- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించాలి!
కేంద్ర ప్రభుత్వలో వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, సంస్థలలో నాన్-గెజిటెడ్, నాన్-టెక్నికల్ పోస్టులకు నియామకాల

కేంద్ర ప్రభుత్వలో వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, సంస్థలలో నాన్-గెజిటెడ్, నాన్-టెక్నికల్ పోస్టులకు నియామకాల కోసం పరీక్షలను నిర్వహించేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌ని స్థాపించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఈ కమిషన్ నిర్వహిచే వివిధ నియామక పరీక్షలకు హాజరవుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, నియామక పరీక్షలలో వివిధ రకాల దుష్ప్రవర్తనల కారణంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరం కూడా కమిషన్ నిర్వహించిన ఓ పరీక్షలో అనేక పొరబాట్లు దొర్లాయి. ఇక చాలా పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదు, పైగా సెంటర్లను తమ ఇంటి నుండి 500 కి.మీ దూరంలో కేటాయించడం విమర్శలకు కారణమైంది. ఇందుకు వ్యతిరేకంగా అభ్యర్థులు నినదిస్తే వారిని బెదిరించడానికి అనేక కేంద్రాలలో బౌన్సర్లను మోహరించారు. పరీక్షలను నిర్వహించే బాధ్యతను అప్పగించిన ప్రైవేట్ కంపెనీ ఇప్పటికే పరీక్ష స్కామ్‌కు సంబంధించిన అనేక ఆరోపణలను ఎదుర్కొంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీని వేలాది మంది యువకుల భవిష్యత్తును నిర్ణయించే పని నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అభ్యర్థుల సమయం, డబ్బు వృధా అవుతున్నాయి. ఏండ్లకు ఏండ్లు గడిచినా యువత వారు కన్న కలలు చెదిరిపోతుండటంతో వారి మనోధైర్యం దెబ్బతింటుంది. దీంతో చాలామంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లక్షలాది మంది యువత వేల ఉద్యోగాల కోసం క్రమం తప్పకుండా పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. దేశంలోని యువతకు ఉద్యోగం కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి పారదర్శకంగా ఉద్యోగ పోటీ పరీక్షలు నిర్వహించాలి.
-ఆళవందార్ వేణు మాధవ్
86860 51752






