టుబడులు & టెక్నాలజీ, ₹50 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నారు.
మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో ప్రధాన దృష్టి..
మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో ప్రధానంగా ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, ఉద్యోగాలపైనే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం హామీ స్కిల్ డెవలప్‌మెంట్ విద్యా ర్థులకు ఉచిత సేవలు, కళాశాలలు మహిళా సాధికారత, మై-బెహిన్ యోజన, MAI-BETI పథకాలు రైతుల కోసం పంట మద్ధతు ధర హామీ, అన్ని పంటలకు ₹25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా, ఓపీఎస్ పునరుద్ధరణ, ఉచిత విద్యుత్, పెన్షన్లు అవినీతి వ్యతిరేక విధానం జీరో టాలరెన్స్ పెట్టుబడులు & టెక్నాలజీ, ప్రభుత్వ వ్యయ ఆధారిత సంక్షేమం, హౌసింగ్, రోడ్లు, సామాజిక సేవలు రెండు మేనిఫెస్టోలు ఉద్యోగాలు మహిళా సాధికారతపై దృష్టి పెట్టినా, ఆ రాష్ట్ర ఓటర్లు ఈ సారి అభివృద్ధి ఆధారిత విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు.
దెబ్బతిన్న ప్రతిపక్షం
మహాగఠ్‌బంధన్ (MGB)లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు పొందడం వల్ల, ఫలితంగా MGB మొత్తం గెలుపు సాధించలేకపోయింది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకోవడం వల్ల ఇతర కూటమి పార్టీల ప్రధానంగా ఆర్జేడీ కోసం సీట్లు తగ్గిపోయాయి. ఈ అసమతుల్యత కారణంగా, MGBను విజయవంతం చేయడానికి అవసరమైన నెంబర్ చేరలేక, కూటమి పరాజయం ఎదుర్కొంది.
మరింత బలపడిన నితీశ్
నితీశ్ కుమార్ పాత్ర బిహార్ రాజకీయాల్లో కేవలం కుటుంబం- కుల ఆధారిత నాయకత్వంగా కాకుండా, సమగ్ర సామాజిక రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. కులాన్ని ప్రధాన అంశంగా కాకుండా, మహిళల, యువత ఓట్లు ఆకర్షించారు. ఈ మూడు వర్గాలను సమన్వయంగా ప్రభావవంతంగా ఆకర్షించడంలో అతను విజయవంత మవడం వల్ల, అతని రాజకీయ శక్తి మరింత బలపడింది.
రాజకీయాలపై కీలక ప్రభావం..
బిహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ముఖ్య ప్రభావం చూపాయి. ఎన్డీయే స్పష్టమైన విజయంతో కేంద్రానికి బలం చేకూరింది. నితీశ్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి, యువత, మహిళల ఓటర్ల మద్దతుతో ఎన్డీయే- బీజేపీ కూటమి విజయం సాధించింది. మహాగఠ్‌బంధన్ ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచినప్పటికీ, ఓటర్లకు అభివృద్ధి-ఆధారిత విధానం ఎక్కువ ఆకర్ష ణీయంగా ఉండిందని ఫలితాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో బిహార్ ‘అభివృద్ధి-కేంద్రీకృత’ పాలన వైపుగా కొనసాగుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కేంద్రిత వ్యూహాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు.
ఇది వ్యతిరేకతకు నిదర్శనం కాదు..
2025 బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన విజయం సాధించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మద్దతు, యువత మహిళల ఓటు ఎన్డీయే విజయానికి కీలకంగా నిలిచాయి. రాబోయే ఐదేళ్లలో బిహార్ ‘అభివృద్ధి-కేంద్రీకృత’ పాలనవైపు వెళ్లనున్నట్లు సూచిస్తోంది. అత్యధిక ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదు. డబుల్ ఇంజన్ సర్కార్ బిహార్ రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేసి, యువతకు ఉపాధి భరోసా ఇవ్వడం, వలసలను అరి కట్టడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి.
-వాడవల్లి శ్రీధర్
99898 55445






