- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వాతంత్య్రం ఒకే కాలంలో... ఇప్పుడు ఆర్థిక రంగంలో ఐదు రెట్లు తేడా ఎందుకు?
చైనా, ఇండియా పురాతన నాగరి కత కలిగిన దేశాలు. రెండు దేశాలకు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ రెండు దేశాలకు స్వాతంత్ర్యం ఇంచుమించు

చైనా, ఇండియా పురాతన నాగరి కత కలిగిన దేశాలు. రెండు దేశాలకు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ రెండు దేశాలకు స్వాతంత్ర్యం ఇంచుమించు ఒకే సమయంలో వచ్చింది. 1980 ప్రారంభంలో భారత్, చైనా తలసరి ఆదాయం పరంగా ఒకే రకంగా ఉండేవి. చైనా జీడీపీ 191 బిలియన్ డాలర్లతో, భారత్ 186 బిలియన్ డాలర్లతో ఇంచు మించు సమానంగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా జీడీపీలో మనకన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం చైనా జీడీపీ 19.23 ట్రిలియన్ డాలర్లు కాగా భారత్ 4.19 ట్రిలియన్ డాలర్లు. చైనాకు ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు చైనా ఆర్థికంగా, సాంకే తిక పరంగా మన కన్నా ముందు ఎలా అయింది? భారతదేశానికి ఇది ఎందుకు సాధ్యం కాలేదు?
స్వాతంత్య్రం తర్వాత మన దేశం పెట్టుబడిదారులను నమ్ముకుంటే చైనాలో పెట్టుబడిదారులను నియంత్రించి సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ తరహాలో స్పెషల్ ఎకనమిక్ జోన్స్‌ను స్థాపించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, విదేశీ పెట్టుబడులను దిగుమతి చేసుకొని స్వయం సమృద్ధిని సాధించారు. వారి ప్రజల వృత్తి నైపుణ్యాలను అభివృద్ధిపరిచి స్థానిక మార్కెట్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది ప్రజల కొనుగోలు స్థాయిని పెంచి ఉద్యోగ కల్పన చేసే పేదరికాన్ని నిర్మూలించి దేశంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా చేశారు. అలాగే విదేశీ కంపెనీల నుండి టెక్నాలజీని దిగుమతి చేసుకొని చైనానే ఒక టెక్నో జైంట్‌గా మార్చారు. అలా మారడం వలన ఈ రోజు సాంకేతికంగా ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారి అగ్రరాజ్యం అమెరికానే భయపడేటట్లు ఉత్పత్తులు తయారు చేస్తోంది.
ఈ రంగాలను ప్రైవేట్ చేయకుండా..
చైనా ప్రపంచ సప్లయర్‌గా మారిందంటే దీనికి దోహదపడిన అక్కడ పాలన ఆర్థిక విధానాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా వారు ఉత్పత్తులను విదేశీ మార్కెట్ల పైన ఆధారపడకుండా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ముందుగా స్వదేశీ మార్కెట్‌ను విస్తరించుకొని వస్తు సేవల మార్కెట్లకు ఒడిదుడుకులు లేకుండా అన్ని రంగాలలో సమ్మిళిత అభివృద్ధిని సాధించింది. మన దేశంలో లాగా కాకుండా చైనాలో ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకొని విద్యా, వైద్యం వంటి కీలక సామాజిక రంగాలను ప్రైవేట్ రంగానికి వదలకుండా ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తున్నది. ఎటు చూసినా స్వయం సమృద్ధి స్వయం పోషకత్వమే ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నది. కానీ మన దేశంలో విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు చట్టా పట్టాలేసుకొని పారిశ్రామిక రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. 1991లో మన దేశం నూతన ఆర్థిక (LPG) విధానాలను చేపట్టి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించింది.
పెట్టుబడి విధానం కారణంగా..
