Budget 2026: తెలుగు రాష్ట్రాలకు పంగనామాలు..

by Ravi |   (  Updated:2026-02-05 01:16:07  IST  )

‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేశాడే గంగరాజు’ అన్న నానుడి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌ను చూసిన తెలుగు ప్రజల మనస్థితిని అచ్చుగుద్దినట్లుగా ప్రతిబింబిస్తోంది. ఆశలు, హామీలు, మాటల మాయాజాలం మధ్య చివరికి చేతిలో మిగిలిందేమిటంటే..

Budget 2026: తెలుగు రాష్ట్రాలకు పంగనామాలు..
X

‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేశాడే గంగరాజు’ అన్న నానుడి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌ను చూసిన తెలుగు ప్రజల మనస్థితిని అచ్చుగుద్దినట్లుగా ప్రతిబింబిస్తోంది. ఆశలు, హామీలు, మాటల మాయాజాలం మధ్య చివరికి చేతిలో మిగిలిందేమిటంటే.. నిర్లక్ష్యం, వివక్ష, ప్రాంతీయ అన్యాయం. రూ.45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో దేశ అభివృద్ధి పేరుతో రంగరించిన గణాంకాల మధ్య, రెండు తెలుగు రాష్ట్రాల అవసరాలు మాత్రం పూర్తిగా అదృశ్యం అయ్యాయి.. ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు.. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న రాజకీయ వైఖరికి స్పష్టమైన ప్రతిబింబం.

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకారం లభించలేదు.

తెలంగాణాను విస్మరించి..

అలాగే 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో తెలంగాణ కీలక పాత్ర ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవకాశం కల్పించలేదు.. ఇక ఎలక్ట్రానిక్ భాగాల తయారీ, కెమికల్ పార్కులు, స్పోర్ట్స్ గూడ్స్ తయారీ, ఆరెంజ్ ఎకానమీ, మెడికల్ వాల్యూ హబ్స్, అంతర్గత జల మార్గాలు, సెమీకండక్టర్‌ల అభివృద్ధి వంటి రంగాల్లో కూడా తెలంగాణను పక్కన పెట్టారు.. సింగరేణి బొగ్గు ప్రాంతంలో అరుదైన ఖనిజాల ఆనవాళ్లు ఉన్నప్పటికీ, వాటి అన్వేషణ ప్రాజెక్టుల్లో సైతం రాష్ట్రానికి చోటు కల్పించలేదు.. అభివృద్ధి కార్యక్రమాల కోసం 4% ఆర్థిక లోటు అనుమతి ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించగా, తెలంగాణకు మాత్రం 4.3% లోటు కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ, రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు చెందిన ఎంపీలందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

అప్పులతో కట్టుకోవలసిన అమరావతి..

ఇక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు.. విశాఖ ఎకనామిక్ జోన్‌కు ₹5,000 కోట్లు కోరినా, బడ్జెట్‌లో చూపించలేదు. పోలవరంకు క్రితం బడ్జెట్ మరణ శాసనం రాస్తే దాన్ని సవరించు కోలేదు.. 150 అడుగుల ఎత్తున పూర్తిస్థాయిలో నీరు నిలబెట్టి, 960 MW దాదాపుగా పూర్తయిన పవర్ ప్రాజెక్టు నడవాలంటే అవసరం, పునరావాసం పూర్తి ప్యాకేజీకి ఇంకా ఇవ్వాల్సిన దాదాపు 37 వేల కోట్లలో ఒక్క రూపాయి ఈ బడ్జెట్లో పెట్టలేదు.. ఇక అమరావతి పునర్నిర్మాణం ఇతర కొన్ని నగరాల అభివృద్ధి పథకంలో భాగమే ₹1,128.91 కోట్లు.. (ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ కోసం ₹432.09 కోట్లు. పట్టణ తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలకు ₹800 కోట్లు. రోడ్లు, వంతెనలు అభివృద్ధికి ₹350 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ₹500.99 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి ₹155.32 కోట్లు సెవరేజ్ వర్క్స్‌కు) ప్రత్యేక గ్రాంట్‌తో కాకుండా అమరావతి అప్పులతో కట్టుకోవాలి. దీనిపై గట్టిగా మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనపడటం లేదు. అలాగే పులికాట్ సరస్సు వద్ద బర్డ్-వాచ్ ట్రైల్స్ అభివృద్ధికి కేటాయింపులు లేవు.. విభజన హామీల ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, నిధులు దక్కకపోగా, 15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశాలను గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు, ఏపీలో పక్షుల పరిశీలన (బర్డ్ వాచింగ్) వంటి పనులు చూసుకోమంటున్నారు.

