పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం

by Ravi |   (  Updated:2025-06-12 01:00:44  IST  )

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచింది. పాలనాపరమైన ఆడ్డంకులు, ఆర్ధిక ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే

పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం
X

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడిచింది. పాలనాపరమైన ఆడ్డంకులు, ఆర్ధిక ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే ఆర్దిక వ్యవస్ద గాడినపడుతోంది. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల స్యందనం ఇప్పుడు జోరందుకుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు విడుదలయ్యాయి.

ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంతో త్వరలో ఆసియన్‌ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్లు, ఏడీబీ రూ.6,700 కోట్లు కలిపి మొత్తం రూ.13,600 కోట్లు అప్పుగా ఇస్తున్నాయి. మరో రూ.1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. అయితే ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో (ఎఫ్‌ఆర్‌బీఎం) లెక్కించకూడదని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి రూ.11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందించడంతో నిర్మాణ పనుల వేగం పెరిగింది.

పోలవరం నిర్మాణం.. కేంద్రం పచ్చజెండా

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన అంచనాల మేరకు రూ.30,436.95 కోట్లతో నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన బ్యాలెన్స్ గ్రాంట్‌ రూ.12157.53 కోట్లు అని నిర్ధారించింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

మారనున్న విశాఖ ఉక్కు చరిత్ర

తాజాగా విశాఖ ఉక్కు కోసం కేంద్రం 1,650 కోట్ల రూపాయలను పెట్టుబడి నిధిగా మంజూరు చేసింది. దీంతో ఉక్కు నష్టాలు కష్టాలు తగ్గించుకుని ప్లాంట్‌ని చక్కగా కొనసాగించడానికి కేంద్రం ఈ కీలక చర్యలను తీసుకుంది. విశాఖ ఉక్కు ఈక్విటీకి 500 కోట్ల రూపాయలు, అలాగే వర్కింగ్ క్యాపిటల్ లోన్‌గా 1140 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 1650 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి పూర్తి ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు విశాఖ ఉక్కు పరిరక్షణకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇప్పుడు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం భారీగా దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు.

సంక్షేమ పథకాల అమలు..

2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభించనుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు.. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10 వేల నుంచి 20 వేలకు ప్రభుత్వం పెంచింది. దీపం 2.0 కింద నిధులు కేటాయించారు. ఆదరణ పథకాన్ని పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం, నిధులు కేటాయింపునకు కట్టుబడి ఉందని తెలిపింది.

తల్లికి వందనం.. ప్రారంభం

విద్య అనేది వ్యక్తిగత వికాసం, సామాజిక అభివృద్ధికి మూలస్తంభం. ప్రతీ విద్యార్థి విద్యను కొనసాగించేందుకు సంవత్సరానికి రూ. 15,000 అందించడం ద్వారా కూటమి ప్రభుత్వం అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రతీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా, సమాన అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర యువతకు కలలను అనుసరించడానికి శక్తినిస్తుంది. ఈ దూరదృష్టి ప్రాజెక్ట్ ప్రతి పిల్లవాడి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తమమైన, సంపన్న భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఈ పథకంలో ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందించనుంది.ఈ మేరకు ప్రతి ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15వేలు అందిస్తారు. 'విద్యా సం వత్సరం ప్రారంభం సందర్భంగా, అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందు తుంది. ఈ పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం నేడు జమ చేయనుంది.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story