- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలల బలోపేతంకై చర్యలు..
రాష్ట్రంలోని పాఠశాల విద్యను బలోపేతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది.

రాష్ట్రంలోని పాఠశాల విద్యను బలోపేతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగానే బడుల్లో ఉపాధ్యాయులను, పదోన్నతులను, కొత్త నియామకాలు ద్వారా ఏర్పాటు చేయడం, నిర్మాణాత్మకమైన కట్టడాల కొరతను తీర్చేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేయడం జరిగింది. దీంతో పాఠశాలల్లో ఉన్న పలు సమస్యలు తీరిపోనున్నాయి వాటిని పరిశీలిద్దాం.
రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధం చేసింది. దీంట్లో భాగంగానే జిల్లాల వారీగా, క్యాడర్ వారీగా సీనియార్టీ జాబితాలు పాత జిల్లా విద్యాశాఖ అధికారుల అధికారిక వెబ్సైట్ నందు ఉంచింది. అభ్యంతరాలను ఆహ్వానించింది. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించుటకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణకు పునాదులు వేసి పాఠశాల అభి వృద్ధికి పాటుపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో చెడు అలవాట్లకు చోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లాస్థాయి కమిటీలో పాత జిల్లా కేంద్రం విద్యాశాఖ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తూ, పాత జిల్లా కేంద్రం ఏడి నెంబర్ కన్వీనర్ గాను, కొత్త జిల్లా కేంద్రం ఏ డి, పాత కొత్త జిల్లాల సూపర్డెంట్ సభ్యులుగా. కేడర్ వారీగా పరిశీలన కోసం ఉప విద్యాశాఖ అధికారి, డిసిసిబి సెక్రటరీ, సీనియర్ హెడ్మాస్టర్ ప్రత్యేక కమిటీలుగా అభ్యంతరాలను పరిష్కరించడం జరిగింది. జిల్లాస్థాయి కమిటీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
పదోన్నతుల షెడ్యూల్ విడుదల..
తుది సాధారణ సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతి సీనియారిటీ జాబితాను తయారు చేస్తారు. సబార్డినేట్ సర్వీస్ రూల్ 33 ప్రకారం మెరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు. దీని మేరకు సబార్డినేట్ సర్వీస్ రూల్ 20 ప్రకారం రోస్టర్ కం మెరిట్, అడక్వన్సి ఆఫ్ ప్రమోషన్ రిజర్వేషన్స్ నిబంధనలు మేరకు తుది పదోన్నతుల సీనియారిటీ జాబితా తయారు చేస్తారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి వరకు పదోన్నతులు అధికారం జిల్లా విద్యాశాఖ అధికారులకు, ఆపై కేడర్ పదోన్నతులు రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు అధికారాలు ఉంటాయి. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు ఇదే వర్తిస్తుంది. తుది జాబితా విడుదల అనంతరం పదోన్నతుల షెడ్యూల్ విడుదలవుతుంది. తాజాగా అమలులో ఉన్న నిబంధనలో మేరకు సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులు అనేకం మిగులుగా కనిపిస్తున్నాయి. మరి పదోన్నతులకు ఖాళీలపై సందిగ్ధత ఏర్పడుతున్నది. మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే నిబంధనలు వెలువడిన తర్వాత మాత్రమే పదోన్నతులపై స్పష్టమైన వివరాలు అందే అవకాశం ఉంది. అన్ని పాఠశాలల్లో మిగులు అవసరం లెక్కింపులు జరిగిపోయాయి. మిగులు సర్దుబాటులపై ప్రత్యేక నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వు 117కు ప్రత్యామ్నాయంగా విడుదల కానున్నాయి.
మారిపోనున్న పాఠశాలల రూపురేఖలు..
పదోన్నతులతో పాఠశాలల్లో బోధనా సిబ్బందిని పెంచడంతోపాటు తరగతులు నిర్వహణకు కావలసిన నిర్మాణాలన్నింటిని పూర్తి చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగించింది. దీంట్లో భాగంగానే మన బడి - మన భవిష్యత్తు దశ-II కార్యక్రమం కింద 22,344 పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.8,000 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. దీంతో మొదటి విడతగా 407.91 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాల వారీగా పంపిణీ చేయబడ్డ నిధుల వివరాల పట్టికను కూడా విడుదల చేసింది. సదరు నిధులతో పనులు వెంటనే ప్రారంభించేందుకు విద్యాశాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. తదనంతరం తదుపరి కోటా నిధులను కూడా విడుదల చేయుటకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు సమకూరే అవకాశం ఉంది. అయితే నిర్మాణాల విషయంలో కనీస పరిజ్ఞానం లేని ఉపాధ్యాయులను సంబంధిత కట్టడాల బాధ్యత నుండి తప్పించాల్సి ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ విభాగానికి బాధ్యత అప్పజెప్పినప్పుడు మాత్రమే కట్టడాలు దృఢంగా ఉంటాయి.
డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం
పాఠశాలల్లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం అప్రమత్తత పెంచడం కోసం ఈగిల్ క్లబ్బులు (విద్యను అందించు, సమర్థించు, కాపాడు, నాయకత్వం వహించు, సాధికారత కల్పించు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. క్లబ్బులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేయబడ్డాయి. EAGLE క్లబ్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు ప్రకారం ప్రతి క్లబ్‌లో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు నామినేట్ చేసిన సీనియర్ ఉపాధ్యాయుడు క్లబ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. ప్రధానోపాధ్యాయుడు నామినేట్ చేసిన అదనపు ఉపాధ్యాయుడు అసిస్టెంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. నాయకత్వ లక్షణాలు, సామాజిక కారణాలపై ఆసక్తిని ప్రదర్శించే నలుగురు బాలురు, నలుగురు బాలికలను సభ్యులుగా ఎంపిక చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల క్రమ శిక్షణకు పునాదులు వేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో చెడు అలవాట్లకు చోటు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సీవీ ప్రసాద్
రాష్ట్ర అధ్యక్షుడు
ఏపీటీఎఫ్ అమరావతి
90590 76177