అదానీకి పారిశ్రామిక లాభాలు..

డేటా సెంటర్ టాక్స్ హాలిడే పేర 2047 వరకూ ఆదానికి కట్టబెట్టారు. (విశాఖ/అనకాపల్లి ₹22,002 కోట్ల ప్రాజెక్ట్)కు డైరెక్ట్ లాభం15% సేఫ్-హార్బర్ రేట్ ద్వారా రైడెన్ ఇన్ఫోటెక్‌కు చేకూరనుంది. గంగవరం పోర్ట్, సాగర్‌మాలా ఎక్స్‌పాన్షన్‌లో ఉత్తర తీర పోర్టులకు ప్రాధాన్యత. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులకు ప్రత్యేక ఉపయోగం కల్పించారు. నక్కపల్లి పోర్టు గుజరాతి వ్యాపారి మిట్టల్ (మెటల్స్/)గ్ ఎలక్ట్రో‌లైజర్ మాన్యుఫాక్చరింగ్ ఇన్సెంటివ్స్, రేవు అనుబంధంగా స్టీల్ మెటల్ ఎగుమతులకు లాభం చేకూర్చే విధంగా ప్రణాళిక రూపొందించారు.. రేర్ ఎర్త్ మినరల్స్ (4 రాష్ట్రాలకు ₹8,200 కోట్లు) ఆంధ్రాలో ఆదాని గ్రూప్ (శ్రీకాకుళం)- బీచ్ సాండ్ మినరల్స్ (గార్నెట్, మోనాజైట్) మైనింగ్ అదానీ & స్పైస్ ఇన్ఫ్రా జేవీ ద్వారా కార్యకలాపాలు.. ఇంతకుముందు తెలుగు వారి చేతిలో ఉండేది. ఇప్పుడు దీనిని ఆపేశారు.

రైల్వే బడ్జెట్‌లోనూ..

రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి లేదు.. అయితే ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు‌కు వేసే హై స్పీడ్ రైల్వే నెట్వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా మధ్యలో ఉంది కాబట్టి బడ్జెట్ కేటాయింపుల్లో ఉంది. ఇక బుల్లెట్ ట్రైన్, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-వారణాసి, చెన్నై- మైసూరు మాత్రమే ప్రస్తావించారు..వారి సొంత రాష్ట్రాలకు 15 వేల కోట్ల రూపాయలు పైగా పెంచారు.. ఇక విశాఖ, హైదరాబాద్ విజయవాడ ప్రాజెక్టుల ఊసే లేదు.. తెలంగాణకు ఒక జాతీయ హోదా ప్రాజెక్టు గత 12 ఏళ్లలో కేటాయించలేదు. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యువత పారిశ్రామిక మార్పుకు పెద్ద ఉపయోగం లేదు. స్పెషల్ స్టేటస్, ఇండస్ట్రియల్ ప్యాకేజీలు లేవు. అదానీ, మెటల్స్ వంటి పెద్ద కార్పొరేట్లకు మాత్రమే పరోక్ష ఇన్సెంటివ్స్..

- డా. ముచ్చుకోట సురేష్ బాబు,

9989988912

Next Story