- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ఇటీవలి కాలంలో కార్మిక వర్గం తాము కష్టపడి సంపాదించిన అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు.. ప్రభుత్వ ఉద్యోగులు తమ హామీగా ఇచ్చిన పెన్షన్‌లో మార్పులు జరుగుతున్నాయి.. బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగులు ఇప్పటికీ 2007 పే స్కేళ్ల ప్రకారం ఎచ్.ఎం.టి ఉద్యోగులు 1997 పే స్కేళ్ల ప్రకారం జీతం పొందుతున్నారు. పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు/పెన్షనర్లకు రూ. 983.02 కోట్లు బకాయి ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కార్మికులు డిమాండ్ చేసే, కనీస నెలవారీ వేతనం రూ.26,000, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద రోజుకు రూ.600 వేతనం అందించడం, ఈపీఎస్ కింద కనీస పెన్షన్‌ను నెలకు రూ.9,000కి పెంచడం అమలు కావడం లేదు. కార్మిక వ్యయాన్ని తగ్గించడానికి కార్మికుల సంఖ్యను తగ్గించడం, తద్వారా వారి కోసం ఖర్చు చేయాల్సిన మొత్తం తగ్గుతుంది. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో రెగ్యులర్ నియామకాలు లేవు. ఫలితంగా ప్రతి రంగంలోనూ శ్రామికులు తగ్గుతున్నారు. ఇంట ర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ప్రచురించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, నిరుద్యోగ భారతీయులలో 83% మంది యువతే. నేడు, క్యాజువల్, కాంట్రాక్ట్, రోజువారీ వేతనం, తాత్కాలిక, అవుట్‌సోర్స్ ఉద్యోగులుగా నియమించడం ప్రైవేట్ రంగానికే పరి మితం చేయబడింది, ప్రభుత్వ రంగంలో కూడా శాశ్వత ఉద్యోగి చేసే పనిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు, ఫిక్సెడ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ చట్టబద్ధం చేయబడింది. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద లక్షలాది మంది స్కీమ్ వర్కర్లుగా ఉన్నారు. వారిని కార్మికులుగా గుర్తించకపోవడం వలన, కనీస వేతనాలు లేక బాధ పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో, బ్యాంక్‌లలో అప్రెంటీస్ క్రింద నెల రూ.9,000 నుండి రూ.15,000 పొందుతున్నారు. ఈ విధంగా శ్రామిక వర్గం ఎన్నో ప్రయోజనాలు కోల్పోవడంలో ఎవరు బాధ్యత వహిస్తారు.
ఆళవందార్ వేణు మాధవ్
8686051752
- Tags
- workers problems






