డేటింగ్ యాప్‌లు ప్రమాదమే!

by Ravi |   (  Updated:2025-08-01 00:30:12  IST  )

సోషల్ మీడియా వాడటం వల్ల ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా ఉంది. ఇందులో ఎన్నో రకాల మోసాలు రోజురోజుకు

డేటింగ్ యాప్‌లు ప్రమాదమే!
X

సోషల్ మీడియా వాడటం వల్ల ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా ఉంది. ఇందులో ఎన్నో రకాల మోసాలు రోజురోజుకు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ అరచేతిలో ఉన్న ఈ క్రమంలో డేటింగ్ యాప్స్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. తాజాగా ఈ యాప్స్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల కింద ‘టీ’ డేటింగ్ యాప్‌ 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేటు మెసేజ్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయని ఓ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు విదేశాలకే పరిమితం అయిన డేటింగ్ యాప్స్ , ఇప్పుడు ఇండియాలో కూడా విపరీతం అయినా క్రేజ్‌ను సంపాదించింది.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాల మంది యువతులు, యువకులు ఇలా డేటింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ డేటింగ్ యాప్‌లను అడ్డంపెట్టుకొని ఈజీ మనికి అలవాటు పడ్డ కొందరు యువతులు లైవ్ ద్వారా వ్యూవర్స్‌తో మాట్లాడుతూ ఉంటారు.. అప్పుడు ఆ యువతులకు వ్యూవర్స్‌తో కాయిన్స్ సెండ్ చేస్తారు.. అది అంత వరకు ఉంటే బాగుంటుంది.. కానీ కొందరు అమ్మాయిలు ప్రీమియం పెట్టి నగ్నంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొందరు మరో అడుగు ముందుకు వేసి యూపీఐ ద్వారా డబ్బు వసూల్ చేసి నిమిషానికి, అర్ధగంటకు ఒక రేటు తీసుకొని నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం చేస్తున్నారు.. ఆ వీడియో కాల్ మాట్లాడిన యువకులు ఆ అమ్మాయిల నగ్న వీడియోలు సామాజిక మాద్యమాల్లో పెట్టడం, డబ్బులకు అమ్ముకోవడం చేస్తూండడం చాలా ఘోరమైన విషయం. ఇక కొందరు సైబర్ నేరగాళ్లు తెలియని నెంబర్లకు వీడియో కాల్ చేసి లిఫ్ట్ చేయగానే నగ్నంగా ఉన్న అమ్మాయి మాట్లాడుతుంది. ఆ వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏటా వందల మంది హనీ ట్రాప్‌ బారిన పడుతున్నారు. పోలీసులు ఇలాంటి వాటిని అడ్డుకోకుంటే భవిష్యత్‌లో మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.

-ఎమ్. మధు కల్యాణ్

95530 92665

Next Story