1995లో మన దేశం WTOలో చేరి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడం ప్రారంభమైంది. అధికంగా టెక్నాలజీని దిగుమతి చేసుకోవడం తద్వారా జరిగిన ఉత్పత్తులను ఎగుమతులు చేయడం ప్రధానంగా మారాయి. స్వదేశీ, విదేశీ విధానమే లేకుండా ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్షన్ దేశంలో జరుగుతుంది. ఈ పెట్టుబడిదారీ విధానంతో ఉద్యోగితకు ప్రాధాన్యత లేకుండా దేశంలో పారిశ్రామిక రంగాన్ని నియంత్రణ చేస్తూ ప్రభుత్వాన్ని వారు కనుసనల్లో ఉంచుకున్నారు. అందుకే మన ప్రధాని ఎంతో గొప్పగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్, వికసిత్ భారత్ వంటి పథకాలు ప్రవేశపెట్టినా మన పారిశ్రామిక రంగం తన కాళ్ల మీద తను నిలదొక్కుకోలేకపోతున్నది. స్వయం పోషకత్వాన్ని సాధించలేక అటు పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించలేక పాలకులు చైనాలో లాగా ఆర్థిక వ్యవస్థను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు.
వారి పెత్తనం నుంచి బయటపడాలి..
ఆర్థిక స్వావలంబన కోసం, స్వదేశీ విధానం కోసం, మన ప్రధాని ఈ పథకాలు ప్రవేశపెట్టిన విదేశీ పెట్టుబడిదారుల అదుపాజ్ఞలలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థలో ఈ పథకాల అభివృద్ధి అంతంత మాత్రమే ఉన్నది. ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి ప్రధాన శక్తి అయింది. దాని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య పెట్టుబడి ద్వారా ప్రపంచ పెట్టుబడి దారులు ప్రపంచాన్నే పాలిస్తున్నారు. ప్రపంచం లో ఏ దేశం స్వయం నిర్ణయాధికారాన్ని, పారిశ్రామికీకరణను నిర్దేశించలేకపోతున్నాయి. అందుకే మన దేశం ముందుగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సామ్రాజ్యవాద పెత్తనం నుండి బయటపడాలి. స్వయం పోషకత్వాన్ని పెంపొందించుకోవాలి. జాతీయ వాదంతో వలస పాలన పారదోలినట్టు ఈ సామ్రాజ్యవాదుల నయా వలస పాలనను తిరస్కరించాలి. అమెరికా, యూరోప్ దేశాలపై ఆధారపడే విధానాలను మార్చుకోవాలి. అమెరికా సుంకాల వలయం నుంచి బయటకు రావాలంటే మనం సొంత ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్రజ ల్లోనూ ఈ తరహా ఆలోచనలు రావాలి.
స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తామంటే..
ఈ నయా ఉదారవద విధానాల వలన అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థను ఎదిరించే శక్తిగా భారత్ ఎదగాలంటే, ట్రంప్ లాంటి నిరంకుశ ఆర్థిక విధానాలను ఎదిరించాలంటే, చైనా లాగా స్వదేశీ మార్కెట్‌ను అభివృద్ధి పరిచి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి నిరుద్యోగం లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని సాంకేతికపరంగా అభివృద్ధి చేసే ప్రక్రియ మన దేశంలో జరగాలి. అయితే ఇప్పుడు ఉన్న నయా ఉదారవాద విధానాలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని అంగీకరించవు. అందుచేత ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రభుత్వ నియంత్రణ ప్రైవేటు పెట్టుబడులపై అంతంత మాత్రంగానే ఉం టుంది. పెట్టుబడిదారీ విధానం ఎప్పుడూ తాను స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతినిధిని అనే చెప్పుకుంటూనే దేశాలలో నిరుద్యోగం, ఆదాయ అసమానతలు పేదరికంతో ఉన్నా యి. దీనిని పాలకులు తమ పాలన విధానాలతో పరిష్కరించగలరా? దేశంలో డెమోక్రసీనే ఫ్లూటోక్రసీగా మారింది. చైనాలో ప్రభుత్వ నియంత్రణ పెట్టుబడులపై ఉండడం వలనే ఆ దేశం అగ్రగామి దేశంగా ఆవిర్భవిస్తున్నది. ఇదే విధానాలను మనం అనుసరించాలి.
-డాక్టర్ ఎ. నాగరాజ నాయుడు
98663 22172






