కేసీఆర్ జాతీయ పార్టీని విమర్శించిన వారికి ఇవే సమాధానాలు!

by Disha edit |
కేసీఆర్ జాతీయ పార్టీని విమర్శించిన వారికి ఇవే సమాధానాలు!
X

ప్రస్తుతం దేశంలో మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడి మార్గదర్శకం అవసరం. అందుకు సరైన సమయం నాయకుడు కేసీఆర్ మాత్రమే. సారు జాతీయ పార్టీ పెడుతున్నారని తెలియగానే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు ఇప్పటికే లభించింది. కేసీఆర్ సారు ఏ రాష్ట్రంలో పర్యటన చేసినా ప్రజల మద్దతు సంపూర్ణంగా వస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల రైతులు, అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన కేసీఆర్ ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు. ఆ నిబద్దతతోనే 14 యేండ్లు సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించిన నిజాయితీ, నిబద్ధతే రేపు కేసీఆర్ దేశాన్ని ఏలడానికి తోవ చూపిస్తాయి.

తెలంగాణ కోసం సుదీర్ఘ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి, సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు కేసీఆర్. గడిచిన ఎనిమిదేళ్లలో ఎన్నో రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించి కేంద్ర ప్రభుత్వంచే అవార్డులు అందుకుంది. స్వరాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం, అలాగే ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతదో తెలియని కరెంట్ గోసలు ఇప్పుడేవి? ఇలా వెలుగుల తెలంగాణ ఉత్తగానే ఆవిష్కరణ కాలేదు.

ఇటీవల పక్క రాష్ట్రానికి చెందిన నా సన్నిహితుడు తెలంగాణ రోడ్లు బాగున్నాయని కితాబిచ్చాడు. ఇలా పలు అభివృద్ధి పనుల వెనుక సీఎం కేసీఆర్ నిరంతర కృషి ఉన్నది. ఇదంతా కేసీఆర్ కృషితోనే సాధ్యపడింది. అనతి కాలంలోనే దేశంలోనే తెలంగాణ ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతుందంటే సాధారణ విషయం కాదు. ఇక్కడ అమలవుతున్న పథకం ఇతర రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నది. దీనికి మన ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టాలి.

అవన్నీ కేసీఆర్ విజయాలే కదా?

తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ స్థాపించినప్పుడు, రాష్ట్ర ఏర్పాటుకు బయలుదేరిన రోజు కేసీఆర్‌తో ఏమైతదని చాలా మంది మాట్లాడారు. కానీ, ఆయన సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. విమర్శించిన నోర్లు మూతపడ్డాయి. రాష్ట్రం ఏర్పడ్డాక మనకు పాలించడం రాదని వెక్కిరించారు. ఆ నోర్లే ఇప్పుడు శభాష్ అంటున్నాయి. ఇలా ఒకటేమిటి ఉద్యమం నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా విమర్శలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. వాటన్నింటికి సారు పనితీరే సమాధానం చెబుతుంది.

ఇప్పుడు దేశ రాజకీయాలలోకి అడుగుపెట్టి జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు గిట్లనే మాట్లాడారు. టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగలేదా? అప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీలను నామ రూపాలు లేకుండా చేసి, టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టలేదా? ఇదంతా టీఆర్ఎస్ చరిత్ర కాదా? జాతీయ పార్టీ సాధ్యమా? అనే ప్రశ్నకు మన కళ్ల ముందు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలే సాక్ష్యం. ఇంత సాధించిన కేసీఆర్ దేశాన్ని ఏలుతారంటే నమ్మకపోవడానికి ఏముంటుంది?

అందుకోసమే

ప్రస్తుతం దేశంలో మత రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడి మార్గదర్శకం అవసరం. అందుకు సరైన సమయం నాయకుడు కేసీఆర్ మాత్రమే. సారు జాతీయ పార్టీ పెడుతున్నారని తెలియగానే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మద్దతు ఇప్పటికే లభించింది. కేసీఆర్ సారు ఏ రాష్ట్రంలో పర్యటన చేసినా ప్రజల మద్దతు సంపూర్ణంగా వస్తుంది.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల రైతులు, అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన కేసీఆర్ ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు. ఆ నిబద్దతతోనే 14 యేండ్లు సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించిన నిజాయితీ, నిబద్ధతే రేపు కేసీఆర్ దేశాన్ని ఏలడానికి తోవ చూపిస్తాయి. 'దేశ్ కీ నేత-.జై కేసీఆర్' మీరే మాకు ఆదర్శం. మీ బాటలోనే పయనిస్తాం.


మఠం భిక్షపతి

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

95424 23242

Next Story