- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతడే ఒక సైన్యం.. ప్రజాసేవకే అంకితం
74 సంవత్సరాల వయసులో రాష్ట్ర కోసం రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

74 సంవత్సరాల వయసులో రాష్ట్ర కోసం రోజుకు 18 నుంచి 20 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు కోసం, జనం హితం కోసం తన స్వార్థ ప్రయోజనాలను పూర్తిగా వదిలేసి జన జీవితమే తన జీవితంగా, జనమే తన కుటుంబంగా నిత్యం ప్రజల్లో పర్యటన చేయడం సాహసోపేత మైన చర్య. తన ఆలోచనలే ప్రజలకు దిక్సూచిగా మారి, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం ఓ శుభ పరిణామం.
చంద్రబాబు కష్టపడే తీరు, ఆలోచన తీరు నేటి తరం శాసన సభ్యులకు మార్గదర్శకం. నేను కూడా తొలి శాసనసభ్యుడిగా చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని మా నియోజకవర్గంలో గ్రామ అనే ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాను. మొత్తం నియోజక వర్గంలో 85 గ్రామాలకు గాను 70 గ్రామాలు పూర్తిగా ఇంటింటా తిరిగాం. వారి అవసరాలు తీర్చాం. వారికీ ఏమి కావాలో తెలుసుకొన్నాము. వారితో మమేకం అయ్యాము. ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యలు తెలుసుకున్నాము. ప్రజలను ప్రతీ గ్రామాల వారీగా పేరుతో పిలిచే అంత చనువు తెచ్చుకొన్నాము. ఇదంతా చంద్రబాబు స్ఫూర్తే.
క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పాలించడం
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్టం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గత పాలనలో ఆర్ధిక విధ్వంసం జరిగింది. అయితే ఎన్నికలలో గెలిచి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం కుంగిపోలేదు. సమస్య వేరొకరిపైకి నెట్టలేదు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉందని భావించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటివి అమలు చేస్తున్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవకు రంగం సిద్ధం చేస్తున్నారు.
తల్లికి వందనం చరిత్ర
తల్లికి వందనంతో చరిత్ర సృష్టించారు. గత పాలకులు మ్యానిఫెస్టోలో పిల్లలు అందరికి అమ్మ ఒడి అని అన్నారు. తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒక్కరికే సొమ్ములు వేసి రాష్ట్రంలో లక్షలాది మంది తల్లులను మోసం చేశారు.. ఇదేంటి అని అడిగితే వారు సామాజికవేత్తలైనా, జర్నలిస్ట్‌లు అయినా చివరికి తల్లులు అయినా సరే కేసులు పెట్టి వేదించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొన్నారు. భావి భారతావనికి వారే పౌరులు అని గట్టిగా నమ్మారు. దేంతో పిల్లలు ఎంత మంది ఉంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే తల్లులు ఖాతాలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి సొమ్ములు వేశారు. దీంతో చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్ధిక విధ్వసం అయింది. రాష్ట్రం అప్పులు పాలు అయింది. అయినా సరే చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పథకం సొమ్ములు తల్లుల ఖాతాలో వేశారు. గోపాలపురం నియోజకవర్గంలో ఒక్కొక్క కుటుంబం లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారి తల్లుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. నేను నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నప్పుడు వారి కళ్లల్లో నిజమైన ఆనందం చూసా ను.
టెక్నాలజీలో అగ్రగామి..
రాష్టాన్ని సాఫ్ట్‌వేర్ రంగంలో ముందుకు తీసికొని వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఐ టెక్నా లజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కూడా పూర్తి చేశారు. ఇంకా అనేక తయారీ, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే హడలిపోయిన పారిశ్రామిక వేత్తలను ఒప్పించి వేల కోట్ల రూపాయలన పెట్టుబడులకు పూచీ కల్పించి మరీ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగ కల్పనకు తనదైన శైలిలో కష్టపడుతున్నారు..
గ్రీన్ టాక్స్ తగ్గించడం శుభ పరిణామం..
వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గించారు. దీని వల్ల వాహనం యాజమాన్యంకు మాత్రమే కాదు.. విద్యార్థులకు, ప్రజలకు కూడా ప్రయోజనం అని చెప్పాలి. గ్రీన్ టాక్స్ జగన్ పెంచారు.. దీనివల్ల పెరిగిన టాక్స్ ధర ప్రజల పైనే రుద్దారు. ఇందులో పాఠశాల బస్సులు కూడా ఉన్నాయి. దీనివల్ల విద్యార్థులకు బస్సు ఫీజులు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం గ్రీన్ టాక్స్ తగ్గడం వల్ల స్కూల్ బస్‌ల ఫీజులు కూడా తగ్గాయి. దీంతో రాష్టంలో విద్యార్థులు గతం కంటే చౌకగా నాణ్యమైన విద్య పొందుతున్నారు.
నిరంతర శ్రామికుడు..
నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రైవేట్ జీవితం వదిలేసి ప్రజా జీవితానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అంకితం అయ్యారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయడం, ఢిల్లీ వెళ్లి నిధులు తెచ్చుకోవడం, పారిశ్రామిక దిగ్గజాలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టించేందుకు అంగీకరింప చేస్తున్నారు. ఏడుపదులు నిండిన వయ స్సులో అహరహం ప్రజా జీవితాల గురించి ఆలోచించడం, అధికారులను పరుగులు తీయించడం.. ఇదే ఆయన లైఫ్ స్టైల్.
P-4తో నూతన అధ్యాయం..
రాష్ట్రంలో కొత్తగా p-4 అనే కాన్సెప్ట్‌ను తీసుకొని వచ్చారు. దారిద్ర రేఖ దిగువన ఉన్న వారిని కొంతమంది స్థితిమంతులతో దత్తత చేయించి పేదల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నారు. అదే సమయంలో అధికారుల్లో జవాబుదారితనాన్ని పెంచారు. వాళ్లతో నిత్యం సమావేశాలు, అవగాహనా సదస్సులు పెట్టి ప్రజా సేవ పట్ల వారిలో కూడా అంకితభావం తీసుకొని వచ్చారు. నిజాయితీతో కూడిన పాలన సాగిస్తున్నారు. అతడే ఒక సైన్యం అనే అనే మాటకు నిఖార్సయిన నిదర్శనం మన ముఖ్యమంత్రి.
మద్దిపాటి వెంకటరాజు
గోపాలపురం ఎమ్మెల్యే






