దక్షిణాదిని దోచుకో..ఉత్తరాదికి ఇచ్చుకో..!

by Ravi |   (  Updated:2025-02-16 01:16:04  IST  )

ఢిల్లీ పాలకుల సవతి తల్లి ప్రేమలో, దక్షిణ భారత దేశాన్ని దోచి ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

దక్షిణాదిని దోచుకో..ఉత్తరాదికి ఇచ్చుకో..!
X

ఢిల్లీ పాలకుల సవతి తల్లి ప్రేమలో, దక్షిణ భారత దేశాన్ని దోచి ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. జీఎస్టీ అనేది కేంద్రం, రాష్ట్రాలు విధించే వస్తు, సేవలపై వినియోగ ఆధారిత పన్ను. ఈ పన్ను ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని పొందుతారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే పన్ను ఆదాయంలో సొంత పన్ను రాబడి. కేంద్ర పన్నుల్లో దాని వాటా ఉంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్నుల రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తోంది.

అయితే జీఎస్టీ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాలు తమ ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కోల్పోతుండగా.. తమ వ్యయ అవసరాలను తీర్చడానికి అంతర్ ప్రభుత్వం బదిలీల వ్యవస్థపై ఆధారపడటం పెరిగింది. కాబట్టి ఇప్పుడు పన్నుల నికర ఆదా యాన్ని రెండింటి మధ్య న్యాయంగా పంపిణీ చేయడం కేంద్రాల బాధ్యత, జనాభా, జీఎస్టీ కేంద్ర నిధులపై ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య వైరుధ్యం పెరుగుతున్నది. తక్కువ జనాభా, ఆర్థికంగా బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అధికార పంపిణీ తక్కువ వాటా, కేంద్ర నిధులపై ఉత్తర, దక్షిణ వివాదానికి ప్రధాన కారణాలలో ఒకటి.

ఇక్కడ వసూళ్లు.. అక్కడ సంతర్పణలు

కేంద్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఐదు రాష్ట్రాల నుండి జీఎస్టీ కింద వసూలు చేసిన పన్ను మొత్తం 22,26,983.39 లక్షల కోట్లు, ఐదు రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది 6,42,295.05 లక్షల కోట్లు. కాషాయ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసిన పన్ను 3,41,817.60 లక్షల కోట్లు ఆ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 6,91,375.12 కోట్లు. దీంతో ఉత్తరాది, దక్షిణాది విభజన కథనం ఊపందుకుంది. ఈ సారి ఇది ప్రధానంగా రాష్ట్రాల మధ్య కేంద్ర నిధుల కేటాయింపుపై ఉంది. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర పన్నుల నుంచి తమ చట్టబద్ధమైన వాటాను కోల్పోతున్నామని వాదిస్తున్నాయి.

గత ఆరేళ్లలో పెరిగిన వ్యత్యాసాలు..

అయితే కేంద్రం ప్రస్తుతం అధికార వికేంద్రీకరణ స్థాయిలను రక్షించేందుకు ఫైనాన్స్ కమిషన్ నిబంధనలు ఉదాహరించింది. భారత దేశం దాదాపు ఒక ఖండం వలె కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయి. తలసరి ఆదాయాల స్థాయిలలో వ్యత్యాసాలు అటువంటి స్వయం వ్యతాసాలు అంతర్లీనంగా ఉన్నాయి. గత ఆరు సంవత్సరాలుగా ఇటువంటి వ్యతాసాలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో తయారీ రంగంలోని భారత్ వృద్ధి వాటాను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేస్తారా? లేదా అనేది కీలకమైన ప్రశ్న.

పన్ను పంపిణీలో బీజేపీ అన్యాయం!

ఆర్థిక పరివర్తనకు అవసరమైన మూడు ముఖ్యమైన సంస్కరణలు భూమి, కార్మికులు, వ్యవసాయం గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వెనక్కి తీసుకోబడింది. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల నుండి పన్ను రూపంలో 100 రూపాయలు తీసుకుని తెలంగాణ రాష్ట్రా నికి 49.8 రూపాయలు.. తమిళనాడు రాష్ట్రానికి 29.7రూపాయలు, కర్ణాటక రాష్ట్రానికి 13.9 రూపాయలు, కేరళ రాష్ట్రానికి 63.4 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 46 రూపాయలు.. కేంద్రం ఇచ్చింది. అలాగే ఉత్తర రాష్ట్రాలకు చెందిన ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రం పన్ను రూపంలో 100 రూపాయలు చెల్లించగా 333.2రూపాయలు, బిహార్ రాష్ట్రానికి 922.5 రూపాయలు, మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి 279.1 రూపాయలు కేటాయించి కేంద్ర తన సవతి తల్లి ప్రేమను దక్షిణ భారత దేశ ఐదు రాష్ట్రాలపై చూపుతోంది.

సమన్యాయం లభించని విధానాలు..

కేంద్రం అమలు చేస్తున్న ఆదాయ భాగస్వామ్యం నమూనా కొన్ని రాష్ట్రాలకు అన్యాయంగా నష్టం కలిగిస్తుందని బీజేపీయేతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. నిధుల పంపిణీ రాష్ట్రాల వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని తగినంతగా ప్రతిబింబించడం లేదు కానీ పంపకాలలో భారీ వ్యత్యాసం కనబడుతుంది. జీఎస్టీ లక్ష్యాలు నేరవేరడం లేదు. రాష్ట్రాల మధ్య వ్యత్యాసం, పక్షపాతాలు చూపే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నత కాలం, ఇలాం టి ఎన్ని పథకాలు వచ్చినా, సమ న్యాయం లభించదు.

ఇరికి మహేష్

భీమా కోరేగావ్ సేన అధ్యక్షుడు.

98661 35431

Next Story