సీఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి!

by Ravi |   (  Updated:2025-09-12 00:31:26  IST  )

రాష్ట్ర విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షా పథకంలో పదిహేను ఏండ్లుగా పని చేస్తున్న 2,027 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల (సీఆర్పీల)కు

సీఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి!
X

రాష్ట్ర విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షా పథకంలో పదిహేను ఏండ్లుగా పని చేస్తున్న 2,027 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల (సీఆర్పీల)కు ప్రభుత్వం అరకొర జీతాలే ఇస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సీఆర్పీలకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న సమగ్ర శిక్షా పథకంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పే స్కేలు అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే తక్కువ వేతనాలు ఇస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, మహిళా కాంట్రాక్టు ఉద్యో గులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేస్తామని గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చినా.. వాటిని అమలు చేయలేదనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే, రెండు సంవత్స‌రాలు పూర్తైనా ఆ సమస్యలు నేటి వరకు పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో వివిధ స్కూల్ కాంప్లెక్సుల్లో పనిచేస్తున్న సీఆర్పీలు ఉద్యోగ బాధ్యతల రీత్యా వివిధ పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు దాదాపు 8 మందికి రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నేటి వరకు వారికి కనీసం ఫ్యునరల్ చార్జీలు కూడా అందించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ చనిపోయిన ఒప్పంద ఉద్యోగులకు సాధారణ మరణమైతే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, ఫ్యునరల్ చార్జీలు ఇస్తున్నారు. మహిళా సీఆర్పీలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, వంటి సౌకర్యాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. తెలంగాణలోనూ అలాంటి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి 2023లో సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా హన్మకొండ ఏకశీల పార్కు వద్ద మద్దతు ఇచ్చారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే వంద రోజుల్లో మీ సమస్యలన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు స్పందించి బేసిక్ పే అమలు చేయడంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలి.

-తిరందాస్ సంతోష్ కుమార్

[email protected]

Next Story