రూపాయి పతనాన్ని ఆపలేరా..!

by Ravi |   (  Updated:2025-02-13 00:31:21  IST  )

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత్ రూపాయి మారకపు విలువ భారీగా పతనం అవుతోంది. గతంలో ఎన్న డూలేని విధంగా రూపాయి విలువ

రూపాయి పతనాన్ని ఆపలేరా..!
X

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత్ రూపాయి మారకపు విలువ భారీగా పతనం అవుతోంది. గతంలో ఎన్న డూలేని విధంగా రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపో యి, ఈ బుధవారానికి రూ. 86.91 క్షీణించి పోయింది. ఇంతే కాదు రూపాయి పతనం ఇంకా కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తుంది. విదేశాల్లో చదువుతు న్న విద్యార్థులకు ఫీజులు ఖర్చులు నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది, తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరి అయిపో తోంది. దిగుమతులు ఖరీదైపోతున్నాయి.

ఈ పరిస్థితి ఎంత కాలం ఉంటుందనే విషయాన్ని ఆర్థిక నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ ప్రకటిస్తున్న నిర్ణయాలు, విధానాల వల్ల డాలర్ ఇంకా బలపడి వర్ధమాన దేశాల కరెన్సీలు బలహీనపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకు అనుగుణంగా రూపాయి దాని వాస్తవ స్థాయిని చేరుకోవడానికి రాజకీయంగా చిత్తశుద్ధితో వ్యవస్థీకృత సంస్కరణలతో రూపాయి పతనాన్ని కట్టడి చేయాల్సి ఉంది.

డాలర్‌కి రూ.90కి పడిపోవచ్చు

రూపాయి విలువ క్షీణించడానికి మరో కారణం.. ద్రవ్యోల్బణం పెరగడం. దీనివల్ల కార్పొరేట్ సంస్థల ఆదాయాలు లాభాలు తగ్గుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి ఉద్యోగాల్లో కోత, సరుకుల సరఫరా తగ్గడం వంటి సవాళ్లు ఎదురు అవుతున్నాయి. ఇవన్నీ రూపాయి విలువ పడిపోవడానికి దోహదపడుతున్నాయి. అమెరికా డాలర్ విలువ రూపాయితో పోల్చితే ఈ సంవత్సరానికి ₹90 వరకు చేరిన ఆశ్చర్య పడాల్సింది లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు.

గత పదేళ్లలో రూపాయి పతనం

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో 2015 సంవత్సరానికి డాలర్‌కి రూ. 66.15లుగా ఉన్న రూపాయి విలువ కేవలం పదేళ్లలోనే 20 రూపాయలకు పైగా క్షీణించి ఇప్పుడు 87 రూపాయలకు అటూ ఇటూగా తచ్చాడుతోంది. ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండడం. కరెంటు ఖాతా లోటు. ముడి చమురు ధరలు పెరుగుదల తదితర అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక క్రమశిక్షణ లేమి, దుబారా పెరిగిపోవడం. ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించుకోవడంలో పాలన విధానంలో చిత్తశుద్ధి లేకపోవడం లాంటి తదితర విధానాల మూలంగా రూపాయి పతనమవుతోంది. మన దేశ జనాభాలో 60 శాతం, 35 ఏళ్లలోపు వారే. ఈ యువశక్తిని జనాభాలో సగభాగమైన మహిళా శక్తిని నిపుణ వనరులుగా తీర్చిదిద్ది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. అలా దేశ ఉత్పాదక శక్తి పెంచుకోవడం వల్ల ప్రగతికి దారులు పడతాయి.

సంపద సమాన పంపకమే ప్రగతి

దేశ సంపద గుప్పెడు మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా, సమంగా పంచబడినప్పుడే సమ్మిళిత ప్రగతి సాధ్యపడుతుంది. అలాంటి చిత్తశుద్ధితో కూడిన విధానాలు అమలు చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో బహుళ పార్టీల పాలన విధానంలో అధికార దాహంతో దేశ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఓటు బ్యాంకు పథకాలకు చరమగీతం పాడాలి. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకు అనుగుణంగా రూపాయి దాని వాస్తవ స్థాయిని చేరుకోవడానికి రాజకీయంగా చిత్తశుద్ధితో వ్యవస్థీకృత సంస్కరణలను నిర్ణయాలతో రూపాయి పతనాన్ని కట్టడి చేయాలి. అమెరికా ఒంటెద్దు పోకడతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసేలా ఉంది. ఏది ఏమైనా భారత్ ప్రతిష్టాత్మక నిర్ణయాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా స్వయం సమృద్ధిని సాధించాలి.

- మేకిరి దామోదర్

సామాజిక విశ్లేషకులు

95736 66650

Next Story