పెన్షన్ ఫండ్‌కు మీ వాటా జమచేయండి!

by Ravi |   (  Updated:2025-06-29 00:30:42  IST  )

రాష్ట్రంలో 2004 తర్వాత నియామకం అయిన ఉద్యోగులంతా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వస్తారు..

పెన్షన్ ఫండ్‌కు మీ వాటా జమచేయండి!
X

రాష్ట్రంలో 2004 తర్వాత నియామకం అయిన ఉద్యోగులంతా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వస్తారు.. వీరికి వేతనంతో పాటు డీ.ఏ నుంచి 10శాతం, ప్రభుత్వ వాటగా 10 శాతం డబ్బులు ఉద్యోగి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్) అకౌంట్‌లో జమ చేస్తారు.. దీనిపై వడ్డీ కూడా వస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు అదనంగా ఉంటాయి. ఇలా జమ అయిన సొమ్ము మొత్తం నుండి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 60 శాతం నగదుగా ఇస్తారు.. మిగిలిన 40 శాతాన్ని తిరిగి షేర్ మార్కెట్‌లో పెడుతారు. దీని నుండే నెలనెలా పెన్షన్ చెల్లిస్తారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 13 నెలల సొమ్మును ప్రాన్ అకౌంట్‌లో జమ చెయ్యకపోవడం వలన సీపీఎస్ ఉద్యోగులు ఆందో ళన పడుతున్నారు.. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారీటి నిబంధనల ప్రకారం 15 రోజులలో ఉద్యోగి వాటా, ప్రభుత్వం వాటా రెండు జమ చెయ్యాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగి 10శాతం వాటా ప్రభుత్వ ఖాతాలోనే ఉండిపోతున్నది. ఇలా భవిష్యత్తులో తమకు పింఛన్ రూపంలో ఆసరాగా అందుతాయనే ఆశతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద ఉద్యోగులు కూడబెట్టుకున్న సొమ్మును ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించడం ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుంది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానంను రద్దు చేసి పాత పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపరిచింది. కానీ 17 నెలలు గడిచిన సీపీఎస్ రద్దు గురించి మాట్లాడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరినీ నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, డీ.ఏ ల కోసం, ప్రభుత్వం కాజేసిన సొమ్ము కోసం, సీపీఎస్ రద్దు కోసం ప్రగతిశీల పోరాటలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.

పల్లె నాగరాజు,

టీఫీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.

85004 31793

Next Story