- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్‌టీఐ కమిషనర్లను నియమించండి!
ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతో కొన్ని సంస్థలను శాసన ప్రకారం ఏర్పాటు చేస్తా రు. కానీ, కాలక్రమంలో ఆ సంస్థ విధులు

ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతో కొన్ని సంస్థలను శాసన ప్రకారం ఏర్పాటు చేస్తా రు. కానీ, కాలక్రమంలో ఆ సంస్థ విధులు నిర్వర్తించడానికి వ్యక్తులను నియమించరు. ఈ పరిస్థితి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఫలితంగా ఆ శాసన ఉద్దేశమే దెబ్బతింటోంది. అలాంటి సంస్థే సమాచార హక్కు కమిషన్. ఈ కేంద్ర సంస్థలో చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే పౌరులకు బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం తెలంగాణలో పత్తా లేకుండా పోయింది.
దరఖాస్తులు పెండింగ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం లో వచ్చిన ఈ చట్టంపై గొప్పలు చెప్పే రాష్ట్ర పాలకులు అమలులో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా.. రాష్ట్రంలో సహచార హక్కు కమిషన్ రెండేళ్లుగా ఏర్పాటు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కమిషన్ ఏర్పాటు, నియామకాలను ప్రస్తుత, గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపో వడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా సమా చార హక్కు చట్టం ఉద్దేశం కూడా నెరవేరడం లేదు.
రెండేళ్లలో రెండుసార్లు నోటిఫికేషన్
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు లీజుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలు అందించమని.. ఆనాడు ఎంపీ, టీపీపీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద హెచ్‌ఎండీఏకు ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అధికారులు స్పందింకపోవడంతో ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అంతేనా.. తాము అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కా అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా సమాచార కమిషన్ నియామకం జరగలేదు. నిజానికి, సమా చార కమిషనర్ నియామకంపై గత ప్రభు త్వం 2023 జూన్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2023 డిసెంబరులో ప్రభుత్వం మారడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, ఓ ప్రధాన కమిషనర్, ఆరుగురు కమిషనర్‌లు నియామకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం గత జూన్‌లో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది దరఖాస్తు చేసుకోగా.. రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు చేసిన అధికారాలు ఓ జాబితాను సిద్ధం చేసి ఇంటెలిజెన్స్ విచారణ కూడా చేపట్టారు. కానీ, నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే, సమాచార కమిషన్ నియామకాల అంశంపై సుప్రీంకోర్టు గతవారం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియను ప్రారంభించామని, త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. కానీ వారం రోజులు అయినా రాష్ట్రంలో దాని ఊసే లేదు.
సభావట్ కళ్యాణ్
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
90143 22572






