- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా?
భారతదేశంలో క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్లు ఎంతోమంది ఉంటారు. ఇక్కడి వారు అథ్లెటిక్స్ కన్నా క్రికెట్‌నే ఎక్కువ ఇష్టపడతారు.

భారతదేశంలో క్రికెట్ అంటే ఇష్టపడే వాళ్లు ఎంతోమంది ఉంటారు. ఇక్కడి వారు అథ్లెటిక్స్ కన్నా క్రికెట్‌నే ఎక్కువ ఇష్టపడతారు. జాతీయ క్రీడా హాకీ కన్నా కూడా క్రికెట్‌నే ఎక్కువ అభిమానిస్తారు. ఇటీవల కాలంలో ఆడ, మగ తేడా లేకుండా అంద రూ కూడా క్రికెట్‌ను చూస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న ఎమోషన్స్
ప్రపంచంలో ఒలంపిక్ గేమ్ పాల్గొనే క్రీడాకారుల కన్నా క్రికెట్ ఆటగాళ్ల పేర్లు టక్కున చెబుతుంటారు. ఏ స్టేడియంలో జరిగినా అది జనాలతో నిండి పోతుంది. ఇది భారతీయులకు క్రికెట్‌పై ఉన్న ఎమోషన్. ఇక్కడి అభిమానులు కొందరు తమ ఫ్యామిలీ, కెరీర్ కంటే ఎక్కువగా క్రికెటర్లు, యాక్టర్లు, నేతలకు ప్రాధాన్యమిస్తారు. వారికోసం ప్రాణాలైనా త్యాగం చేస్తారు. ఈ అభిమానమే ప్రాణాల మీదకు తెస్తోంది.
ప్రాణాంతమైన సంబురాలు..
మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ విజయం సందర్భంగా బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం విజయ సౌధ ప్రాంగణంలో అధికారికంగా ఆర్‌సీబీ టీమ్‌ని సన్మానించింది. అనంతరం ఫ్యాన్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ సమాఖ్య విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమం లో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అయితే స్టేడియంకు అంచనాకు మించి జనం రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మృతి చెందిన 9 మంది 20 ఏళ్ల లోపు యువతనే ఉండడం అందరినీ కలిసివేసింది.
అభిమానులంటే లెక్కలేని వారికోసమా?
ఈ ఘటన జరిగినప్పటి నుంచి యువత బాధ్యత మరోసారి చర్చకు వచ్చింది. నిజానికి మనం అభిమానించే క్రీడాకారులకు, సినిమా హీరోలకు సామాజిక బాధ్యత లేదు. అంతెందుకు కప్ గెలిచినా ఆర్సీబీ యాజమాన్యానికి కానీ ఆటగాళ్లకు కానీ ఆ అభిమానులపై ఆ బాధ్యత ఉంటే 11 మంది చనిపోయారని తెలిసినా.. సన్మాన కార్యక్రమం జరుపుకుంటారా? అభిమానుల ప్రాణాలను లెక్కచేయని వారి కోసం మీ ప్రాణాలను ఎందుకు ఫణంగా పెడతారు? భారతదేశంలో ఇప్పటికీ పేద బడుగు బలహీన వర్గాలు స్పోర్ట్స్‌లో రాణించలేకపోతున్నారు. వారికి అవకాశాలు కూడా లేవు.. ఈ దేశంలో ఆధిపత్య వర్గాలకే అవకాశాలు ఎక్కువ. ఈ వర్గాల వారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో, స్పోర్ట్స్‌లో, వ్యాపారాల్లో ఓడిపోతూ జీవిస్తున్నారు.
అన్నిచోట్లా ఓడిపోయేది పేదలే
దేశంలో తరచూ క్రీడా ప్రదేశాలు, దర్శనీయ ప్రదేశాల దగ్గర జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలలో నిర్వహణ లోపంతో దారుణ ఘటనలు జరుగుతున్నాయి. వీటి పట్ల కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అందుకే ప్రజలు ఆలోచించాలి, ఈ ప్రభుత్వాలను గెలిపించేది మనమే, ఈ ఆటగాళ్ల గెలుపులో కూడా మనం భాగమై చివరికి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. తమ కుటుంబం కోసం, తమ జీవితం కోసం ఇలాంటి భావోద్వేగ వాతావరణంలోకి ప్రవేశించి ప్రమాదానికి గురికావద్దు.
సంపతి రమేష్ మహారాజ్
7989579428






