బొగ్గు రంగానికి మళ్లీ మొండిచెయ్యి

by Ravi |   (  Updated:2025-02-02 00:30:21  IST  )

ప్రకృతి విరుద్ధంగా బొగ్గు గనుల్లో పనిచేసే వారికి ఆదాయ పన్ను రద్దు చేయాలని

బొగ్గు రంగానికి మళ్లీ  మొండిచెయ్యి
X

ప్రకృతి విరుద్ధంగా బొగ్గు గనుల్లో పనిచేసే వారికి ఆదాయ పన్ను రద్దు చేయా లని ఎన్నో ఏళ్లుగా కోరినా ఏ ప్రభుత్వం కూడా అమలు పరచడం లేదు. కొత్త గనులు వస్తే ఉపాధి పెరిగి నిరుద్యో గం తగ్గుతుందని ఆశగా ఉన్నారు. బడ్జెట్ సపోర్ట్ లేకపోవడం, చట్టాల్లో మార్పు రావడంతో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేక బొగ్గు గనుల వేలం పాటలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సింగరేణి చతికిల పడుతుంది.

కనీస పెన్షన్ పెంచలేదు..

గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి అన్వేషించిన గనులను తమకే అప్పగించాలని కార్మికుల డిమాం డ్‌ను ఈ బడ్జెట్లో అమలు పరిస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. బొగ్గు వెలికితీతలో భాగంగా ఎం తో లోతులో సరిపడా గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో, ప్రతి నిత్యం ప్రమాదాల మాటున పని చేసి, దేశ సౌభాగ్యంకు పాటు పడిన బొగ్గు గని కార్మికులకు కనీస పెన్షన్ పెంచుతారని, ఉచిత వైద్యం కొరకు నూతన పథకాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు ప్రసరిస్తారని గంపెడు ఆశతో ఉన్నారు. కానీ 2025-26 బడ్జెట్‌ లో కూడా బొగ్గు రంగానికి చేయూత నిచ్చే ప్రతిపాదనలు లేకపోవడం తీరని వ్యధ కలిగిస్తోంది. బొగ్గు రంగాని కి ఈ సారి కూడా మొండి చె య్యే చూపడం విచారకరం.

ఇతర రంగాలు..

ఈ బడ్జెట్ కేటాయింపుల్లో 120 విమానాశ్రయాలు ని ర్మించడం మాటేమో కానీ ని రుపేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రయాణం చేసే రైల్వే రంగాన్ని అభివృద్ధి చేయడం అవసరం. నూతన రైళ్లు ప్రవేశ పెట్టాలి. జనరల్ బోగీ లు ప్రతి రైలులో పెంచాలి. అలాగే రైల్వే బోగీల శౌచాలాయాల శుభ్రతకై ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సింది. ఇక ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వలన ప్రభుత్వ రం గంలోని ఎల్ఐసీకి ముప్పు తప్పదు. పాలు, పెరుగు, హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీ రద్దు లాంటి చర్చ రాలేదు. 14 కిలోల గృహోపకరణ గ్యాస్‌పై బడ్జెట్లో తగ్గింపు లేకపోవడం బాధాకరం. కరోనా మహ మ్మారి సమయంలో వృద్దుల కు రద్దు కాబడిన రాయితీలు పునరుద్ధరణ చేయలేకపోవడం బాధాక రం. ఉద్యోగ వర్గాలకు ఊర ట కలిగినా, దినసరి వేతన వర్గాలకు ఒరిగింది ఏమీ లేదు.

ఆళవందార్ వేణుమాధవ్

86860 51752

Next Story