- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగునీరు స్థలంలో పరిశుభ్రత అవసరం!
మానవాళి జీవితంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మానవ శరీరంలో, శరీర పరిమాణాన్ని బట్టి

మానవాళి జీవితంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. మానవ శరీరంలో, శరీర పరిమాణాన్ని బట్టి, సుమారు 55 శాతం నుంచి 78 శాతం వరకు నీరు ఉంటుంది. మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి రోజుకు సుమారు 1 లీటర్ నుంచి 7 లీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది. అవి సరిగ్గా అందకపోతే డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. మొత్తం నీటి అవసరాల్లో తాగునీటి అవసరం 1% కన్నా తక్కువే అయినప్పటికీ, అన్ని వినియోగాల్లో దీనికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
స్వచ్ఛభారత్ సరిపోవడం లేదు..
ఇంతటి ప్రాముఖ్యమైన నీటి నాణ్యత పర్యవేక్షణకు అధిక ప్రాధాన్యం ఉంది. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలలో సంస్థాగత వ్యవస్థలు ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం 2006 ఫిబ్రవరిలో జాతీయ గ్రామీణ తాగునీటి నాణ్యత పర్యవేక్షణ, పర్యవేక్షణ కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా గ్రామ పంచాయ తీలు, గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో తాగునీటి మూలాల పర్యవేక్షణ, సమాజపు భాగస్వామ్యాన్ని సంస్థాగతం చేయడం వంటివి చేస్తోంది. అయితే ప్రధాన సమస్య ఏమిటంటే, నీటి సరఫరా బాధ్యతలు అనేక మంత్రిత్వ శాఖలు, సంస్థల మధ్య విభజించబడి ఉండటం. నీటి సరఫరా రంగంలో పలు సంస్థలు పాలు పంచుకుంటున్నందున, ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా విభాగాల మధ్య సమన్వయం కీలకం. స్వచ్ఛ భారత్ వంటి పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, మొత్తం వ్యయం వారి ప్రయత్నాలను ఇంకా అడ్డుకుంటోంది. అందువల్ల సంస్థలు, కార్పొరేట్లు ఇతర సంస్థల సహకారం ఒక స్వాగతించదగిన మార్పు.
నీరు తాగకపోతే శరీరం మటాష్
సురక్షిత తాగునీటి సరఫరా లోపం అనేది అనేక పర్యావరణ సమస్యలకు మూల కారణం. జీవనానికి, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడటానికి ఒక నిర్దిష్ట పరిమాణంతో నీరు అవసరం. అది లభించకపోతే నీరసం (డీహైడ్రేషన్), చర్మవ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా తగినంత నీటి వినియోగం లేకపోతే పారిశుద్ధ్య వ్యవస్థలో అవరోధాలు కలుగుతాయి. ఉపరితలంపై మలిన వ్యర్థాలు వ్యాపిస్తాయి. దీని ఫలితంగా నేల, నీరు, గాలి వంటి వనరులు కలుషితమవుతాయి. తాగునీటి సరఫరాలో సమస్యలు ఏర్పడితే పర్యావరణ సమస్యల మీద కూడా గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. కాలుష్యమైన నీరు ఉపయోగించడం వల్ల ‘నీటితో వ్యాపించే వ్యాధులు’ (water washed diseases) అయిన చెమట, ఫంగస్ ఇన్ఫెక్షన్లు, ట్రాకోమా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
పారిశుద్ధ్యం జీవితాలను మార్చుతుంది!
ప్రపంచంలో సుమారు ఒక బిలియన్ మంది ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేస్తున్నారు. వారికి కనీస మరుగుదొడ్లు లేదా చేతులు శుభ్రం చేసుకునే సదుపాయాలు కూడా లేవు. మెరుగైన పారిశుద్ధ్యం, శుభ్రత, సురక్షి తమైన నీరు లక్షలాది ప్రాణాలను రక్షించడమే కాకుండా, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి. ప్రజల గౌరవాన్ని పెంచుతాయి, అందరికీ మెరుగైన భవిష్యత్తును సృష్టిస్తా యి. ఇప్పటివరకు, సబ్బుతో చేతులు కడుక్కోవడం వలన ప్రతి సంవత్సరం 3 లక్షల ప్రాణాలును కాపాడినప్పటికీ, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలలో శుభ్రతకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం ఉన్నా, శుభ్రతా అలవాట్లు లేకపోతే మల-ముఖం ద్వారా వచ్చే సంక్రమణలను నివారించలేం.
మిఠాయి ప్రసాద్ వీరకుమార్,
94400 03619






