- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 2న మద్యం దుకాణాలు మూసివేయండి!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అరవై సంవత్సరాల పైబడి అలుపెరగని సుదీర్ఘమైన పోరాటం, ఎందరో ఆత్మార్పణ త్యాగాలు చేసుకుంటేనే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అరవై సంవత్సరాల పైబడి అలుపెరగని సుదీర్ఘమైన పోరాటం, ఎందరో ఆత్మార్పణ త్యాగాలు చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే కల సాకారమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి ఎందరో మహానుభావుల పోరాటాలు, త్యాగఫలాల వలననే సాకారమైంది. అమరులైన ఆ మహానుభావుల త్యాగాలకు జ్ఞాపకార్ధంగా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీన మద్యం, మాంసం దుకాణాలు ఎలాగైతే మూసివేస్తామో.. అలానే అమరులతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వం రోజు అయినా జూన్ 2వ తేదీన మద్యం, మాంసం దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోగలరు. ఇలా చేస్తే అమరులకు ఘన నివాళి అర్పించినట్టు అవుతుంది, అలాగే తెలంగాణ రాష్ట్రం ఎలా ప్రారంభం అయింది, ఎలా సాకారం అయిందనే విషయాలను ప్రతి తరానికి తెలిసే విధంగా పాఠ్యాంశాలలో చేర్చి బోధించాలి. నేటి బాలలే రేపటి పౌరులు వీరికి భారతదేశం పొందిన స్వాతంత్య్రం గురించి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పోరాటం పట్ల అవగాహన కలిగించేలా జూన్ 2వ తేదీన ప్రతి పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. దేశం కోసం పోరాటం చేసిన స్వాతంత్య్ర సమర యోధుల గురించి, రాష్ట్రం కోసం పోరాడిన అమరుల గురించి, నేటి బాలలకు తెలియాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించి పదకొండు సంవత్సరాలు పూర్తి అయినా కూడా అమరుల త్యాగాలను జ్ఞాపకం చేసుకునే దిశగా ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమైన విషయమే. అందుకే ప్రభు త్వం వెంటనే స్పందించి వచ్చే జూన్ 2వ తేదీన మద్యం, మాంసం దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకోవాలి.
-వై. సంజీవ కుమార్,
93936 13555






